నోటిఫికేషన్స్‌

దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో ప్రైమరీ టీచర్‌ పోస్టుల భర్తీకి న్యూదిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Updated : 05 Dec 2022 11:27 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

కేంద్రీయ విద్యాలయాల్లో ప్రైమరీ టీచర్‌లు

దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో ప్రైమరీ టీచర్‌ పోస్టుల భర్తీకి న్యూదిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ప్రైమరీ టీచర్‌: 6414 పోస్టులు (యూఆర్‌- 2599, ఓబీసీ- 1731, ఎస్సీ- 962, ఎస్టీ- 481, ఈడబ్ల్యూఎస్‌- 641)
అర్హత: సీనియర్‌ సెకండరీ, డీఈఎల్‌ఈడీ, డీఈఎల్‌ఈడీ(స్పెషల్‌ ఎడ్యుకేషన్‌). లేదా సీనియర్‌ సెకండరీ, బీఈఎల్‌ఈడీ లేదా డిగ్రీ, బీఈడీతో పాటు సీటెట్‌ పేపర్‌-1లో అర్హత.
వయసు: 30 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక: రాత పరీక్ష, క్లాస్‌ డెమో, ఇంటర్వ్యూ, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా.
దరఖాస్తు: కేవీఎస్‌ వెబ్‌సైట్‌ ద్వారా.
దరఖాస్తు రుసుము: రూ.1500. (ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్‌, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది).
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 26.12.2022.

వెబ్‌సైట్‌: https://kvsangathan.nic.in/


6,990 పీజీటీ, టీజీటీ పోస్టులు

కేంద్రీయ విద్యాలయాల్లో బోధన, బోధనేతర ఖాళీల భర్తీకి కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పోస్టుల వివరాలు..

* ప్రిన్సిపల్‌: 239 * వైస్‌ ప్రిన్సిపల్‌: 203 * పీజీటీ: 1409
* టీజీటీ: 3176 * లైబ్రేరియన్‌: 355 * అసిస్టెంట్‌ కమిషనర్‌: 52
* పీఆర్‌టీ (మ్యూజిక్‌): 303 * ఫైనాన్స్‌ ఆఫీసర్‌: 06 * అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (సివిల్‌): 02 * అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌: 156
* హిందీ ట్రాన్స్‌లేటర్‌: 11 * సీనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (యూడీసీ): 322 * జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (ఎల్‌డీసీ): 702 * స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-2: 54
అర్హత: పోస్టును అనుసరించి పదోతరగతి, ఇంటర్‌, డిగ్రీ, పీజీ, బీఈడీ, బీపీఈడీ, డిప్లొమా, పీజీ డిప్లొమా, సీఏ/ ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత. సీటెట్‌ పేపర్‌-2 అర్హత సాధించి ఉండాలి.
వయసు: స్టెనో, జేఎస్‌ఏ పోస్టులకు 27 ఏళ్లు; ఎస్‌ఎస్‌ఏ, పీఆర్‌టీ పోస్టులకు 30 ఏళ్లు; హెచ్‌టీ, ఏఎస్‌వో, ఏఈ, ఎఫ్‌వో, లైబ్రేరియన్‌, టీజీటీ పోస్టులకు 35 ఏళ్లు; ఏసీ, ప్రిన్సిపల్‌ పోస్టులకు 50 ఏళ్లు; పీజీటీ పోస్టులకు 40 ఏళ్లు; వైస్‌ ప్రిన్సిపల్‌ పోస్టులకు 45 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: రాత పరీక్ష, క్లాస్‌ డెమో, ఇంటర్వ్యూ, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా.
దరఖాస్తు: కేవీఎస్‌ వెబ్‌సైట్‌ ద్వారా .
దరఖాస్తు రుసుము: అసిస్టెంట్‌ కమిషన్‌, ప్రిన్సిపల్‌, వైస్‌ ప్రిన్సిపల్‌- రూ.2300; పీఆర్‌టీ, టీజీటీ, పీజీటీ, ఫైనాన్స్‌ ఆఫీసర్‌, ఏఈ, లైబ్రేరియన్‌, ఏఎస్‌వో, హెచ్‌టీ- రూ.1500; ఎస్‌ఎస్‌ఏ, స్టెనో, జేఎస్‌ఏ- రూ.1200. (ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్‌, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది).
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 26.12.2022.

వెబ్‌సైట్‌: https://kvsangathan.nic.in/


గెస్ట్‌ టీచింగ్‌ అసోసియేట్‌ ఖాళీలు

తెలంగాణ రాష్ట్రం కరీంనగర్‌, వనపర్తిలలోని మహాత్మా జ్యోతిబా ఫూలె బీసీ సంక్షేమ వ్యవసాయ మహిళా డిగ్రీ గురుకుల కళాశాలల్లో తాత్కాలిక ప్రాతిపదికన 20 గెస్ట్‌టీచింగ్‌ అసోసియేట్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

విభాగాలు: అగ్రోనమీ, జెనెటిక్స్‌ అండ్‌ ప్లాంట్‌ బ్రీడింగ్‌, సాయిల్‌ సైన్స్‌ అండ్‌ అగ్రికల్చర్‌ కెమిస్ట్రీ, ఎంటమాలజీ, ప్లాంట్‌ పాథాలజీ, హార్టికల్చర్‌, అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చరల్‌ ఎకనామిక్స్‌, అగ్రికల్చరల్‌ ఎక్స్‌టెన్షన్‌.
అర్హత: ఎంఎస్సీ(అగ్రికల్చర్‌/ హార్టికల్చర్‌/ అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌/ అగ్రికల్చర్‌ స్టాటిస్టిక్స్‌) ఉత్తీర్ణులై ఉండాలి.
ఇంటర్వ్యూ తేదీ, వేదిక: 14, 15-12-2022, 6వ అంతస్తు, డీఎస్‌ఎస్‌ భవన్‌, మసాబ్‌ట్యాంక్‌, హైదరాబాద్‌.
దరఖాస్తుకు చివరి తేదీ: 09.12.2022.

వెబ్‌సైట్‌: http://mjptbcwreis.telangana.gov.in/


వాక్‌ ఇన్‌

లెదర్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో..

చెన్నైలోని సీఎస్‌ఐఆర్‌- సెంట్రల్‌ లెదర్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ వివిధ ప్రాజెక్టుల్లో తాత్కాలిక ప్రాతిపదికన 11 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
* జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో: 05 * ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-1: 03 * ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌: 03 పోస్టులు
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డీఎంఎల్‌టీ, బీఎంఎల్‌టీ, డిప్లొమా, బీఈ, బీటెక్‌, ఎంటెక్‌, ఎంఎస్సీ, సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌/ గేట్‌ స్కోర్‌.
వయసు: జేఆర్‌ఎఫ్‌ పోస్టులకు 28 ఏళ్లు, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులకు 35 ఏళ్లు, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 50 ఏళ్లు మించకూడదు.
వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూ తేదీ: డిసెంబరు 13, 14.
వేదిక: సెంట్రల్‌ లెదర్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, సర్దార్‌ పటేల్‌ రోడ్‌, అడయార్‌, చెన్నై.

వెబ్‌సైట్‌: https://www.clri.org/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని