నోటిఫికెషన్స్

న్యూదిల్లీలోని నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ (ఎన్‌హెచ్‌బీ), ఒప్పంద/ రెగ్యులర్‌ ప్రాతిపదికన కింది పోస్టుల నియామకానికి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Updated : 27 Oct 2022 01:24 IST
ఉద్యోగాలు
నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌లు

న్యూదిల్లీలోని నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ (ఎన్‌హెచ్‌బీ), ఒప్పంద/ రెగ్యులర్‌ ప్రాతిపదికన కింది పోస్టుల నియామకానికి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

1. చీఫ్‌ ఎకనామిస్ట్‌: 01 పోస్టు
2. ప్రోటోకాల్‌ ఆఫీసర్‌: 02 పోస్టులు
3. డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ (స్కేల్‌-6): 01 పోస్టు
4. అసిస్టెంట్‌ మేనేజర్‌(స్కేల్‌-1)- జనరల్‌/ హిందీ: 16 పోస్టులు
5. ఆఫీసర్‌(సూపర్‌విజన్‌): 06 పోస్టులు
6. రీజనల్‌ మేనేజర్‌ (స్కేల్‌-4)- కంపెనీ సెక్రటరీ: 01 పోస్టు

మొత్తం ఖాళీలు: 27.

విద్యార్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ, సీఏ, సీఎంఏ, సీఎస్‌, సీఎఫ్‌ఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక: ఆబ్జెక్టివ్‌, డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ. 850(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175).

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 18.11.2022.

ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ: డిసెంబర్‌ 2022/ జనవరి 2023.

వెబ్‌సైట్‌: https://nhb.org.in/en/


కేంద్ర విభాగాల్లో జూనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌, ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌లు

వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

1. ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌: 01 పోస్టు
2. జూనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌(బయాలజీ): 01 పోస్టు
3. జూనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌(కెమిస్ట్రీ): 01 పోస్టు
4. ఇన్వెస్టిగేటర్‌ గ్రేడ్‌-1: 12 పోస్టులు

మొత్తం ఖాళీలు: 15.

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ/ బీటెక్‌/ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయసు: 27-10-2022 నాటికి ఇన్వెస్టిగేటర్‌, జూనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌ పోస్టులకు 30 ఏళ్లు, ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ పోస్టులకు 38 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు రుసుము: రూ.25 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 10-11-2022.

వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in/


ఫ్యాక్ట్‌, కొచ్చిలో టెక్నీషియన్‌ పోస్టులు

కేరళ రాష్ట్రం కొచ్చిలోని కేంద్ర ప్రభుత్వ రంగం సంస్థ - ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ ట్రావెన్‌కోర్‌ లిమిటెడ్‌ కింది పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
టెక్నీషియన్‌(ప్రాసెస్‌): 45 పోస్టులు

అర్హత: బీఎస్సీ(కెమిస్ట్రీ/ ఇండస్ట్రియల్‌ కెమిస్ట్రీ) లేదా ఇంజినీరింగ్‌ డిప్లొమా (కెమికల్‌ ఇంజినీరింగ్‌/ కెమికల్‌ టెక్నాలజీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం.

పే స్కేల్‌: రూ.9250 - రూ.32000.

వయసు: 35 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు రుసుము: రూ.590 (ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎంఎస్సీ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

ఎంపిక: రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 16.11.2022.

వెబ్‌సైట్‌: https://fact.co.in/


అప్రెంటిస్‌
సెయిల్‌, రవుర్కెలాలో 261 అప్రెంటిస్‌ ఖాళీలు

డిశా రాష్ట్రం రవుర్కెలాలోని స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌), రవుర్కెలా స్టీల్‌ ప్లాంట్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

1. ట్రేడ్‌ అప్రెంటిస్‌- 113
2. టెక్నీషియన్‌ అప్రెంటిస్‌- 107
3. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌- 41

మొత్తం ఖాళీలు: 261

అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ/ డిప్లొమా/ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: (30-11-2022 నాటికి): 18 నుంచి 24 సంవత్సరాలు.

ఎంపిక: సంబంధిత బ్రాంచి/ ట్రేడు విద్యార్హతలో సాధించిన మార్కుల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 30-11-2022.

వెబ్‌సైట్‌:www./sail.co.in/en/home


వాక్‌ ఇన్‌
తిరుపతి ఆర్‌ఏఆర్‌ఎస్‌లో...

తిరుపతిలోని పాలిటెక్నిక్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

1. టీచింగ్‌ అసోసియేట్‌: 02 పోస్టులు
2. టీచింగ్‌ అసిస్టెంట్‌: 20 పోస్టులు

అర్హతలు: అగ్రి బీఎస్సీ, బీటెక్‌(అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌), పీహెచ్‌డీ(అగ్రికల్చరల్‌) ఉత్తీర్ణత.

వయసు: టీచింగ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 35 ఏళ్లు, టీచింగ్‌ అసోసియేట్‌ పోస్టులకు పురుషులకు 40 ఏళ్లు, మహిళలకు 45 ఏళ్లు మించకూడదు.

వేతనాలు: టీచింగ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు రూ.30,000, టీచింగ్‌ అసోసియేట్‌ పోస్టులకు రూ.54,000.

వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ తేదీ: 31.10.2022.

వేదిక: అసోసియేట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ రిసెర్చ్‌ కార్యాలయం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, తిరుపతి.

వెబ్‌సైట్‌: https://angrau.ac.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని