నోటిఫికేషన్స్‌

దిల్లీలోని ఎయిమ్స్‌లో అవుట్‌సోర్స్‌ ప్రాతిపదికన 20 జూనియర్‌ ఫిజియోథెరపిస్ట్‌ పోస్టుల భర్తీకి బ్రాడ్‌కాస్ట్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Updated : 21 Nov 2022 03:37 IST

ఉద్యోగాలు
ఎయిమ్స్‌ న్యూదిల్లీలో జూనియర్‌ ఫిజియోథెరపిస్ట్‌లు

దిల్లీలోని ఎయిమ్స్‌లో అవుట్‌సోర్స్‌ ప్రాతిపదికన 20 జూనియర్‌ ఫిజియోథెరపిస్ట్‌ పోస్టుల భర్తీకి బ్రాడ్‌కాస్ట్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

అర్హత: ఇంటర్‌ (సైన్స్‌), ఫిజియోథెరపీలో డిగ్రీ.

నెలవారీ వేతనం: రూ.25,000.

ఎంపిక: స్కిల్‌ టెస్ట్‌/ ఇంటర్వ్యూ/ ఇంటరాక్షన్‌ ఆధారంగా.

దరఖాస్తుకు చివరి తేదీ: 03.12.2022.

వెబ్‌సైట్‌: https://www.becil.com/


జిప్‌మర్‌లో 136 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు

పుదుచ్చేరి, కరైకాల్‌లోని జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (జిప్‌మర్‌) రెగ్యులర్‌ ప్రాతిపదికన కింది విభాగాల్లో 136 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

విభాగాలు: అనస్తీషియాలజీ అండ్‌ క్రిటికల్‌ కేర్‌, అనాటమీ, బయోకెమిస్ట్రీ, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ అండ్‌ ఎస్‌టీడీ, ఎమర్జెన్సీ మెడిసిన్‌, ఈఎన్‌టీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ అండ్‌ టాక్సికాలజీ, జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, జెరియాట్రిక్‌ మెడిసిన్‌, మైక్రోబయాలజీ, నియోనటాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, న్యూక్లియర్‌ మెడిసిన్‌, ఆబ్‌స్టెట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ, ఆఫ్తల్మాలజీ, ఆర్థోపెడిక్స్‌, పీడియాట్రిక్స్‌, పాథాలజీ, ఫార్మకాలజీ, ఫిజియాలజీ, ప్లాస్టిక్‌ సర్జరీ, సీఎంఆర్‌సీ, ప్రివెంటివ్‌ అండ్‌ సోషల్‌ మెడిసిన్‌, సైకియాట్రీ, పల్మనరీ మెడిసిన్‌, రేడియేషన్‌ అంకాలజీ, రేడియో-డయాగ్నోసిస్‌.

అర్హతలు: సంబంధిత విభాగంలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ డిగ్రీ (ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ), ఎండీఎస్‌.

వయసు: 31-01-2023 నాటికి 45 ఏళ్లు మించకూడదు.

వేతన శ్రేణి: రూ.67,700 - రూ.1,10,000..

ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.  

సీబీటీ పరీక్ష కేంద్రాలు: చెన్నై, దిల్లీ, కోల్‌కతా, ముంబయి, పుదుచ్చేరి.

దరఖాస్తు రుసుము: యూఆర్‌/ ఈడబ్ల్యూఎస్‌ రూ.1,500; ఓబీసీ రూ.1,500; ఎస్సీ/ఎస్టీ రూ.1,200; దివ్యాంగులకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 09-12-2022.

హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ ప్రారంభం: 16-12-2022.

రాత పరీక్ష తేదీ: 18-12-2022.

వెబ్‌సైట్‌: https://jipmer.edu.in/announcement/jobs


కేఐవోసీఎల్‌లో జనరల్‌ మేనేజర్‌, సీనియర్‌ మేనేజర్‌లు

ప్రభుత్వ రంగ సంస్థ- బెంగళూరులోని కుద్రేముఖ్‌ ఐరన్‌ ఓర్‌ కంపెనీ లిమిటెడ్‌ (కేఐవోసీఎల్‌) 17 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌: 01 పోస్టు

* జనరల్‌ మేనేజర్‌: 03 పోస్టులు

* డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌: 01 పోస్టు

* అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌: 03 పోస్టులు

* సీనియర్‌ మేనేజర్‌: 03 పోస్టులు

* మెడికల్‌ సూపరింటెండెంట్‌: 01 పోస్టు

* డిప్యూటీ మేనేజర్‌: 02 పోస్టులు

* అసిస్టెంట్‌ మేనేజర్‌: 01 పోస్టు

* కన్సల్టెంట్‌: 02 పోస్టులు

విభాగాలు: మైనింగ్‌, ఫైనాన్స్‌, మెటీరియల్‌, కమర్షియల్‌, ఎలక్ట్రికల్‌, ట్రైనింగ్‌ అండ్‌ సేఫ్టీ, జియాలజీ, స్ట్రక్చరల్‌, సర్వే.

అర్హత: పోస్టును అనుసరించి ఎంబీబీఎస్‌, బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, పీజీతో పాటు పని అనుభవం.

ఎంపిక: ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.  

ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభం: 21-11-2022.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 03-12-2022.

దరఖాస్తు హార్డుకాపీ స్వీకరణకు చివరి తేదీ: 09-12-2022.

వెబ్‌సైట్‌: https://kioclltd.in/


ఎన్‌టీపీసీ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్‌ ఖాళీలు

నోయిడాలోని ప్రభుత్వ రంగ సంస్థ- నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌టీపీసీ) ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

ఎగ్జిక్యూటివ్‌(కంబైన్డ్‌ సైకిల్‌ పవర్‌ ప్లాంట్‌/ రీ-విండ్‌): 26 పోస్టులు

అర్హత: ఇంజినీరింగ్‌ డిగ్రీ (ఎలక్ట్రికల్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రానిక్స్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం.

వయసు: 30-11-2022 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు రుసుము: రూ.300 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌, మహిళలకు రుసుము మినహాయింపు ఉంటుంది).

ఎంపిక: పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 30-11-2022.

వెబ్‌సైట్‌: https://careers.ntpc.co.in/


ఐఐఐటీ-చిత్తూరులో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు

చిత్తూరులోని శ్రీసిటీకి చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐఐటీ) అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, మ్యాథమెటిక్స్‌/ డేటా సైన్స్‌.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో యూజీ, పీజీ, పీహెచ్‌డీ.

అనుభవం: కనీసం 0-3 ఏళ్లు పని అనుభవం.

ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా.

చిరునామా: The Registrar, Indian Institute of Information
Technology Sri City, Chittoor, 630 Gnan Marg, Sri City,
Tirupati District 517 646, Andhra Pradesh, India.

దరఖాస్తుకు చివరి తేది: 31.12.2022.

వెబ్‌సైట్‌:www.iiits.ac.in/careersiiits/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని