నోటిఫికేషన్స్‌

ముంబయిలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కార్పొరేట్‌ సెంటర్‌ దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ సర్కిళ్లలో 1422 సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్‌ (సీబీవో) పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. హైదరాబాద్‌ సర్కిల్‌లో 176 ఖాళీలున్నాయి.

Published : 19 Oct 2022 00:47 IST

ఉద్యోగాలు
ఎస్‌బీఐలో 1422 సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్‌లు

ముంబయిలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కార్పొరేట్‌ సెంటర్‌ దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ సర్కిళ్లలో 1422 సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్‌ (సీబీవో) పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. హైదరాబాద్‌ సర్కిల్‌లో 176 ఖాళీలున్నాయి.

ఎస్‌బీఐ సర్కిళ్లు: భోపాల్‌, భువనేశ్వర్‌, హైదరాబాద్‌, జైపుర్‌, కోల్‌కతా, మహారాష్ట్ర, నార్త్‌ ఈస్టర్న్‌.

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్‌ లేదా తత్సమానం. దరఖాస్తు చేసుకున్న సర్కిల్‌కు చెందిన ప్రాంతీయ భాష వచ్చుండాలి.

వయసు: 30-09-2022 నాటికి 21  30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: ఆన్‌లైన్‌ రాత పరీక్ష, స్క్రీనింగ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూలతో.

దరఖాస్తు రుసుము: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పరీక్షా కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 07-11-2022.

ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ: 04-12-2022.

వెబ్‌సైట్‌: https://www.sbi.co.in/


ఇర్కాన్‌లో సైట్‌ మేనేజర్‌ ఖాళీలు

న్యూదిల్లీలోని ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ 16 సైట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: బీఈ/ బీటెక్‌/ డిప్లొమా (సివిల్‌ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణత.

అనుభవం: కనీసం 10 ఏళ్లు పని అనుభవం ఉండాలి.

వయసు: 45 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: రాతపరీక్ష/ ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా.

చిరునామా: JGM/HRM, Ircon International Ltd., Cn4, District Centre, Saket, New Delhi - 110017

ఆఫ్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 05.11.2022

వెబ్‌సైట్‌: https://www.ircon.org/


బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఐటీ ప్రొఫెషనల్స్‌

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 12 ఐటీ ప్రొఫెషనల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: క్లౌడ్‌ ఇంజినీర్‌, అప్లికేషన్‌ ఆర్కిటెక్ట్‌, ఎంటర్‌ప్రైజ్‌ ఆర్కిటెక్ట్‌, ఇంటిగ్రేషన్‌ ఆర్కిటెక్ట్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత.

అనుభవం: కనీసం 10 ఏళ్లు పని అనుభవం ఉండాలి.

వయసు: 32-45 ఏళ్లు మధ్య ఉండాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 24.10.2022

వెబ్‌సైట్‌: https://www.bankofbaroda.in/


ప్రవేశాలు
సాంఘిక సంక్షేమ కళాశాలలో ఎంఏ  

తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ భువనగిరిలోని తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్‌ ఫర్‌ ఉమెన్‌లో మొదటి సంవత్సరం ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ (ఎకనామిక్స్‌) కోర్సులో ప్రవేశాలకు బాలికల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

సీట్ల సంఖ్య: 40.

అర్హత: 2021-22లో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన బాలికలు అర్హులు. జులై 1 నాటికి 16 ఏళ్లు నిండి ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2,00,000 (పట్టణ ప్రాంతం), రూ.1,50,000 (గ్రామీణ ప్రాంతం) మించకూడదు.

ఎంపిక: రాత పరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌, సైకో అనలిటికల్‌ టెస్ట్‌, మెడికల్‌ టెస్ట్‌, లెక్చరట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 25.10.2022.

ప్రవేశ పరీక్ష, ఫైన్‌ ఆర్ట్స్‌ స్కిల్‌ టెస్ట్‌ తేదీ: 30.10.2022.

వెబ్‌సైట్‌: https://www.tswreis.ac.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని