నోటిఫికేషన్స్‌

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ‘కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌’ (సీహెచ్‌ఎస్‌ఎల్‌) ప్రకటన వెలువడింది.

Updated : 08 Dec 2022 09:05 IST

ఉద్యోగాలు

ఎస్‌ఎస్‌సీ - కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌ 2022

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ‘కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌’ (సీహెచ్‌ఎస్‌ఎల్‌) ప్రకటన వెలువడింది. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునళ్లు మొదలైన వాటిలో లోయర్‌ డివిజనల్‌ క్లర్క్‌, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌ తదితర పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) 2022-23 సంవత్సరానికి ప్రకటన విడుదల చేసింది.

ఖాళీలు: 4500
1. లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌(ఎల్‌డీసీ), జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌
2. డేటా ఎంట్రీ ఆపరేటర్‌(డీఈవో)
3. డేటా ఎంట్రీ ఆపరేటర్‌(గ్రేడ్‌-ఎ)
అర్హత: ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. ఓపెన్‌ స్కూల్‌ ద్వారా చదివినవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాలో డేటా ఎంట్రీ పోస్టులకు మాత్రం ఇంటర్‌లో సైన్స్‌ గ్రూప్‌తో మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా చదవడం తప్పనిసరి.
వయసు: జనవరి 1, 2022 నాటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే జనవరి 2, 1995 - జనవరి 1, 2004 మధ్య జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.
వేతనశ్రేణి:
* ఎల్‌డీసీ, జేఎస్‌ఏ పోస్టులకు పే లెవెల్‌-2 (రూ.19,900-63,200).
* డేటా ఎంట్రీ ఆపరేటర్‌(డీఈవో) పోస్టులకు పే లెవెల్‌-4 (రూ.25,500-81,100), పే లెవెల్‌-5 (రూ.29,200-92,300).
* డేటా ఎంట్రీ ఆపరేటర్‌, గ్రేడ్‌-ఎ పోస్టులకు పే లెవెల్‌-4 (రూ.25,500-81,100).
ఎంపిక విధానం: టైర్‌-1, టైర్‌-2 పరీక్షలు నిర్వహిస్తారు. ఈ రెండు దశల్లోని మార్కుల ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు దరఖాస్తు చేసుకున్న పోస్టును బట్టి మూడో దశలో కంప్యూటర్‌ టెస్ట్‌ లేదా టైపింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించాలి.  
దరఖాస్తు ఫీజు: రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఫీజు చెల్లించనవసరం లేదు
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, రాజమహేంద్రవరం, వరంగల్‌, కాకినాడ, కరీంనగర్‌, కర్నూలు, నెల్లూరు, విజయనగరం, చీరాల.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 04.01.2023
టైర్‌-1 పరీక్షలు: ఫిబ్రవరి, మార్చిలో నిర్వహిస్తారు
టైర్‌-2 డిస్క్రిప్టివ్‌ పరీక్ష: వివరాలు తర్వాత ప్రకటిస్తారు.

వెబ్‌సైట్‌: https://ssc.nic.in/


ఎన్‌పీసీఐఎల్‌-కాక్రపర్‌లో 243 ఖాళీలు

కాక్రపర్‌ గుజరాత్‌ సైట్‌లోని న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఎన్‌పీసీఐఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీలు: 243.
పోస్టులు: సైంటిఫిక్‌ అసిస్టెంట్‌, స్టైపెండరీ ట్రెయినీ, నర్స్‌, ఫార్మసిస్ట్‌, స్టెనో, ప్లాంట్‌ ఆపరేటర్‌, మెషినిస్ట్‌, ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌..
విభాగాలు: సివిల్‌, సేఫ్టీ, కెమికల్‌, ఫిజిక్స్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌  
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎస్‌ఎస్‌సీ/ హెచ్‌ఎస్‌సీ/ 10+2/ ఐటీఐ/ బ్యాచిలర్స్‌ డిగ్రీ/ ఇంజినీరింగ్‌ డిప్లొమా/ బీఎస్సీ ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణత. వయసు: 18-35 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతన శ్రేణి: నెలకు రూ.25500-44900 చెల్లిస్తారు.
ఎంపిక: రాతపరీక్ష/ కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష/ పర్సనల్‌ ఇంటర్వ్యూ/ స్కిల్‌ టెస్ట్‌లో మెరిట్‌తో. ః ప్రకటనలో తెలిపిన కొన్ని పోస్టులకు ప్రిలిమ్స్‌ టెస్ట్‌, అడ్వాన్స్‌డ్‌ టెస్ట్‌, స్కిల్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు.
* రాతపరీక్షలో ఇంగ్లిష్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, సంబంధిత స్పెషలైజేషన్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి.
* పర్సనల్‌ ఇంటర్వ్యూకు 100 మార్కులు.
ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేది: 05.01.2023
పరీక్ష తేది: ఫిబ్రవరి 2023.

వెబ్‌సైట్‌: https://www.npcilcareers.co.in/KAPS20220105/


ఏపీ సెంట్రల్‌ వర్సిటీలో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు

అనంతపురంలోని సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ డైరెక్ట్‌/ డిప్యుటేషన్‌ ప్రాతిపదికన కింది బోధన, బోధనేతర పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 24
1. ప్రొఫెసర్‌: 02 పోస్టులు
2. అసోసియేట్‌ ప్రొఫెసర్‌: 05 పోస్టులు
3. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌: 09 పోస్టులు 4. అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌: 01 పోస్టు 5. అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ 01 పోస్టు 6. సెక్షన్‌ ఆఫీసర్‌: 01 పోస్టు
7. జూనియర్‌ ఇంజినీర్‌(సివిల్‌): 01 పోస్టు 8. టెక్నికల్‌ అసిస్టెంట్‌: 01 పోస్టు 9. అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌: 02 పోస్టులు 10. సెక్యూరిటీ అసిస్టెంట్‌: 02 పోస్టులు
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 14.12.2022.
దరఖాస్తు హార్డ్‌కాపీ స్వీకరణకు చివరి తేదీ: 26-12-2022.

వెబ్‌సైట్‌: https://cuap.ac.in/


వాక్‌-ఇన్‌

నిట్‌ కాలికట్‌లో అడ్‌హక్‌ ఫ్యాకల్టీ

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, కాలికట్‌ తాత్కాలిక ప్రాతిపదికన 2022-23 వింటర్‌ సెమిస్టర్‌లో వివిధ విభాగాల్లో అడ్‌హక్‌ ఫ్యాకల్టీ నియామకానికి వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

అడ్‌హక్‌ ఫ్యాకల్టీ: 41 పోస్టులు
విభాగాలు: సివిల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, మ్యాథమెటిక్స్‌.
అర్హత: సంబంధిత విభాగంలో ఎమ్మెస్సీ, ఎంఈ, ఎంటెక్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం.
వేతనం: నెలకు పీహెచ్‌డీ అభ్యర్థులకు రూ.50,000; పీజీలకు రూ.40,000.
వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ తేదీ: 15, 16.12.2022.
వేదిక: సంబంధిత విభాగం, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కాలికట్‌, కేరళ.

వెబ్‌సైట్‌: http://www.nitc.ac.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని