నోటిఫికేషన్స్‌

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్‌ బ్యూరో దేశవ్యాప్తంగా ఉన్న సబ్సిడరీ ఇంటెలిజెన్స్‌ బ్యూరోల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 1671 సెక్యూరిటీ అసిస్టెంట్‌/ ఎగ్జిక్యూటివ్‌, మల్టీ-టాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Published : 31 Oct 2022 01:02 IST

ఉద్యోగాలు
ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో 1671 పోస్టులు

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్‌ బ్యూరో దేశవ్యాప్తంగా ఉన్న సబ్సిడరీ ఇంటెలిజెన్స్‌ బ్యూరోల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 1671 సెక్యూరిటీ అసిస్టెంట్‌/ ఎగ్జిక్యూటివ్‌, మల్టీ-టాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

1. సెక్యూరిటీ అసిస్టెంట్‌/ ఎగ్జిక్యూటివ్‌: 1,521 పోస్టులు
2. మల్టీ-టాస్కింగ్‌ స్టాఫ్‌(ఎంటీఎస్‌): 150 పోస్టులు

అర్హతలు: మెట్రిక్యులేషన్‌ ఉత్తీర్ణతతో పాటు స్థానిక భాషపై అవగాహన ఉండాలి.

వయసు: 25.11.22 నాటికి ఎస్‌ఏ/ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు 25 ఏళ్లు, ఎంటీఎస్‌ పోస్టులకు 27 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: టైర్‌-1, టైర్‌-2, టైర్‌-3 పరీక్షల ఆధారంగా.

పరీక్ష ఫీజు: రూ.500 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.50)

ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభం: 05-11-2022.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 25-11-2022.

వెబ్‌సైట్‌: https://www.mha.gov.in/


డీఆర్‌డీవోలో స్టెనోగ్రాఫర్‌, అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌లు

దేశవ్యాప్తంగా ఉన్న భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) పరిశోధన కేంద్రాల్లో 1061 స్టెనోగ్రాఫర్‌, అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.. పోస్టుల వివరాలు..

1. జూనియర్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్‌ (జేటీవో): 33  
2. స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-1 (ఇంగ్లిష్‌ టైపింగ్‌): 215  
3. స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-2 (ఇంగ్లిష్‌ టైపింగ్‌): 123
4. అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌ ‘ఎ’ (ఇంగ్లిష్‌ టైపింగ్‌): 250
5. అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌ ‘ఎ’ (హిందీ టైపింగ్‌): 12  
6. స్టోర్‌ అసిస్టెంట్‌ ‘ఎ’ (ఇంగ్లిష్‌ టైపింగ్‌): 134
7. స్టోర్‌ అసిస్టెంట్‌ ‘ఎ’ (హిందీ టైపింగ్‌): 04  
8. సెక్యూరిటీ అసిస్టెంట్‌ ‘ఎ’: 41  
9. వెహికల్‌ ఆపరేటర్‌ ‘ఎ’: 145  
10. ఫైర్‌ ఇంజిన్‌ డ్రైవర్‌ ‘ఎ’: 18  
11. ఫైర్‌మ్యాన్‌: 86 

అర్హతలు: పోస్టులను అనుసరించి పదో తరగతి, పన్నెండో తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత, టైపింగ్‌ పరిజ్ఞానం, డ్రైవింగ్‌ లైసెన్సు కలిగి ఉండాలి.

వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. జేటీవో, స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-1 పోస్టులకు- 30 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు రుసుము: రూ.100 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

ఎంపిక: పోస్టును అనుసరించి టైర్‌-1 (సీబీటీ), టైర్‌-2 (నైపుణ్య, శారీరక దృఢత్వ, సామర్థ్య పరీక్షలు) తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేదీ: 07-11-2022.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 07-12-2022.

వెబ్‌సైట్‌: www.drdo.gov.in/ceptm-advertisement/1782


అణుశక్తి విభాగంలో సెక్యూరిటీ గార్డు, ఏఎస్‌వో పోస్టులు

డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీకి చెందిన అటామిక్‌ మినరల్స్‌ డైరెక్టరేట్‌ ఫర్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ దేశవ్యాప్తంగా ఉన్న డీఏఈ యూనిట్లు/ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.

1. జూనియర్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్‌ (జేటీవో): 09 పోస్టులు
2. అసిస్టెంట్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ (ఏఎస్‌వో): 38 పోస్టులు
3. సెక్యూరిటీ గార్డు: 274 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత.

వయసు: జేటీవో పోస్టులకు 18-28 ఏళ్లు, మిగిలిన ఖాళీలకు 18-27 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: పోస్టును అనుసరించి లెవల్‌-1(రాత పరీక్ష), లెవల్‌-2 (డిస్క్రిప్టివ్‌ రాత పరీక్ష), ఫిజికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము: రూ.200. సెక్యూరిటీ గార్డ్‌ పోస్టులకు రూ.100 చెల్లించాలి. (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, మాజీ సైనికులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్‌, విశాఖపట్నం.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 17-11-2022.

ఏఎస్‌వో-ఎ, సెక్యూరిటీ గార్డు పోస్టుల ఫిజికల్‌ టెస్ట్‌ తేదీలు: డిసెంబర్‌, 2022.

జేటీవో(లెవల్‌-1), సెక్యూరిటీ గార్డు పోస్టుల రాత పరీక్ష (కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష) తేదీలు: జనవరి, 2023

జేటీవో(లెవల్‌-2), ఏఎస్‌వో-ఎ డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌ తేదీ: ఫిబ్రవరి, 2023.

వెబ్‌సైట్‌: amd.gov.in/app16/recruitmentdetails.aspx?rid=31


ఆర్మీ ఆర్డినెన్స్‌ కార్ప్స్‌లో....

సికింద్రాబాద్‌లోని సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ సెల్‌, ఆర్మీ ఆర్డినెన్స్‌ కార్ప్స్‌ సెంటర్‌ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రీజియన్లలో మెటీరియల్‌ అసిస్టెంట్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల ప్రొబేషనరీ పీరియడ్‌ ఉంటుంది.

మెటీరియల్‌ అసిస్టెంట్‌: 419 పోస్టులు

రీజియన్ల వారీగా ఖాళీలు: ఈస్టర్న్‌- 10, వెస్టర్న్‌- 120, నార్తర్న్‌- 23, సదరన్‌- 32, సౌత్‌ వెస్టర్న్‌- 23, సెంట్రల్‌ వెస్ట్‌- 185, సెంట్రల్‌ ఈస్ట్‌- 26.

అర్హతలు: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్‌ లేదా డిప్లొమా ఇంజినీరింగ్‌/ డిప్లొమా(మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌) ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక: శారీరక దార్ఢ్య/ స్కిల్‌ టెస్ట్‌, రాత పరీక్ష ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు: ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌లో ప్రకటన ప్రచురితమైన తేదీ(అక్టోబర్‌ 22-28) నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తు చేయాలి.

వెబ్‌సైట్‌: https://www.aocrecruitment.gov.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని