నోటిఫికెషన్స్

గుజరాత్‌ రాష్ట్రం గాంధీనగర్‌లోని నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ ఎన్‌ఎఫ్‌ఎస్‌యూలోని వివిధ స్కూల్స్‌/ సెంటర్‌ ఆఫ్‌ స్టడీస్‌లో 71 ఫ్యాకల్టీ పోస్టులకు డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Updated : 20 Oct 2022 01:31 IST

ఉద్యోగాలు

ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ వర్సిటీలో 71 టీచింగ్‌ పోస్టులు

గుజరాత్‌ రాష్ట్రం గాంధీనగర్‌లోని నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ ఎన్‌ఎఫ్‌ఎస్‌యూలోని వివిధ స్కూల్స్‌/ సెంటర్‌ ఆఫ్‌ స్టడీస్‌లో 71 ఫ్యాకల్టీ పోస్టులకు డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
1. ప్రొఫెసర్‌ 2. అసోసియేట్‌ ప్రొఫెసర్‌
అర్హత: పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు బోధన/ పరిశోధన అనుభవం.
విభాగాలు: ఫోరెన్సిక్‌ సైన్సెస్‌, మెడికో-లీగల్‌ స్టడీస్‌, సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ డిజిటల్‌ ఫోరెన్సిక్స్‌, మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌, పోలీస్‌ సైన్స్‌ అండ్‌ సెక్యూరిటీ స్టడీస్‌, లా, ఫోరెన్సిక్‌ జస్టిస్‌ అండ్‌ పాలసీ స్టడీస్‌, ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, సైకాలజీ, బిహేవియరల్‌ సైన్స్‌, ఓపెన్‌ లెర్నింగ్‌.
దరఖాస్తు రుసుము: జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు ఫీజు చెల్లించనవసరం లేదు.
ఎంపిక: స్క్రీనింగ్‌ పరీక్షలు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 06-11-2022.

వెబ్‌సైట్‌: www.nfsu.ac.in/


ఏపీలో కంప్యూటర్‌ డ్రాఫ్ట్స్‌మ్యాన్‌ గ్రేడ్‌-2 ఖాళీలు

ఏపీ సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ సబ్‌-ఆర్డినేట్‌ సర్వీసులో 8 కంప్యూటర్‌ డ్రాఫ్ట్స్‌మ్యాన్‌ గ్రేడ్‌-2 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్‌సీ దరఖాస్తులు కోరుతోంది.  
అర్హత: ఎస్‌ఎస్‌సీ, నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ ట్రైనింగ్‌ సర్టిఫికెట్‌ ఇన్‌ డ్రాఫ్ట్స్‌మ్యాన్‌ (సివిల్‌) ట్రేడ్‌ ఉత్తీర్ణత.
వయసు: 01.07.2022 నాటికి 18 - 42 ఏళ్లు.
ఎంపిక: రాత పరీక్ష (పేపర్‌-1, 2), కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ (క్వాలిఫైయింగ్‌ టెస్ట్‌) ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 10.11.2022.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 30.11.2022.
ఫీజు చెల్లింపు చివరి తేది: 04.12.2022.

వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in/


ఏపీ ఫారెస్ట్‌ సర్వీసులో ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌లు

ఏపీ ఫారెస్ట్‌ సర్వీసులో ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. తాజా నోటిఫికేషన్‌తో 8 ఖాళీలు భర్తీచేయనుంది.
అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ (అగ్రికల్చర్‌, బోటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌(అగ్రికల్చర్‌/ కెమికల్‌/ సివిల్‌/ కంప్యూటర్‌/ ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రానిక్స్‌/ మెకానికల్‌), ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌, ఫారెస్ట్రీ, జియాలజీ, హార్టికల్చర్‌, వెటర్నరీ సైన్స్‌, మ్యాథమెటిక్స్‌, జువాలజీ).
వయసు: 01.07.2022 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: క్వాలిఫైయింగ్‌ టెస్ట్‌, పేపర్‌-1,2,3,4 పరీక్షల ఆధారంగా.
ఫీజు చెల్లింపు చివరి తేదీ: 04.12.2022.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 05.12.2022.

వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in/


ప్రవేశాలు

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంబీఏ, ఎంసీఏ ప్రోగ్రాం
విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం సెల్ఫ్‌ సపోర్ట్‌ విధానంలో ఎంబీఏ, ఎంసీఏ ప్రోగ్రాంలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఏయూ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్‌లో ఎంబీఏ, ఏయూ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌లో ఎంసీఏ సీట్లు ఉన్నాయి.
ఎంబీఏ (మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌- 44, ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌- 44, హెచ్‌ఆర్‌ మేనేజ్‌మెంట్‌- 44)లో 132 సీట్లు, ఎంసీఏలో 10 సీట్లు ఉన్నాయి.
అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఏపీ ఐసెట్‌-2022 ర్యాంకు.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘డైరెక్టర్‌, డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌, ఆంధ్ర యూనివర్సిటీ, విజయనగర్‌ ప్యాలెస్‌, పెదవాల్తేర్‌, విశాఖపట్నం’ చిరునామాకు పంపించాలి. దరఖాస్తుకు చివరి తేదీ: 22-10-2022.
కౌన్సెలింగ్‌ తేదీ: 25-10-2022.

వెబ్‌సైట్‌: http://www.audoa.in/


తెలంగాణలో పీజీ దంత వైద్య ప్రవేశాలు

తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేటు వైద్య కళాశాలల్లోని పీజీ దంతవైద్య కోర్సులో యాజమాన్య కోటాలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని కాళోజీ నారాయణరావు యూనివర్శిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ తెలిపింది.
అర్హత: బీడీఎస్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నీట్‌ ఎండీఎస్‌-2022లో అర్హత.
కటాఫ్‌ మార్కులు: జనరల్‌ అభ్యర్థులు 24.286 పర్సంటైల్‌(174 మార్కులు), ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు 14.286కు (138 మార్కులు), దివ్యాంగులు 19.286 పర్సంటైల్‌కు (157 మార్కులు).
రిజిస్ట్రేషన్‌, ప్రాసెసింగ్‌ ఫీజు: రూ.6,300
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 23-10-2022

వెబ్‌సైట్‌: https://www.knruhs.telangana.gov.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు