Published : 08 Nov 2022 00:12 IST

నోటిఫికేషన్స్

ఉద్యోగాలు

ఈసీహెచ్‌ఎస్‌-సికింద్రాబాద్‌లో మెడికల్‌ పోస్టులు

సికింద్రాబాద్‌లోని ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కంట్రిబ్యూటరీ హెల్త్‌ స్కీమ్‌ స్టేషన్‌ స్థానిక అభ్యర్థుల నుంచి 55 మెడికల్‌, పారామెడికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: మెడికల్‌ స్పెషలిస్ట్‌, గైనకాలజిస్ట్‌, మెడికల్‌ ఆఫీసర్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఫిజియోథెరపిస్ట్‌, నర్సింగ్‌ అసిస్టెంట్‌.

విభాగాలు: డెంటల్‌, ఫిజియోథెరపీ, ఫార్మసిస్ట్‌, గైనకాలజీ, నర్సింగ్‌ అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో 10+2/ గ్రాడ్యుయేషన్‌/ ఎంబీబీఎస్‌/ బీడీఎస్‌/ డిప్లొమా/ బీఫార్మసీ/ జీఎన్‌ఎం ఉత్తీర్ణత.
ఎంపిక: ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా.               

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
చిరునామా: స్టేషన్‌ హెడ్‌క్వార్టర్స్‌ ఈసీహెచ్‌ఎస్‌ సెల్‌, సీ/ఓ బైసన్‌ యూఆర్‌సీ కాంప్లెక్స్‌, నాగ్‌ మందిర్‌ రోడ్‌, తిరుమలగిరి పోస్ట్‌, సికింద్రాబాద్‌ 500015, తెలంగాణ.
దరఖాస్తుకు చివరి తేదీ: 19.11.2022
ఇంటర్వ్యూలు: 05.12.2022 నుంచి 10.12.2022 వరకు.
వెబ్‌సైట్‌: https://echs.gov.in/


రెప్కో బ్యాంక్‌-చెన్నైలో...

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన చెన్నైలోని రెప్కో బ్యాంక్‌ 50 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* జూనియర్‌ అసిస్టెంట్‌/ క్లర్క్‌ పోస్టులు.
రాష్ట్రాల వారీగా ఖాళీలు: నీ తమిళనాడు: 40 నీ ఆంధ్రప్రదేశ్‌: 4 నీ కేరళ: 2 నీ కర్ణాటక: 4
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.
వయసు: 21-28 ఏళ్లు ఉండాలి.
ఎంపిక: ఆన్‌లైన్‌ పరీక్ష ఆధారంగా.
పరీక్షలో: రీజనింగ్‌, ఇంగ్లిష్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 200 ప్రశ్నలకు 200 మార్కులు, 120 నిమిషాలు సమయం కేటాయిస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.900.
దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: 25.11.2022
వెబ్‌సైట్‌: www.repcobank.com/careers.php

 


జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్లు

పంజాబ్‌ రాష్ట్రం చండీగఢ్‌లోని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ టీచర్స్‌ ట్రైనింగ్‌ అండ్‌ రిసెర్చ్‌.. కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* మొత్తం ఖాళీల సంఖ్య: 25
1. సీనియర్‌ ప్రొడ్యూసర్‌: 01 పోస్టు
2. ఎస్టేట్‌ ఆఫీసర్‌: 01 పోస్టు
3. సీనియర్‌ లైబ్రరీ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌: 02 పోస్టులు
4. టెక్నీషియన్‌: 03 పోస్టులు
5. స్టెనో గ్రేడ్‌-2: 05 పోస్టులు
6. జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌(ఎల్‌డీసీ): 13 పోస్టులు
అర్హత: 12వ తరగతి, స్టెనో, టైపింగ్‌, డిప్లొమా, డిగ్రీ, బీటెక్‌, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం.
ఎంపిక: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా.
దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 16-12-2022.
వెబ్‌సైట్‌:  www.nitttrchd.ac.in/

 


95 స్టాఫ్‌ అసిస్టెంట్‌ ఖాళీలు

ఏలూరులోని ఏలూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్‌.. శాశ్వత ప్రాతిపదికన స్టాఫ్‌ అసిస్టెంట్‌/ క్లర్క్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.
* స్టాఫ్‌ అసిస్టెంట్‌/ క్లర్క్‌: 95 పోస్టులు
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఇంగ్లిష్‌, తెలుగు భాషల ప్రావీణ్యం, కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరి.
వయసు: 01.10.2022 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: ఆన్‌లైన్‌ టెస్ట్‌/ ఎగ్జామినేషన్‌, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.590 (ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌, దివ్యాంగులకు రూ.413).
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 20.11.2022.
ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ: డిసెంబర్‌ 2022.
వెబ్‌సైట్‌: https://apcob.org/careers/


అప్రెంటిస్‌

వెస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌లో 316 ఖాళీలు

మహారాష్ట్ర నాగ్‌పుర్‌లోని వెస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌.. గ్రాడ్యుయేట్‌ అండ్‌ టెక్నీషియన్‌ అప్రెంటిస్‌షిప్‌ శిక్షణకు  దరఖాస్తులు కోరుతోంది.
1. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 101 ఖాళీలు
2. టెక్నీషియన్‌ అప్రెంటిస్‌: 215 ఖాళీలు
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణత.
స్ట్టైపెండ్‌: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లకు రూ.9000; టెక్నీషియన్‌ అప్రెంటిస్‌లకు రూ.8000.
శిక్షణ కాలం: ఒక సంవత్సరం.
ఎంపిక: విద్యార్హత పరీక్షల్లో సాధించిన మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా.
దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 22-11-2022.
వెబ్‌సైట్‌: www.westerncoal.in/index1.php


కెరియర్‌, ఉన్నతవిద్యలకు సంబంధించి మీ సందేహాలు పంపాల్సిన మా చిరునామా: చదువు, ఈనాడు కార్యాలయం, అనాజ్‌పూర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం, రామోజీ ఫిల్మ్‌సిటీ- 501 512


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు