డిగ్రీతో ఐఐటీ కొలువు!

ఇంజినీరింగ్‌, టెక్నాలజీ, సైన్స్‌, ఆర్ట్స్‌ శాఖల్లో విద్యా, పరిశోధనా బోధనల్లో పేరొందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ- కాన్పూర్‌ ‘జూనియర్‌ అసిస్టెంట్‌’ పోస్టులకు దరఖాస్తులను కోరుతోంది. అభ్యర్థులను రెగ్యులర్‌ ప్రాతిపదికన ఉద్యోగంలోకి తీసుకుంటారు.

Published : 17 Oct 2022 00:26 IST

ఇంజినీరింగ్‌, టెక్నాలజీ, సైన్స్‌, ఆర్ట్స్‌ శాఖల్లో విద్యా, పరిశోధనా బోధనల్లో పేరొందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ- కాన్పూర్‌ ‘జూనియర్‌ అసిస్టెంట్‌’ పోస్టులకు దరఖాస్తులను కోరుతోంది. అభ్యర్థులను రెగ్యులర్‌ ప్రాతిపదికన ఉద్యోగంలోకి తీసుకుంటారు. డిగ్రీ పాసై కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏడాది ప్రొబేషనరీ పీరియడ్‌ ఉంటుంది. అభ్యర్థి పనితీరును బట్టి దీన్ని పెంచే అవకాశముంది.

పోస్టుల్లో నియామకం పొందినవారు ఇన్‌కమింగ్‌, ఔట్‌గోయింగ్‌ మెయిల్‌, ఎస్టేట్‌ మేనేజ్‌మెంట్‌, పర్చేస్‌ అండ్‌ ఇంపోర్ట్‌ ఎకౌంట్స్‌, ఆడిట్‌/ హాస్పిటాలిటీ/ రిక్రూట్‌మెంట్‌/ లీగల్‌/ ఆర్‌ అండి డి, ఎస్టాబ్లిష్‌మెంట్‌ వ్యవహారాల విధులను నిర్వర్తించాల్సివుంటుంది.

ప్రకటించిన మొత్తం 119 ఖాళీల్లో ఎస్సీలకు 15, ఎస్టీలకు 2, ఓబీసీలకు 34, పీడబ్ల్యూడీలకు 6, ఈడబ్ల్యూఎస్‌లకు 11, అన్‌-రిజర్వుడ్‌కు 51 పోస్టులను కేటాయించారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే.. అభ్యర్థి వయసు 09.11.2022 నాటికి 21-30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రిజర్వేషన్లు వర్తిస్తాయి. తగిన విద్యార్హతలు ఉంటే ఐఐటీ కాన్పూర్‌లో పనిచేస్తోన్న ఉద్యోగులూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వారికి నిర్దేశించిన గరిష్ఠ వయసు 50 సంవత్సరాలు.

విద్యార్హతలు: డిగ్రీ పాసై కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. డిగ్రీలో 50 శాతం మార్కులు అవసరం. ఎస్టాబ్లిష్‌మెంట్‌ మేటర్స్‌/ ఆర్‌అండ్‌డి/ లీగల్‌/ పర్చేస్‌ అండ్‌ ఇంపోర్ట్‌/ అకౌంట్స్‌/ ఆడిట్‌/హాస్పిటాలిటీ మొదలైన విషయాల్లో రెండేళ్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.700 ఆన్‌లైన్‌ విధానంలో చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు, మహిళలు ఫీజు చెల్లించనవసరం లేదు.

అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి. అప్లికేషన్‌ ప్రింట్‌ అవుట్‌ను పోస్టులో పంపాల్సిన అవసరం లేదు. సగం పూర్తిచేసిన, సంబంధిత పత్రాలను జతపరచని దరఖాస్తులను అనుమతించరు.

వయసు, విద్యార్హతలను నిరూపించే ఒరిజినల్‌ సర్టిఫికెట్లను అవసరమైనప్పుడు సమర్పించాలి. ఎంపికలో పీడబ్ల్యూడీ (పర్సన్స్‌ విత్‌ డిజెబిలిటీ) అభ్యర్థులకు ప్రాధాన్యమిస్తారు.

కాల్‌ లెటర్‌, ఇంటర్వ్యూ, ఎంపికకు సంబంధించిన సమాచారాన్ని అభ్యర్థుల ఈ-మెయిల్‌కు తెలియజేస్తారు. దరఖాస్తు నింపే సమయంలో అభ్యర్థులు ఈ-మెయిల్‌ ఐడీని సరిగా రాయాలి.

రాత పరీక్ష, జాబ్‌ ఓరియంటెడ్‌ ప్రాక్టీస్‌ టెస్ట్‌ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. వీటిల్లో ఎలాంటి మార్పులూ, చేర్పులూ జరిగినా సంస్థ వెబ్‌సైట్‌లో తెలియజేస్తారు. కాబట్టి అభ్యర్థులు తరచూ వెబ్‌సైట్‌ను చూస్తుండాలి.

జాబ్‌ ఓరియంటెడ్‌ ప్రాక్టీస్‌ టెస్ట్‌కు ఎంపికైన అభ్యర్థులు.. అప్పటికే గవర్నమెంట్‌/సెమీ-గవర్నమెంట్‌/ పీఎస్‌యూల్లో పనిచేస్తున్నట్లయితే.. నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌ఓసీ)ని తప్పనిసరిగా సమర్పించాలి.

అభ్యర్థులు ఆన్‌లైన్‌లో సమర్పించిన వివరాలను జాబ్‌ ఓరియంటెడ్‌ ప్రాక్టీస్‌ టెస్ట్‌కు ముందే ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో సరిచూస్తారు. అన్నీ సక్రమంగా ఉంటేనే ఆ తర్వాతి దశకు ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 09.11.2022

వెబ్‌సైట్‌: ‌ www.iitk.ac.in/infocell/recruitment


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు