Published : 29 Dec 2022 00:42 IST

టాటా స్మారక ఆస్పత్రుల్లో 405 ఉద్యోగాలు

ముంబయిలోని టాటా స్మారక కేంద్రం దేశవ్యాప్తంగా ఉన్న టాటా స్మారక ఆస్పత్రుల్లో 405 ఎల్‌డీసీ, ట్రేడ్‌ హెల్పర్‌, అటెండెంట్‌, నర్సు పోస్టుల భర్తీ చేయబోతోంది. ముంబయి, సంగ్రూర్‌, విశాఖపట్నం, ముజఫర్‌పూర్‌, వారణాసిల్లో టాటా మెమోరియల్‌ హాస్పిటల్స్‌లో ఈ ఖాళీలు ఉన్నాయి. రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా నియామకాలుంటాయి.

ల్‌డీసీ పోస్టులకు 27 ఏళ్లు, అటెండెంట్‌కు 25 ఏళ్లు, ట్రేడ్‌ హెల్పర్‌కు 30 ఏళ్లు, నర్స్‌-ఎకు 30 ఏళ్లు, నర్స్‌-బికు 35 ఏళ్లు, నర్స్‌-సికు 40 ఏళ్లు మించకూడదు. గరిష్ఠ వయసులో.. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 ఏళ్లు, టాటా మెమోరియల్‌ సెంటర్‌ ఉద్యోగులకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది.

ప్రకటించిన ఖాళీలు

* లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌: 18

* అటెండెంట్‌: 20

* ట్రేడ్‌ హెల్పర్‌: 70 బీ నర్సు-ఎ: 122  

* నర్స్‌-బి: 30 బీ నర్స్‌-సి: 55

ఏ అర్హతలుండాలి?

1. ఎల్‌డీసీ పోస్టులకు డిగ్రీ పాసై ఉండాలి. ఎంఎస్‌-సిట్‌ లేదా మూడు నెలలకు తక్కువ కాకుండా కంప్యూటర్‌ కోర్సు పూర్తిచేయాలి. కంప్యూటర్‌ లేదా ఐటీలో డిప్లొమా/డిగ్రీ చేసినవాళ్లకు మూడు నెలల కంప్యూటర్‌ కోర్సు నుంచి మినహాయింపు ఉంటుంది. క్లర్క్‌గా ఏడాది ఉద్యోగానుభవం ఉండాలి. ఈ పోస్టుకు ఎంపికైనవారిని టాటా మెమోరియల్‌ హాస్పిటల్‌, ముంబయిలో నియమిస్తారు.

2. అటెండెంట్‌ పోస్టులకు పదోతరగతి పాసవ్వాలి. ఏడాది పని అనుభవం ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు పంజాబ్‌లోని ములాన్‌పూర్‌లో, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో పనిచేయాలి.

3. ట్రేడ్‌ హెల్పర్‌ పోస్టుకు పదోతరగతి పాసవ్వాలి. ఆపరేషన్‌ థియేటర్‌/ ఐసీయూ/ డయాగ్నొస్టిక్‌ సర్వీసెస్‌/ ల్యాబొరేటరీల్లో పరికరాల నిర్వహణలో ఏడాది అనుభవం ఉండాలి. ఎంపికైనవారిని పంజాబ్‌లోని ములాన్‌పూర్‌లో, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో నియమిస్తారు.

4. నర్స్‌-ఎ: జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీతోపాటు ఆంకాలజీ నర్సింగ్‌లో డిప్లొమా.. 50 పడకల హాస్సిటల్‌లో ఏడాది పనిచేసిన అనుభవం ఉండాలి / బేసిక్‌ లేదా పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌తో 50 పడకల హాస్సిటల్‌లో ఏడాది పనిచేసిన అనుభవం ఉండాలి. టాటా మెమోరియల్‌ సెంటర్‌లో డిప్లొమా ఇన్‌ నర్సింగ్‌ ఆంకాలజీ చేసి బాండ్‌ పీరియడ్‌ మొత్తం పనిచేసినవారికి గరిష్ఠ వయసులో 5 ఏళ్ల మినహాయింపు ఉంటుంది. ఈ పోస్టుకు ఎంపికైతే ముంబయి, వారణాసి, ముజఫర్‌పూర్‌లలో నియమిస్తారు.

5. నర్స్‌-బి: జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీతోపాటు ఆంకాలజీ నర్సింగ్‌లో డిప్లొమా ఉండాలి. 100 పడకల ఆసుపత్రిలో ఆరేళ్ల పని అనుభవం ఉండాలి. లేదా బీఎస్సీ (నర్సింగ్‌)/ పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ (నర్సింగ్‌)తోపాటు 100 పడకల ఆసుపత్రిలో ఆరేళ్ల పని అనుభవం ఉండాలి. పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీకి ముందు హాస్పిటల్‌లో పనిచేసిన అనుభవం ఉన్నా సరిపోతుంది. అడ్మినిస్ట్రేటివ్‌/ఆంకాలజీ అనుభవం/ హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సు చేసినవారికి ప్రాధాన్యమిస్తారు. ఎంపికైన అభ్యర్థులను వారణాసి, ముజఫర్‌పూర్‌లలో నియమిస్తారు.

6. నర్స్‌-సి: జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీతోపాటు ఆంకాలజీ డిప్లొమా చేసి..100 పడకల ఆసుపత్రిలో 12 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. లేదా బీఎస్సీ (నర్సింగ్‌)/ పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ (నర్సింగ్‌)చేసి 100 పడకల హాస్పిటల్‌లో 12 ఏళ్లు పనిచేసిన అనుభవం అవసరం. పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీకి ముందు హాస్పిటల్‌లో పనిచేసిన అనుభవం ఉన్నా పరిగణనలోకి తీసుకుంటారు. అడ్మినిస్ట్రేటివ్‌/ ఆంకాలజీ అనుభవం/ హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సు చేసినవారికి ప్రాధాన్యమిస్తారు. ఈ పోస్టుకు ఎంపికైనవారిని వారణాసి, ముజఫర్‌పూర్‌, విశాఖపట్నాల్లో నియమిస్తారు.

నర్సింగ్‌ పోస్టుల్లో 20 శాతం ఖాళీలకు పురుష అభ్యర్థులనూ పరిగణనలోకి తీసుకుంటారు.

దరఖాస్తు రుసుము: రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. ఫీజును ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 10.01.2023

వెబ్‌సైట్‌: https://tmc.gov.in/


ఎంపిక ఇలా..

1. ఎల్‌డీసీ పోస్టులకు రాత, నైపుణ్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్షకు 100 మార్కులు. నెగెటివ్‌ మార్కులు లేవు. పరీక్ష ఇంగ్లిష్‌లో ఉంటుంది. కాలవ్యవధి 3 గంటలు. డిస్క్రిప్టివ్‌, మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు పరీక్షలో 50 శాతం మార్కులు, ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు 40 శాతం మార్కులు సాధించాలి. రాత పరీక్షలో పాసైన అభ్యర్థులను స్కిల్‌ టెస్ట్‌కు ఎంపికచేస్తారు. ఈ పరీక్ష 50 మార్కులకు ఉంటుంది. అన్ని కేటగిరీల అభ్యర్థులూ దీంట్లో 25 మార్కులు సాధించాలి.

2. అటెండెంట్‌, ట్రేడ్‌ హెల్పర్‌ పోస్టులకూ రాత, నైపుణ్య పరీక్షలు ఉంటాయి. రాత పరీక్షకు 100, నైపుణ్య పరీక్షకు 50 మార్కులు ఉంటాయి. పరీక్షను హిందీ, ఇంగ్లిష్‌లో నిర్వహిస్తారు. నెగెటివ్‌ మార్కింగ్‌ లేదు. రాత పరీక్షలో ప్రశ్నలు జనరల్‌ నాలెడ్జ్‌, కరెంట్‌ అఫైర్స్‌, బేసిక్‌ ఇంగ్లిష్‌, మ్యాథమెటిక్స్‌ పరిజ్ఞానంపై ఉంటాయి. పరీక్ష వ్యవధి గంట. ఈ పరీక్షలో జనరల్‌ అభ్యర్థులు 50, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు 40 మార్కులు సాధించాలి. నైపుణ్య పరీక్షలో కనీసార్హత మార్కులు 25. అన్ని కేటగిరీల అభ్యర్థులూ ఈ మార్కులను సాధించాలి.

3. నర్స్‌-ఎ, బి, సి: ఈ పోస్టులకు రాత పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. డిస్క్రిప్టివ్‌, మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు (ఎంసీక్యూ) ఉంటాయి. పరీక్షను ఇంగ్లిష్‌లో మాత్రమే నిర్వహిస్తారు. కాలవ్యవధి గంట. మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు 50 ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు. నెగెటివ్‌ మార్కింగ్‌ లేదు. నర్స్‌-ఎకు జనరల్‌ నాలెడ్జ్‌, జనరల్‌ నర్సింగ్‌, నర్సింగ్‌ మ్యాథమెటిక్స్‌, ఇంగ్లిష్‌, ఆంకాలజీకి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. నర్స్‌-బికు.. జనరల్‌ నాలెడ్జ్‌, జనరల్‌ నర్సింగ్‌, నర్సింగ్‌ మ్యాథమెటిక్స్‌, ఇంగ్లిష్‌, ఆంకాలజీ, సైకాలజీ, నర్సింగ్‌ కమ్యూనికేషన్‌పైన ప్రశ్నలు ఇస్తారు. నర్స్‌-సికి.. జనరల్‌ నాలెడ్జ్‌, జనరల్‌ నర్సింగ్‌, నర్సింగ్‌ మ్యాథమెటిక్స్‌, ఇంగ్లిష్‌, ఆంకాలజీ, సైకాలజీ, నర్సింగ్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, నర్సింగ్‌ మేనేజ్‌మెంట్‌, డిజాస్టర్‌ ప్రిపేర్డ్‌నెస్‌/ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ సంబంధిత ప్రశ్నలు వస్తాయి. రాత పరీక్షలో జనరల్‌ అభ్యర్థులకు పాస్‌ మార్కులు 50. ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 40 మార్కులు సంపాదించాలి.  

స్కిల్‌ టెస్ట్‌కు 50 మార్కులు. అన్ని కేటగిరీలకు చెందిన అభ్యర్థులు దీంట్లో 40 మార్కులు సాధించాలి. ఈ పరీక్షలో నర్సింగ్‌ ప్రొసీజర్‌, డ్రగ్స్‌ నాలెడ్జ్‌, సిచ్యువేషనల్‌ క్రిటికల్‌ థింకింగ్‌, ఐడెంటిఫికేషన్‌ ఆఫ్‌ ఎక్విప్‌మెంట్‌/ఆర్టికల్‌/మెషిన్‌ పరిజ్ఞానంపై ప్రశ్నలు ఉంటాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని