Published : 10 Nov 2022 00:02 IST

నోటిఫికేషన్స్‌

ఉద్యోగాలు
భారత్‌ ఎలక్ట్రానిక్స్‌లో..

బెంగళూరులోని భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ తాత్కాలిక ప్రాతిపదికన ట్రైనీ ఇంజినీర్‌, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

1. ట్రైనీ ఇంజినీర్‌-1: 50 పోస్టులు
2. ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌-1: 61 పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య: 111
విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌.
అర్హత: బీఈ, బీటెక్‌, బీఎస్సీ ఇంజినీరింగ్‌ డిగ్రీ (ఎలక్ట్రానిక్స్‌/ మెకానికల్‌/ కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌).
వయసు: 01.10.2022 నాటికి టీఈ పోస్టులకు 28 ఏళ్లు, పీఈ పోస్టులకు 32 ఏళ్లు మించకూడదు.
వేతనం: టీఈ పోస్టులకు రూ.30,000 - రూ.40,000, పీఈ పోస్టులకు రూ.40,000 - రూ.55,000..
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: పీఈ పోస్టులకు రూ.400, టీఈ పోస్టులకు రూ.150.
ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 23.11.2022.

వెబ్‌సైట్‌: www.belnindia.in/


హైదరాబాద్‌ జిల్లాలో మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

తెలంగాణ ప్రభుత్వం, కలెక్టర్‌ అండ్‌ జిల్లా మేజిస్ట్రేట్‌ అండ్‌ ఛైర్మన్‌ కార్యాలయం, జిల్లా హెల్త్‌ సొసైటీ, హైదరాబాద్‌ జిల్లా బస్తీ దవాఖానాలు, యూపీహెచ్‌సీల్లో ఒప్పంద ప్రాతిపదికన మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. మెడికల్‌ ఆఫీసర్‌(ఫుల్‌ టైం): 05 పోస్టులు
2. మెడికల్‌ ఆఫీసర్‌(బస్తీ దవాఖానా): 26 పోస్టులు
అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత.
వేతనం: రూ.52,000..
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను డీఎంహెచ్‌వో, హైదరాబాద్‌, 4వ అంతస్తు, జీహెచ్‌ఎంసీ భవనం, ప్యాట్నీ, సికింద్రాబాద్‌ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 11.11.2022.

వెబ్‌సైట్‌: https://hyderabad.telangana.gov.in/


ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకులో..

చెన్నైలోని ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, డిజిటల్‌ బ్యాంకింగ్‌ విభాగాల్లో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ ఖాళీల భర్తీకి  ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

స్పెషలిస్ట్‌ ఆఫీసర్స్‌ - ఐటీ ప్రొఫెషనల్‌ (ఎంఎంజీ స్కేల్‌-2): 25 పోస్టులు
విభాగాలు: బిజినెస్‌ అనలిస్ట్‌, డేటా ఇంజినీర్‌, క్లౌడ్‌ ఇంజినీర్‌, డేటా సైంటిస్ట్‌, నెట్‌వర్క్‌ సెక్యూరిటీ ఇంజినీర్‌, ఒరాకిల్‌ డీబీఏ, మిడిల్‌వేర్‌ ఇంజినీర్‌, సర్వర్‌ అడ్మినిస్ట్రేటర్‌, రూటింగ్‌ అండ్‌ స్విచింగ్‌ ఇంజినీర్‌, హార్డ్‌వేర్‌ ఇంజినీర్‌, సొల్యూషన్‌ ఆర్కిటెక్ట్‌, డిజిటల్‌ బ్యాంకింగ్‌, ఏటీఎం మేనేజ్డ్‌ సర్వీసెస్‌ అండ్‌ ఏటీఎం స్విచ్‌, మర్చంట్‌ అక్విజిషన్‌, కంప్లైన్స్‌ అండ్‌ ఆడిట్‌.
అర్హత: బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌/ ఎంఎస్సీ/ ఎంబీఏ/ ఎంసీఏ/ పీజీ డిప్లొమాతో పాటు పని అనుభవం.
వయసు: 25 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
నెలకు రూ.48,170 -రూ.69,810 వేతనం.
ఎంపిక: ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.500 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.100).
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 30.11.2022.

వెబ్‌సైట్‌: https://www.iob.in/1Careers1


నోయిడా ఐడబ్ల్యూఏఐలో స్టెనో, ఎల్‌డీసీ ఖాళీలు

నోయిడాలోని ఇన్‌ల్యాండ్‌ వాటర్‌వేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఖిజూతిఖి) ప్రధాన, ప్రాంతీయ కార్యాలయాల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా ఖాళీల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

1. డిప్యూటీ డైరెక్టర్‌: 02 పోస్టులు
2. ఈడీపీ అసిస్టెంట్‌: 01 పోస్టు
3. జూనియర్‌ హైడ్రోగ్రాఫిక్‌ సర్వేయర్‌: 03 పోస్టులు
4. స్టెనోగ్రాఫర్‌-డి: 04 పోస్టులు
5. లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌: 04 పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య: 14.
అర్హత: 12వ తరగతి, టైపింగ్‌ (ఇంగ్లిష్‌/హిందీ), సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీతో పాటు పని అనుభవం.
దరఖాస్తు రుసుము: రూ.500 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.250).
ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 18.11.2022.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 17.12.2022.

వెబ్‌సైట్‌: https://iwai.nic.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు