Updated : 15 Nov 2022 05:04 IST

నోటిఫికేషన్స్

ప్రభుత్వ ఉద్యోగాలు

ఏపీలో సివిల్‌ జడ్జి పోస్టులు

అమరావతిలోని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. ఏపీ స్టేట్‌ జ్యుడీషియల్‌ సర్వీస్‌లో 31 సివిల్‌ జడ్జి (జూనియర్‌ డివిజన్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  
అర్హత: న్యాయశాస్త్రంలో బ్యాచిలర్స్‌ డిగ్రీ.
వయసు: 01-11-2022 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక: స్క్రీనింగ్‌ టెస్ట్‌ (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌), రాత పరీక్ష, మౌఖిక పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.1500 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.750).
స్క్రీనింగ్‌ టెస్ట్‌ కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.
ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 17-11-2022.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 08-12-2022.
వెబ్‌సైట్‌: https://hc.ap.nic.in/recruitment.html


ఇంజినీర్‌, సూపర్‌వైజర్‌ ఖాళీలు

నాగ్‌పుర్‌లోని భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌, పవర్‌ సెక్టార్‌ వెస్టర్న్‌ రీజియన్‌.. దేశవ్యాప్తంగా వివిధ ప్రాజెక్టు పనుల్లో 32 ఇంజినీర్‌, సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఇంజినీర్‌: 12 పోస్టులు బీ సూపర్‌వైజర్‌: 20 పోస్టులు
వయసు: 31.10.2022 నాటికి 45 సంవత్సరాలు మించకూడదు.
అర్హత: డిప్లొమా, బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌ (సివిల్‌ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం.
ఎంపిక: డిగ్రీ/ డిప్లొమా మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా.
ప్రాసెసింగ్‌ రుసుము: రూ.200(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది).
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 21/11/2022.
వెబ్‌సైట్‌: https://www.bhel.com/


ఎన్‌సీడీఐఆర్‌-బెంగళూరులో..

బెంగళూరులోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ ఇన్ఫర్మేటిక్స్‌ అండ్‌ రిసెర్చ్‌(ఎన్‌సీడీఐఆర్‌) 21 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌, కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌, ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ ..మొదలైనవి.
విభాగాలు: స్టాటిస్టిక్స్‌, మెడికల్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్‌/ ఎంబీబీఎస్‌/ ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ/ మాస్టర్స్‌ డిగ్రీ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత.
వయసు: 30 నుంచి 40 ఏళ్లు.
ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ వేదిక: ఐసీఎంఆర్‌-ఎన్‌సీడీఐఆర్‌, బెంగళూరు.
ఇంటర్వ్యూ తేదీ: నవంబరు 22, 23, 24.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 8:00 నుంచి 10:30 వరకు.
వెబ్‌సైట్‌:https://ncdirindia.org/Ncdir_Career.aspx


అప్రెంటిస్‌షిప్‌

ఐఓసీఎల్‌ పైప్‌లైన్స్‌ విభాగంలో...

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, పైప్‌లైన్స్‌ డివిజన్‌ పరిధిలోని 5 రీజియన్‌లలో కింద పేర్కొన్న టెక్నికల్‌/ నాన్‌-టెక్నికల్‌ ట్రేడుల్లో అప్రెంటిస్‌ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.
అప్రెంటిస్‌ ఖాళీలు: 465 (యూఆర్‌- 233, ఎస్సీ- 63, ఎస్టీ- 34, ఓబీసీ- 96, ఈడబ్ల్యూఎస్‌- 39).
ట్రేడులు: మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, టీ అండ్‌ ఐ, హ్యూమన్‌ రిసోర్స్‌, అకౌంట్స్‌/ ఫైనాన్స్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, డొమెస్టిక్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌.
అర్హత: 12వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 10.11.2022 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, వైద్యపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 30.11.2022.
రాత పరీక్ష తేదీ: 18.12.2022.
వెబ్‌సైట్‌: https://iocl.com/apprenticeships


డీఆర్‌డీఓ-సీవీఆర్‌డీఈలో..

చెన్నై అవడిలోని డీఆర్‌డీఓ- కంబాట్‌ వెహికల్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (సీవీఆర్‌డీఈ).. ఏడాది అప్రెంటిస్‌షిప్‌ శిక్షణ కోసం దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 60. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు: 40 ఖాళీలు టెక్నీషియన్‌(డిప్లొమా) అప్రెంటిస్‌లు: 20 ఖాళీలు
అర్హతలు: సంబంధిత విభాగంలో డిప్లొమా/ డిగ్రీ (ఇంజినీరింగ్‌ లేదా టెక్నాలజీ) ఉత్తీర్ణత.
ఎన్‌ఏటీఎస్‌ పోర్టల్‌లో వివరాల నమోదుకు చివరి తేదీ: 25.11.2022.
సీవీఆర్‌డీఈ దరఖాస్తుకు చివరి తేదీ: 05.12.2022
ర్యాంకు జాబితా విడుదల: 10.12.2022.
వెబ్‌సైట్‌: https://www.drdo.gov.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు