Published : 04 Jan 2023 00:22 IST

నోటిఫికేషన్స్‌

ప్రవేశాలు

జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో...

649 జవహర్‌ నవోదయ విద్యాలయ (జేఎన్‌వీ)ల్లో ఆరో తరగతి ప్రవేశాలకు సంబంధించి జవహర్‌ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష-2023 ప్రకటన వెలువడింది. ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 జేఎన్‌వీలు ఉన్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తారు.

అర్హత: విద్యార్థి జవహర్‌ నవోదయ విద్యాలయం ఉన్న జిల్లాల్లో నివాసి అయివుండాలి. 2022-23 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతుండాలి.

వయసు: 1.5.2011 నుంచి 30.4.2013 మధ్యలో జన్మించినవారై ఉండాలి.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో జేఎన్‌వీ అధికారిక వైబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ధ్రువీకరించిన సర్టిఫికెట్‌ సాఫ్ట్‌ కాపీని అప్‌లోడ్‌ చేయాలి. దీంతో పాటు అభ్యర్థి ఫొటో, అభ్యర్థి, తల్లిదండ్రుల సంతకాలు, ఆధార్‌ / నివాస ధ్రువపత్రాల వివరాలు అవసరమవుతాయి.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 31-01-2023

ప్రవేశ పరీక్ష తేదీ: 2023 ఏప్రిల్‌ 29

ఫలితాల వెల్లడి: 2023, జూన్‌

వెబ్‌సైట్‌: https://navodaya.gov.in/nvs/en/Home1


జిప్‌మర్‌లో బీఎస్సీ కోర్సులు

పుదుచ్చేరిలోని జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (జిప్‌మర్‌) 2022-23 విద్యా సంవత్సరానికి  నాలుగేళ్ల బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

బీఎస్సీ నర్సింగ్‌: 94 సీట్లు

బీఎస్సీ అలైడ్‌ హెల్త్‌ సైన్సెస్‌: 87 సీట్లు

అర్హత: 50% మార్కులతో 10+2 హయ్యర్‌/ సీనియర్‌ సెకండరీ పరీక్ష (ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ/ బోటనీ అండ్‌ జువాలజీ) ఉత్తీర్ణతతో పాటు నీట్‌యూజీ 2022లో అర్హత.

వయసు: 17 ఏళ్లు పూర్తయి ఉండాలి. గరిష్ఠ పరిమితి లేదు.జ్ఞ

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 20-01-2023.

తరగతులు ప్రారంభం: 09.02.2023.

వెబ్‌సైట్‌:https://jipmer.edu.in/


ప్రభుత్వ ఉద్యోగాలు

అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌లు

113 సహాయ మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌(ఏఎంవీఐ) పోస్టులకు  టీఎస్‌పీఎస్సీ ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. మల్టీజోన్‌-1లో 54, మల్టీజోన్‌-2లో 59 ఏఎంవీఐ పోస్టులు ఉన్నాయి.

అర్హత: ఇంజినీరింగ్‌ డిగ్రీ (మెకానికల్‌ ఇంజినీరింగ్‌/ ఆటోమొబైల్‌). లేదా డిప్లొమా (ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌)తో పాటు హెవీ మోటారు వాహన (ట్రాన్స్‌పోర్ట్‌ వెహికిల్‌) డ్రైవింగ్‌ లైసెన్స్‌.

వయసు: 01/07/2022 నాటికి 21 - 39 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష (ఆబ్జెక్టివ్‌ టైప్‌) పేపర్‌-1, పేపర్‌-2 ఆధారంగా.

దరఖాస్తు, పరీక్ష రుసుము: రూ.320.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 12/01/2023.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 01/02/2023.

పరీక్ష తేదీ (ఆబ్జెక్టివ్‌ టైప్‌): 23/04/2023.

వెబ్‌సైట్‌: https://websitenew.tspsc.gov.in/


డిగ్రీ కాలేజీల్లో 544 ఖాళీలు

టీఎస్‌పీఎస్సీ డిగ్రీ కళాశాలల్లో 544 అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల్ల (లెక్చరర్లు), ఫిజికల్‌ డైరెక్టర్ల, లైబ్రేరియన్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 31.01.2023

దరఖాస్తుకు చివరి తేదీ: 20.02.2023.

వెబ్‌సైట్‌: https://websitenew.tspsc.gov.in


ఎయిమ్స్‌-భువనేశ్వర్‌లో...

భువనేశ్వర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌) ఒప్పంద ప్రాతిపదికన 88 సీనియర్‌ రెసిడెంట్‌ (నాన్‌ అకడమిక్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: సైకాలజీ, రేడియోథెరపీ, యూరాలజీ, పాథాలజీ, డెర్మటాలజీ, బయోకెమిస్ట్రీ, అనాటమీ తదితరాలు.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ డీఎన్‌బీ/ ఎంఎస్‌.

వయసు: 45 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: మెరిట్‌, రాతపరీక్ష ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.1500

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తుకు చివరి తేదీ: 14.01.2023

వెబ్‌సైట్‌: https://aiimsbhubaneswar.nic.in/Recruitment_Notice.aspx


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని