నోటిఫికేషన్స్‌

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ లెవెల్‌ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ 6511 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 30 Nov 2022 00:21 IST

ప్రభుత్వ ఉద్యోగాలు
ఏపీలో పోలీస్‌ ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ లెవెల్‌ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ 6511 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

కానిస్టేబుల్‌ పోస్టులు: 6100

* 3,580 కానిస్టేబుల్‌ (సివిల్‌)

* 2,520 ఏపీఎస్పీ కానిస్టేబుల్‌

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌/తత్సమాన ఉత్తీర్ణత.

వయసు: 18 నుంచి 32 ఏళ్లు.

ఎంపిక: ప్రిలిమినరీ పరీక్ష, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌, మెయిన్‌ పరీక్షలో మెరిట్‌ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.300. ఎస్సీ/ ఎస్టీలు రూ.150 చెల్లించాలి.

* కానిస్టేబుల్‌ దరఖాస్తు చివరి తేదీ: 28.12.2022

* ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 22.01.2023

ఎస్సై పోస్టులు: 411

* 315 ఎస్‌ఐ సివిల్‌ పోస్టులు.

* 96 రిజర్వ్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌.

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌/తత్సమాన ఉత్తీర్ణత.

వయసు:  21 నుంచి 27 ఏళ్లు.

ఎంపిక: ప్రిలిమినరీ పరీక్ష, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌, మెయిన్‌ పరీక్షలో మెరిట్‌ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.600. ఎస్సీ/ ఎస్టీలు రూ.300 చెల్లించాలి.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.

* ఎస్సై దరఖాస్తు స్వీకరణ ప్రారంభం: 14.12.2022

* ఎస్సై దరఖాస్తుకు చివరి తేదీ: 18.01.2023

* ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 19.02.2023

వెబ్‌సైట్‌: https://slprb.ap.gov.in/


జూనియర్‌ టెక్నీషియన్‌ పోస్టులు

హారాష్ట్ర నాసిక్‌లోని కరెన్సీ నోట్‌ ప్రెస్‌.. 125 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

* సూపర్‌వైజర్‌ (టెక్నికల్‌ ఆపరేటర్‌- ప్రింటింగ్‌): 10 పోస్టులు

* సూపర్‌వైజర్‌ (టెక్నికల్‌ ఆపరేటర్‌- ఎలక్ట్రికల్‌): 02 పోస్టులు

* సూపర్‌వైజర్‌ (టెక్నికల్‌ ఆపరేటర్‌- ఎలక్ట్రానిక్స్‌): 02 పోస్టులు

* సూపర్‌వైజర్‌ (టెక్నికల్‌ ఆపరేటర్‌- మెకానికల్‌): 02 పోస్టులు

* సూపర్‌వైజర్‌ (టెక్నికల్‌ ఆపరేటర్‌- ఎయిర్‌ కండిషనింగ్‌): 01 పోస్టు

* సూపర్‌వైజర్‌ (ఐటీ): 04 పోస్టులు

* జూనియర్‌ టెక్నీషియన్‌(ప్రింటింగ్‌/ కంట్రోల్‌): 103 పోస్టులు

అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా (ఇంజినీరింగ్‌), బీఈ, బీటెక్‌, బీఎస్సీ.

వయసు: జూనియర్‌ టెక్నీషియన్‌ పోస్టులకు 18-30 ఏళ్లు, మిగిలిన పోస్టులకు 18-30 ఏళ్ల మధ్య.

ఎంపిక: ఆన్‌లైన్‌ పరీక్ష, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా.

వేతనశ్రేణి: జూనియర్‌ టెక్నీషియన్‌ పోస్టులకు రూ.18,780-రూ.67,390, మిగిలిన పోస్టులకు రూ.27,600-రూ.95,910 ఉంటుంది.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 16.12.2022.

ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ: జనవరి/ ఫిబ్రవరి 2023.

వెబ్‌సైట్‌: https://cnpnashik.spmcil.com/Interface/Home.aspx


కొచ్చిన్‌ షిప్‌యార్డులో...

శ్చిమ్‌ బెంగాల్‌ రాష్ట్రం కోల్‌కతాలోని హుగ్లీ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (హెచ్‌సీఎస్‌ఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన 14 పోస్టుల భర్తీకి  దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం.

వయసు: సీపీఈ, మెడికల్‌ ఆఫీసర్లకు 65 ఏళ్లు, ఇతర పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తుకు చివరి తేదీ: 09.12.2022.

వెబ్‌సైట్‌: https://cochinshipyard.in/careerdetail/career_locations/509


ఎన్‌సీఎల్‌-మధ్యప్రదేశ్‌లో 405 వివిధ పోస్టులు

ధ్యప్రదేశ్‌లోని నార్తర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌సీఎల్‌) 405 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* మైనింగ్‌ సర్దార్‌, సర్వేయర్‌ పోస్టులు.

అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్‌/ డిప్లొమా/ డిగ్రీ  

వయసు: 18-30 ఏళ్లు

జీతభత్యాలు:

1. మైనింగ్‌ సర్దార్‌: నెలకు రూ.31852 చెల్లిస్తారు.

2. సర్వేయర్‌: నెలకు రూ.34391 చెల్లిస్తారు.

ఎంపిక: కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలో మెరిట్‌ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.1000.

ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభం: 01.12.2022

దరఖాస్తుకు చివరి తేదీ: 22.12.2022

వెబ్‌సైట్‌: http://www.nclcil.in/


వాక్‌ఇన్‌లు
సీఎస్‌ఐఆర్‌-రూర్కీలో 64 ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

రూర్కీలోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన సీఎస్‌ఐఆర్‌ ఆధ్వర్యంలోని సెంట్రల్‌ బిల్డింగ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీబీఆర్‌ఐ) 64 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, సైంటిఫిక్‌ అడ్మిన్‌ అసిస్టెంట్‌ పోస్టులు.

అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ/ బీఈ/ బీటెక్‌/ బీఆర్క్‌/ డిప్లొమా/ ఎంఎస్సీ

వయసు: 35-50 ఏళ్లు

వేతనశ్రేణి: నెలకు రూ.18000-రూ.42000 చెల్లిస్తారు.

ఎంపిక: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ వేదిక: సీఎస్‌ఐఆర్‌-సీబీఆర్‌ఐ రూర్కీ.

ఇంటర్వ్యూ తేదీ: 05-08 డిసెంబరు 2022

ఇంటర్వ్యూ సమయం: ఉదయం 8:30 నుంచి 10 గంటల వరకు.

వెబ్‌సైట్‌: https://cbri.res.in/notifications/recruitments/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని