Updated : 10 Jan 2023 05:22 IST

నోటిఫికేషన్స్‌

ప్రభుత్వ ఉద్యోగాలు

గెయిల్‌-న్యూదిల్లీలో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

న్యూదిల్లీలోని గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (గెయిల్‌) చీఫ్‌ మేనేజర్‌, సీనియర్‌ ఇంజినీర్‌, సీనియర్‌ ఆఫీసర్‌, ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌, సెక్యూరిటీ, ఫైర్‌ అండ్‌ సేఫ్టీ, మెకానికల్‌, రెన్యూవబుల్‌ ఎనర్జీ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 65 శాతం మార్కులతో ఇంజినీరింగ్‌ డిగ్రీ/ గ్రాడ్యుయేషన్‌/ బీఈ/ బీటెక్‌/ ఎంబీఏ/ సీఏ/ సీఎంఏ/ మాస్టర్స్‌ డిగ్రీ/ పీజీ డిప్లొమా.

వయసు: 28-45 ఏళ్లు ఉండాలి.

అనుభవం: కనీసం 1-12 ఏళ్లు.

ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, స్క్రీనింగ్‌, గ్రూప్‌ డిస్కషన్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.200.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 02.02.2023

వెబ్‌సైట్‌: www.gailonline.com/ CRApplying Gail. html


సీఎంటీఐ-బెంగళూరులో...

బెంగళూరులోని సెంట్రల్‌ మాన్యుఫాక్చరింగ్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎంటీఐ) 18 సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్‌ గ్రాడ్యు యేషన్‌/ మాస్టర్స్‌ డిగ్రీ(ఇంజినీరింగ్‌)/ ఎంసీఏ/ పీహెచ్‌డీ.

వయసు: 32-40 ఏళ్లు.

ఎంపిక: స్క్రీనింగ్‌, మెరిట్‌, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా.

చిరునామా: చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, సెంట్రల్‌ మాన్యుఫాక్చరింగ్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌, తుంకూర్‌ రోడ్‌, బెంగళూరు 560022.

దరఖాస్తుకు చివరి తేదీ: 05.02.2023

వెబ్‌సైట్‌: https://cmti.res.in/vacancies/


ఎయిమ్స్‌ రాయ్‌పూర్‌లో...

ఛత్తీస్‌గఢ్‌ రాయ్‌పూర్‌లోని ఎయిమ్స్‌.. ఒప్పంద ప్రాతిపదికన కింది విభాగాల్లో 39 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

విభాగాలు: అనస్థీషియాలజీ, బర్న్స్‌ అండ్‌ ప్లాస్టిక్‌ సర్జరీ, కార్డియాలజీ, క్లినికల్‌ హెమటాలజీ, ఎండోక్రైనాలజీ అండ్‌ మెటబాలిజం, గ్యాస్ట్రోఎంటరాలజీ, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌, మెడికల్‌ అంకాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ తదితరాలు.

అర్హత: సంబంధిత స్పెషాలిటీలో మెడికల్‌ పీజీ, ఎండీ, ఎంఎస్‌, డీఎం, ఎంసీహెచ్‌+ బోధన/ పరిశోధన అనుభవం.  

వయసు: 50 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు రుసుము: రూ.1,000 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌, మహిళా అభ్యర్థులకు రుసుం చెల్లింపు నుంచి మినహాయింపు).

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 27.01.2023.

వెబ్‌సైట్‌: https://www.aiimsraipur.edu.in/


51 యంగ్‌ ప్రొఫెషనల్‌ ఖాళీలు

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్‌ కోఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌సీడీసీ) ఒప్పంద ప్రాతిపదికన 51 యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: ఎంబీఏ(మార్కెటింగ్‌) ఉత్తీర్ణత.

వయసు: 32 ఏళ్లు మించకూడదు.

కాంట్రాక్ట్‌ వ్యవధి: 3 ఏళ్లు.

ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌/ఇంటర్వ్యూ/ గ్రూప్‌ డిస్కషన్‌ ద్వారా.  

దరఖాస్తు: అభ్యర్థులు సంబంధిత ప్రాంతీయ కార్యాలయాల్లో ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు గడువు: ఉద్యోగ ప్రకటన వెలువడిన 21 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌సైట్‌: https://www.ncdc.in/index. jsp?page=career=en


ఐఐఎస్‌టీ-కేరళలో రిసెర్చ్‌స్టాఫ్‌  

కేరళలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (ఐఐఎస్‌టీ) 14 రిసెర్చ్‌ ఫెలో/ ప్రాజెక్ట్‌ ఫెలో  పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  

అర్హత: పోస్టును అనుసరించి బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌/ ఎమ్మెస్సీ.

వయసు: 35 ఏళ్లు మించకూడదు. ఎంపిక: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.  

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 25.01.2023

వెబ్‌సైట్‌: https://www.iist.ac.in/career/3


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని