నోటిఫికేషన్స్‌

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 1392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటన విడుదలైంది.  

Published : 12 Dec 2022 00:26 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

1392 జూనియర్‌ లెక్చరర్‌లు

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 1392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. 

వయసు: 01/07/2022 నాటికి 18 - 44 సంవత్సరాల మధ్య.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టు/ భాషలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ.
అప్లికేషన్‌ ప్రాసెసింగ్‌ ఫీజు: రూ.200, పరీక్ష ఫీజు: రూ.120.
రాత పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, హనుమకొండ, నిజామాబాద్‌. ఎంపిక: రాత పరీక్ష (ఆబ్జెక్టివ్‌ టైప్‌) ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 16/12/2022.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 06/01/2023.
పరీక్ష తేదీ (ఆబ్జెక్టివ్‌ టైప్‌): జూన్‌/ జులై-2023.

వెబ్‌సైట్‌: https://websitenew.tspsc.gov.in/directRecruitment


డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు

తెలంగాణ రాష్ట్రంలోని ఔషధ నియంత్రణ పరిపాలన విభాగంలో 18 డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది.

అర్హతలు: డిగ్రీ(ఫార్మసీ/ ఫార్మాస్యూటికల్‌ సైన్స్‌), ఫార్మాడీ లేదా మెడిసిన్‌ (క్లినికల్‌ ఫార్మకాలజీ/ మైక్రోబయాలజీ స్పెషలైజేషన్‌).
వయసు (01/07/2022 నాటికి): 18 - 44 సంవత్సరాల మధ్య.
ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా. అప్లికేషన్‌ ప్రాసెసింగ్‌ ఫీజు: రూ.200.
ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 16/12/2022.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 05/01/2023.

వెబ్‌సైట్‌: https://websitenew.tspsc.gov.in/directRecruitment


247 పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ ఖాళీలు

ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో 247 లెక్చరర్‌ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. 19 సబ్జెక్టుల్లో అధ్యాపకులను నియమించనున్నారు.

సబ్జెక్టులు: ఆటో మొబైల్‌ ఇంజినీరింగ్‌, బయో-మెడికల్‌ ఇంజినీరింగ్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌, ఫుట్‌వేర్‌ టెక్నాలజీ, లెటర్‌ ప్రెస్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, మెటలర్జీ, ప్యాకేజింగ్‌ టెక్నాలజీ, టాన్నెరీ, టెక్స్‌టైల్‌ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్‌ ఇంజినీరింగ్‌, ఫార్మసీ, జియాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, బీఎస్‌, బీఆర్క్‌, బీఫార్మసీ, డిగ్రీ, పీజీ, స్లెట్‌/ నెట్‌/ సెట్‌, పీహెచ్‌డీ.  
వయసు (01/07/2022 నాటికి): 18 - 44 సంవత్సరాల మధ్య.
అప్లికేషన్‌ ప్రాసెసింగ్‌ ఫీజు: రూ.200. ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 14/12/2022
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 04/01/2023.

వెబ్‌సైట్‌: https://websitenew.tspsc.gov.in/directRecruitment


కేంద్ర శాఖల్లో ఆర్కైవిస్ట్‌, సైంటిస్ట్‌ కొలువులు

కేంద్రమంత్రిత్వ శాఖల్లో 19 పోస్టుల భర్తీకి యూపీఎస్సీ దరఖాస్తులు కోరుతోంది.

* నేషనల్‌ ఆర్కైవ్స్‌ ఆఫ్‌ ఇండియాలో ఆర్కైవిస్ట్‌ (జనరల్‌): 13 పోస్టులు
* డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌లో స్పెషలిస్ట్‌ గ్రేడ్‌-3(పీడియాట్రిక్స్‌): 05 పోస్టులు
* సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబొరేటరీలో సైంటిస్ట్‌ ‘బి’ (న్యూట్రాన్‌ యాక్టివేషన్‌ అనాలిసిస్‌): 01 పోస్టు
అర్హతలు: పోస్టును అనుసరించి ఎంబీబీఎస్‌, పీజీ, డిప్లొమా, మాస్టర్స్‌ డిగ్రీ (చరిత్ర), పని అనుభవం.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 29.12.2022.

వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని