నోటిఫికేషన్స్‌

తెలంగాణ జ్యుడీషియల్‌ మినిస్టీరియల్‌ సర్వీసులో 275 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్‌ జారీ చేసింది.  

Updated : 09 Jan 2023 06:42 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

275 జూనియర్‌ అసిస్టెంట్‌లు

తెలంగాణ జ్యుడీషియల్‌ మినిస్టీరియల్‌ సర్వీసులో 275 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్‌ జారీ చేసింది.  

అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ. కంప్యూటర్‌ పరిజ్ఞానం లేదా కంప్యూటర్‌ ఆపరేషన్‌ అర్హతతో పాటు స్థానిక భాషలు తెలిసి ఉండాలి.

వయసు: 01-07-2022 నాటికి 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక: సీబీటీ/ ఓఎమ్మార్‌ పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు రుసుం: ఓసీ/ ఓబీసీ అభ్యర్థులకు రూ.600 (ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.400).

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 11-01-2023.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 31-01-2023.

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష తేదీ: మార్చి 2023.

వెబ్‌సైట్‌: https://tshc.gov.in/getRecruitDetails

రికార్డు అసిస్టెంట్‌ కొలువులు

తెలంగాణ జ్యుడీషియల్‌ మినిస్టీరియల్‌ సర్వీసులో 97 రికార్డు అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్‌ జారీ చేసింది.  

అర్హత: ఇంటర్మీడియట్‌. నిర్ణీత విద్య, సాంకేతిక అర్హతల కంటే ఎక్కువ ఉన్న అభ్యర్థులు, ధ్రువపత్రాల పరిశీలన సమయంలో

పత్రాలను అందజేయాలి.

వయసు: 01-07-2022 నాటికి 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు; దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

ఎంపిక: సీబీటీ/ ఓఎమ్మార్‌ పరీక్ష ఆధారంగా. దరఖాస్తు రుసుం: ఓసీ/ ఓబీసీ అభ్యర్థులకు రూ.600 (ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.400).

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 11-01-2023.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 31-01-2023.

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష తేదీ: మార్చి 2023.

వెబ్‌సైట్‌: https://tshc.gov.in/getRecruitDetails

ప్రాసెస్‌ సర్వర్‌ పోస్టులు

163 ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్‌ జారీ చేసింది.

అర్హత: పదో తరగతి. అభ్యర్థులు దరఖాస్తులో వృత్తిపరమైన నైపుణ్యాలను పేర్కొనడంతో పాటు స్థానిక భాషలు తెలిసి ఉండాలి.

వయసు: 01-07-2022 నాటికి 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక: సీబీటీ/ ఓఎమ్మార్‌ పరీక్ష(45 మార్కులు), ఇంటర్వ్యూ(5 మార్కులు) ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 11-01-2023.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 31-01-2023.

వెబ్‌సైట్‌: https://tshc.gov.in/getRecruitDetails

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని