ఉద్యోగాలు

దేశవ్యాప్తంగా నెలకొన్న ఐసీఏఆర్‌ పరిశోధన సంస్థలు/ కేంద్రాల్లో ఐదేళ్ల పదవీకాల ప్రాతిపదికన 349 నాన్‌- రిసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌ పోస్టుల భర్తీకి న్యూదిల్లీలోని అగ్రికల్చరల్‌ సైంటిస్ట్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (ఏఎస్‌ఆర్‌బీ) ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

Published : 13 Oct 2022 00:12 IST

ఐసీఏఆర్‌ పరిశోధన సంస్థల్లో...  

దేశవ్యాప్తంగా నెలకొన్న ఐసీఏఆర్‌ పరిశోధన సంస్థలు/ కేంద్రాల్లో ఐదేళ్ల పదవీకాల ప్రాతిపదికన 349 నాన్‌- రిసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌ పోస్టుల భర్తీకి న్యూదిల్లీలోని అగ్రికల్చరల్‌ సైంటిస్ట్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (ఏఎస్‌ఆర్‌బీ) ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: సంబంధిత విభాగంలో డాక్టోరల్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌/ ప్రొఫెసర్‌తో లేదా తత్సమాన హోదాలో పని అనుభవం లేదా పరిశోధన/ బోధన అనుభవం.  
వయసు: ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌, హెడ్‌ ఆఫ్‌ డివిజన్స్‌ పోస్టులకు 60 ఏళ్లు, సీనియర్‌ సైంటిస్ట్‌-కమ్‌-హెడ్‌ పోస్టులకు 47 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు రుసుము: రూ.1500 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు రుసుము చెల్లించనవసరం లేదు).
ఎంపిక: విద్యార్హతల్లో చూపిన ప్రతిభ, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌, హెడ్‌ ఆఫ్‌ డివిజన్స్‌ పోస్టులకు
ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 20.10.2022.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 31.10.2022.

సీనియర్‌ సైంటిస్ట్‌-కమ్‌-హెడ్‌ పోస్టులకు
ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 01.11.2022.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 11.11.2022.

వెబ్‌సైట్‌: http://www.asrb.org.in/


సైంటిస్ట్‌, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు

వివిధ కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో 52 సైంటిస్ట్‌, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ తదితర పోస్టుల భర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ (ఇంజినీరింగ్‌/ ఆర్కిటెక్చర్‌, ఆయుర్వేదం, ఫార్మసీ/ ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌), పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 27-10-2022 నాటికి సీనియర్‌ డిజైన్‌ ఆఫీసర్‌ పోస్టులకు 40 ఏళ్లు, సైంటిస్ట్‌కు 35 ఏళ్లు, జూనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌/ అసిస్టెంట్‌ ఆర్కిటెక్ట్‌ అండ్‌ డ్రగ్స్‌ ఇన్‌స్పెక్టర్‌కు 30 ఏళ్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఖాళీలకు 45 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు రుసుము: రూ.25 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు).
ఎంపిక: రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 27-10-2022.

వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in/


అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌లు

పంజాబ్‌ రాష్ట్రం జలంధర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ 77 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: బయో టెక్నాలజీ, సివిల్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, ఇండస్ట్రియల్‌ అండ్‌ ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ కంట్రోల్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, టెక్స్‌టైల్‌ టెక్నాలజీ.
అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం
వయసు: 60 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు రుసుము: రూ.2000 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1000).
ఎంపిక: పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 04.11.2022
హార్డ్‌ కాపీ దరఖాస్తులు పంపేందుకు చివరి తేదీ: 14-11-2022.

వెబ్‌సైట్‌: https://www.nitj.ac.in/index.php/nitj_ cinfo/pages/786


రామ్‌ మనోహర్‌ లోహియా వైద్య సంస్థలో...

త్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం లఖ్‌నవూలోని డాక్టర్‌ రామ్‌ మనోహర్‌ లోహియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ 534 నాన్‌-టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ, డిప్లొమా, పీజీ డిప్లొమా, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత.
దరఖాస్తు రుసుము: రూ.1180 (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.708. దివ్యాంగులకు మినహాయింపు ఉంది).
వయసు: 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: కామన్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌, స్కిల్‌ టెస్ట్‌, టెక్నికల్‌ ఎగ్జామినేషన్‌, ఇంటర్వ్యూ, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్‌ మూడు/ నాలుగోవారం, 2022.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్‌, 2022.

వెబ్‌సైట్‌: https://www.drrmlims.ac.in/recruitment


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని