Published : 22 Nov 2022 00:21 IST

నోటిఫికేషన్స్‌

ఉద్యోగాలు

జీఎంసీ-మహబూబాబాద్‌లో 24 ఖాళీలు

తెలంగాణలోని మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీ 24 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: స్టోర్‌ కీపర్‌, హాల్‌ అటెండెంట్లు, ల్యాబ్‌ అటెండెంట్లు, రికార్డు అసిస్టెంట్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి/ బీఎస్సీ/ బీకామ్‌/ ఎంఎల్‌టీ/ డీఎంఎల్‌టీ/ డిప్లొమా/ పీజీడీసీఏ.

వయసు: 18-44 ఏళ్లు ఉండాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 25.11.2022

వెబ్‌సైట్‌: https://mahabubabad.telangana.gov.in/ notice_category/recruitment/


ఐడీఆర్‌బీటీలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

ఆర్‌బీఐ ఆధ్వర్యంలోని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రిసెర్చ్‌ ఇన్‌ బ్యాంకింగ్‌ టెక్నాలజీ (ఐడీఆర్‌బీటీ) 10 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, ఫుల్‌స్టాక్‌ డెవలపర్‌.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్‌/ ఎంసీఏ/ ఎంఈ/ ఎంటెక్‌ ఉత్తీర్ణత.

అనుభవం: కనీసం 2 ఏళ్ల పని అనుభవం.

ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, సంస్థ నిబంధనల ఆధారంగా.

దరఖాస్తు: ఈమెయిల్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా.

ఈమెయిల్‌:vkycproject@idrbt.ac.in 

దరఖాస్తుకు చివరి తేదీ: 11.12.2022

వెబ్‌సైట్‌: https://www.idrbt.ac.in/careers/ 


డీఎంహెచ్‌ఓ-ప్రకాశం జిల్లాలో..

ప్రకాశం జిల్లాలోని వైఎస్సార్‌ అర్బన్‌ క్లినిక్‌/ యూపీహెచ్‌సీల్లో ఒప్పంద ప్రాతిపదికన 18 పోస్టుల భర్తీకి జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం దరఖాస్తులు కోరుతోంది.

* మెడికల్‌ ఆఫీసర్లు/ సీఏఎస్‌: 07 పోస్టులు

* ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌-2: 02 పోస్టులు

* ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌-2: 04 పోస్టులు

* లాస్ట్‌ గ్రేడ్‌ సర్వీసెస్‌: 05 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి పదోతరగతి, ఎంబీబీఎస్‌, డీఫార్మసీ/ బీఫార్మసీ, డిప్లొమా, బీఎస్సీ (ఎంఎల్‌టీ).

వయసు: 42 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక: అకడమిక్‌ మెరిట్‌, పని అనుభవం ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.500 (ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్‌/ ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు రూ.300).

దరఖాస్తు: దరఖాస్తులను వ్యక్తిగతంగా లేదా రిజిస్టర్‌ పోస్టు ద్వారా జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, జీజీహెచ్‌ కాంపౌండ్‌, ఒంగోలు, ప్రకాశం జిల్లా చిరునామాకు పంపించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 26-11-2022.

వెబ్‌సైట్‌: https://prakasam.ap.gov.in/


ఇండియన్‌ బ్యాంక్‌లో స్పెషలిస్ట్‌ పోస్టులు

ఇండియన్‌ బ్యాంక్‌ ఒప్పంద ప్రాతిపదికన 9 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: సోషల్‌ మీడియా స్పెషలిస్ట్‌, పార్ట్‌నర్‌షిప్స్‌ అండ్‌ అఫిలియేట్స్‌ లీడ్‌, క్రియేటివ్‌ ఎక్స్‌పర్ట్‌, డేటా ఇంజినీర్లు, యూఐ/ యూఎక్స్‌ డిజైనర్లు.

దరఖాస్తు ఫీజు: రూ.1000

దరఖాస్తుకు చివరి తేదీ: 05.12.2022

వెబ్‌సైట్‌: https://www.indianbank.in/career/#! 


సీఐటీడీ-హైదరాబాద్‌లో..

హైదరాబాద్‌లోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ టూల్‌ డిజైన్‌(సీఐటీడీ) ఆధ్వర్యంలోని ఎంఎస్‌ఎంఈ టూల్‌ రూమ్‌ ఫ్యాకల్టీ, ఇన్‌స్ట్రక్టర్‌, ట్రెయినర్‌, ల్యాబ్‌ అసిస్టెంట్‌, సిస్టమ్‌ అడ్మిన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వేదిక: సీఐటీడీ-బాలానగర్‌, హైదరాబాద్‌.

ఇంటర్వ్యూ తేదీలు: నవంబరు 18 నుంచి 25 వరకు.

సమయం: ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు.

వెబ్‌సైట్‌: https://www.citdindia.org/index.htm


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు