నోటిఫికేషన్స్‌

తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష(టీఎస్‌ సెట్‌)-2022 నోటిఫికేషన్‌ను ఉస్మానియా విశ్వవిద్యాలయం విడుదల చేసింది.

Updated : 26 Dec 2022 06:43 IST

అర్హత పరీక్ష

టీఎస్‌ సెట్‌-2022

తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష(టీఎస్‌ సెట్‌)-2022 నోటిఫికేషన్‌ను ఉస్మానియా విశ్వవిద్యాలయం విడుదల చేసింది. రాష్ట్రంలోని అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, డిగ్రీ కళాశాలల లెక్చరర్లు అర్హత సాధించేందుకు ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. జనరల్‌ స్టడీస్‌, 29 సబ్జెక్టుల్లో సీబీటీ విధానంలో పరీక్ష జరుగనుంది.

అర్హత: కనీసం 55% మార్కులతో సంబంధి సబ్జెక్టులో మాస్టర్స్‌ డిగ్రీ (ఎంఏ, ఎంస్సీ, ఎంకాం, ఎంబీఏ, ఎంఎల్‌ఐఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంసీజే, ఎల్‌ఎల్‌ఎం, ఎంసీఏ, ఎంటెక్‌ (సీఎస్‌ఈ, ఐటీ). గరిష్ఠ వయసు నిబంధన లేదు.
పరీక్ష రుసుము: ఓసీలకు రూ.2000; బీసీ/ ఈడబ్ల్యూఎస్‌లకు రూ.1500; ఎస్సీ, ఎస్టీ, వీహెచ్‌, హెచ్‌ఐ, ఓహెచ్‌, ట్రాన్స్‌జెండర్‌లకు రూ.1000.
పరీక్ష కేంద్రాలు: ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, విజయవాడ, హైదరాబాద్‌, వరంగల్‌, కర్నూలు, కరీంనగర్‌, ఖమ్మం, తిరుపతి, మహబూబ్‌ నగర్‌, మెదక్‌, వైజాగ్‌, నల్గొండ, రంగారెడ్డి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 30-12-2022.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 20-01-2023
పరీక్ష తేదీ: మార్చి, 2023.
వెబ్‌సైట్‌: www.telanganaset.org/


ప్రభుత్వ ఉద్యోగాలు

హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, వార్డెన్‌లు

తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా శిశు సంక్షేమశాఖల పరిధిలోని సంక్షేమ వసతి గృహాల్లో 562 సంక్షేమాధికారులు, పిల్లల సంరక్షణ గృహాల్లో 19 మహిళా సూపరింటెండెంట్‌ పోస్టులకు టీఎస్‌పీఎస్సీ ప్రకటన జారీ చేసింది. ఈ పోస్టులకు 2023 జనవరి 6 నుంచి జనవరి 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనుంది. అత్యధికంగా ఎస్సీ సంక్షేమశాఖ పరిధిలో 298 పోస్టులు ఉన్నాయి. బీసీ సంక్షేమశాఖలో గ్రేడ్‌-2 మొత్తం 140 పోస్టుల్లో ప్రీమెట్రిక్‌ బాలుర వసతి గృహాల్లో 87, పోస్టుమెట్రిక్‌ బాలుర వసతి గృహాల్లో 14, ప్రీమెట్రిక్‌ బాలికల వసతి గృహాల్లో 26, పోస్టుమెట్రిక్‌ బాలికల వసతి గృహాల్లో 13 పోస్టులు ఉన్నాయి.

అర్హతలు: పోస్టును అనుసరించి ఏదైనా విభాగంలో డిగ్రీ, బీఈడీ, బీఈడీ/ డీఈడీ (విజువల్‌ హ్యాండిక్యాప్డ్‌/ హియరింగ్‌ హ్యాండిక్యాప్డ్‌).
వయసు: 01/07/2022 నాటికి 18 - 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా.
దరఖాస్తు, పరీక్ష రుసుం: రూ.280.
రాత పరీక్ష కేంద్రాలు: ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, హైదరాబాద్‌, నిజామాబాద్‌, మహబూబ్‌ నగర్‌, మెదక్‌, నల్గొండ.
ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 06.01.2023.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 27.01.2023.
పరీక్ష తేదీ (ఆబ్జెక్టివ్‌ టైప్‌): ఆగస్టు-2023.
వెబ్‌సైట్‌: https://websitenew.tspsc.gov.in/


ఈసీఐఎల్‌, హైదరాబాద్‌లో..

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ ఒప్పంద ప్రాతిపదికన 11 టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: బీఈ, బీటెక్‌ (సీఎస్‌ఈ/ ఈసీఈ/ ఈటీసీ/ ఎంసీఎస్‌/ ఈఈఈ/ ఇ అండ్‌ ఐ/ ఎలక్ట్రానిక్స్‌)తో పాటు పని అనుభవం.
వయసు: 30 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక: విద్యార్హత మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా.
పని ప్రదేశం: అండమాన్‌ అండ్‌ నికోబార్‌, ముంబయి, నాలియా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 26.12.2022
వెబ్‌సైట్‌: https://careers.ecil.co.in/


మెడికల్‌ ఆఫీసర్‌, స్టాఫ్‌ నర్సులు

చిత్తూరులోని వైద్యారోగ్య అధికారి కార్యాలయం చిత్తూరు జిల్లాలో జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద ఒప్పంద ప్రాతిపదికన 53 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
1. స్టాఫ్‌ నర్స్‌: 23
2. ల్యాబ్‌-టెక్నీషియన్‌: 02
3. అటెండర్‌ కమ్‌ క్లీనర్‌: 01
4. కుక్‌ కమ్‌ కేర్‌ టేకర్‌: 01
5. పీడియాట్రీషియన్‌: 04
6. సెక్యూరిటీ గార్డ్‌: 05
7. సపోర్టింగ్‌ స్టాఫ్‌: 03
8. మెడికల్‌ ఆఫీసర్‌: 14
అర్హత: పోస్టును అనుసరించి 5వ తరగతి, 10వ తరగతి, ఎంబీబీఎస్‌, డిప్లొమా(జీఎన్‌ఎం), బీఎస్సీ(ఎంఎల్‌టీ), పీజీ డిప్లొమా.
వయసు: 42 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, చిత్తూరులో అందజేయాలి.
ఎంపిక: అకడమిక్‌ మెరిట్‌, పని అనుభవం ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.300.
దరఖాస్తుకు చివరి తేదీ: 31.12.2022.
వెబ్‌సైట్‌: https://chittoor.ap.gov.in/


ట్రీట్‌మెంట్‌ సూపర్‌వైజర్‌, మైక్రోస్కోపిస్ట్‌ పోస్టులు

ఏలూరులోని జిల్లా క్షయ నియంత్రణ కార్యాలయం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ కింద ఒప్పంద ప్రాతిపదికన 10 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. సీనియర్‌ ట్రీట్‌మెంట్‌ సూపర్‌వైజర్‌: 02
2. సీనియర్‌ ట్రీట్‌మెంట్‌ ల్యాబ్‌ సూపర్‌వైజర్‌: 01 
3. డీఆర్‌-టీబీ సెంటర్‌ స్టాటిస్టికల్‌ అసిస్టెంట్‌: 01  
4. ఆర్‌ఎన్‌టీసీపీ ల్యాబ్‌ టెక్నీషియన్‌/మైక్రోస్కోపిస్ట్‌: 05
5. ట్యూబర్‌క్యులోసిస్‌ హెల్త్‌ విజిటర్‌: 01

అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్‌, డిగ్రీ, డిప్లొమా, డ్రైవింగ్‌ లైసెన్స్‌.
వయసు: 42 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను జిల్లా టీబీ నియంత్రణ అధికారి, జిల్లా టీబీ నియంత్రణ కార్యాలయం, రూమ్‌ నెం.77, జీజీహెచ్‌ క్యాంపస్‌, ఎన్‌ఆర్‌ పేట్‌, ఏలూరులో అందజేయాలి.
ఎంపిక: అకడమిక్‌ మెరిట్‌, పని అనుభవం ఆధారంగా.
దరఖాస్తుకు చివరి తేదీ: 28.12.2022.
వెబ్‌సైట్‌: https://westgodavari.ap.gov.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని