నోటిఫికేషన్స్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం, డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ ఏపీ డీఎంఈ పరిధిలోని ప్రభుత్వ వైద్య, దంత వైద్య కళాశాలల్లో 49 స్పెషాలిటీల్లో 1,458 సీనియర్‌ రెసిడెంట్‌ ఖాళీల భర్తీకి నియామక ప్రకటన వెలువడింది.  

Updated : 16 Nov 2022 04:17 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

ఏపీలో 1,458 సీనియర్‌ రెసిడెంట్లు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం, డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ ఏపీ డీఎంఈ పరిధిలోని ప్రభుత్వ వైద్య, దంత వైద్య కళాశాలల్లో 49 స్పెషాలిటీల్లో 1,458 సీనియర్‌ రెసిడెంట్‌ ఖాళీల భర్తీకి నియామక ప్రకటన వెలువడింది.  
అర్హత: మెడికల్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ(డీఎం/ ఎంసీహెచ్‌/ ఎండీ/ ఎంఎస్‌/ ఎండీఎస్‌). ఏపీ ప్రభుత్వ మెడికల్‌, డెంటల్‌ కాలేజీలలో పీజీ చదివిన స్థానిక అభ్యర్థులు అర్హులు.
వయసు: 45 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఫైనల్‌ ఎగ్జామ్‌ మెరిట్‌, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులు రూ.500, బీసీ, ఈడబ్ల్యూఎస్‌, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.250.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 19-11-2022.
వెబ్‌సైట్‌: https://dme.ap.nic.in/


ఐఎంఎంటీ-భువనేశ్వర్‌లో...

భువనేశ్వర్‌లోని సీఎస్‌ఐఆర్‌ ఆధ్వర్యంలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మినరల్స్‌ అండ్‌ మెటీరియల్స్‌ టెక్నాలజీ(ఐఎంఎంటీ) 25 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, ప్రాజెస్ట్‌ అసోసియేట్‌, జేఆర్‌ఎఫ్‌, ప్రాజెక్ట్‌ ఫెలో తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌/ బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ/ డిప్లొమా/ ఎంఎస్సీ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత.
వయసు: 35-50 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 24.11.2022
వెబ్‌సైట్‌: https://www.immt.res.in/


వాక్‌-ఇన్స్‌

నైగ్రిమ్స్‌-షిల్లాంగ్‌లో 37 సీనియర్‌ రెసిడెంట్‌లు

షిల్లాంగ్‌లోని నార్త్‌ఈస్టర్న్‌ ఇందిరాగాంధీ రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నైగ్రిమ్స్‌) 37 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: ఫార్మకాలజీ, యూరాలజీ, న్యూరాలజీ, జనరల్‌ మెడిసిన్‌, బయోకెమిస్ట్రీ, జనరల్‌ సర్జరీ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/ డిప్లొమా.
వయసు: 45 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ వేదిక:  Conference Hall, NEIGRIHMS Guest House, Permanent Campus, Mawdiangdiang, Shillong 793018.
ఇంటర్వ్యూ తేదీ:
22, 23, 24.11.2022
http://neigrihms.gov.in/adsnotification.html


ప్రవేశాలు

ప్రజారోగ్యంలో పీజీ(ఎంపీహెచ్‌)

వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం… కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్‌ అనుబంధ కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికి మాస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ కోర్సు (ఎంపీహెచ్‌) కోర్సుకు సంబంధించి ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులైన వారందరూ ఈ కోర్సులో చేరడానికి అర్హులు.
కాంపిటెంట్‌ అథారిటీ కోటా: 20 సీట్లు
మేనేజ్‌మెంట్‌ కోటా: 16 సీట్లు
ఫారిన్‌ నేషనల్స్‌ కోటా: 04 సీట్లు
అర్హత: ఏదైనా విభాగంలో కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత.
రిజిస్ట్రేషన్‌ ఫీజు: రూ.4000 (ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.3000)
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 19.11.2022.
కంప్యూటర్‌ ఆధారిత ప్రవేశ పరీక్ష తేదీ: 27.11.2022.
https://cdn3.digialm.com/EForms/configuredHtml/1680/80179/Index.html


అప్రెంటిస్‌

బీఈఎంఎల్‌ లిమిటెడ్‌, బెంగళూరులో ..

భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌ లిమిటెడ్‌(బీఈఎంఎల్‌), బెంగళూరు కాంప్లెక్స్‌
ఏడాది అప్రెంటిస్‌ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఇంజినీరింగ్‌ విభాగాలు: ఆటోమొబైల్‌, సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌,  ఎలక్ట్రికల్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, మెకానికల్‌.
అప్రెంటిస్‌: 80 ఖాళీలు
అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్‌/ డిప్లొమా.
శిక్షణ వ్యవధి: సంవత్సరం.
దరఖాస్తు: అభ్యర్థులు బయోడేటాను జిరాక్స్‌ కాపీలతో పాటు ఏజీఎం (ట్రైనింగ్‌), బీఈఎంఎల్‌ లిమిటెడ్‌, బెంగళూరు కాంప్లెక్స్‌, న్యూ తిప్పసంద్ర పోస్టు, బెంగళూరు చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 21-11-2022.
వెబ్‌సైట్‌: https://www.bemlindia.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని