ప్రభుత్వ ఉద్యోగాలు

రాజస్థాన్‌ రాష్ట్రం జోధ్‌పూర్‌లోని ఎయిమ్స్‌ ఒప్పంద ప్రాతిపదికన 114 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Published : 11 Jan 2023 00:21 IST

114 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు

రాజస్థాన్‌ రాష్ట్రం జోధ్‌పూర్‌లోని ఎయిమ్స్‌ ఒప్పంద ప్రాతిపదికన 114 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

విభాగాలు: అనస్థీషియాలజీ అండ్‌ క్రిటికల్‌ కేర్‌, అనాటమీ, బయోకెమిస్ట్రీ, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, డయాగ్నోస్టిక్‌ అండ్‌ ఇంటర్వెన్షనల్‌ రేడియాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ అండ్‌ టాక్సికాలజీ, జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌, మైక్రోబయాలజీ, న్యూక్లియర్‌ మెడిసిన్‌, ఆఫ్తల్మాలజీ

అర్హత: మెడికల్‌ పీజీ ఎంఎస్‌, ఎండీ, డీఎన్‌బీ, ఎండీఎస్‌, పీహెచ్‌డీ.

వయసు: 45 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు రుసుము: రూ.1,000 (ఎస్సీ, ఎస్టీలకు రూ.800; దివ్యాంగులకు ఫీజు మినహాయింపు).

ఎంపిక: రాత పరీక్ష, అకడమిక్‌ రికార్డు, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 03-02-2023.

వెబ్‌సైట్‌: https://www.aiimsjodhpur.edu.in/index.php


ఎఫ్‌టీఐఐ-పుణెలో 30 వివిధ ఖాళీలు

పుణెలోని ఫిల్మ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌టీఐఐ) 30 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: ప్రొఫెసర్లు, ఇంజినీర్లు, చీఫ్‌ లైబ్రేరియన్‌, రిసెర్చ్‌ ఆఫీసర్లు.

విభాగాలు: ఫిల్మ్‌ డైరెక్షన్‌, టీవీ టెక్నికల్‌ మేనేజ్‌మెంట్‌, టీవీ ప్రొడక్షన్‌, టీవీ ఇంజినీరింగ్‌, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్‌ తదితరాలు.

అర్హత: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి డిగ్రీ/ డిప్లొమా/ మాస్టర్స్‌డిగ్రీ/ ఎంఎస్సీ/ పీజీ.

వయసు: 30-50 ఏళ్లు ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.1000

ఎంపిక: ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 14.02.2023

వెబ్‌సైట్‌: https://www.ftii.ac.in/vacancies/year/2022


ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ

టెక్నికల్‌ అసిస్టెంట్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌లు

హైదరాబాద్‌లోని ఐసీఏఆర్‌- ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌ రిసెర్చ్‌ ఒప్పంద ప్రాతిపదికన టెక్నికల్‌ అసిస్టెంట్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌ తదితర ఖాళీల భర్తీకి ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

టెక్నికల్‌ అసిస్టెంట్‌: 02 

సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో: 03

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజిస్ట్‌/ ఎంఐఎస్‌: 01 

ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌-2: 01  

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమాతో పాటు పని అనుభవం.

వయసు: 35 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు పంపాల్సిన ఈ-మెయిల్‌: iimrfpo@gmail.com

దరఖాస్తుకు చివరి తేదీ: 25-01-2023.

ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ తేదీ: 30-01-2023.

వెబ్‌సైట్‌: https://www.millets.res.in/ad.php


వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ

ఐఎఫ్‌బీ-హైదరాబాద్‌లో...

హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ బయోడైవర్సిటీ (ఐఎఫ్‌బీ) 5 జూనియర్‌ రిసెర్చ్‌ఫెలో, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: పోస్టును అనుసరించి బీఎస్సీ/ ఎంఎస్సీ (బోటనీ/ ఫారెస్ట్రీ / అగ్రికల్చర్‌/ మైక్రోబయాలజీ స్పెషలైజేషన్‌ / ప్లాంట్‌ పాథాలజీ/ మైకాలజీ తదితరాలు).

వయసు: 28 ఏళ్లు మించకూడదు.

ఇంటర్వ్యూ వేదిక: Institute of Forest Biodiversity sIFBz, Dulapally, Kompally sS.O.z, Hyderabad, Telangana - 500 100.

ఇంటర్వ్యూ తేదీ: 23.01.2023

వెబ్‌సైట్‌: https://ifb.icfre.gov.in/vacancy


అప్రెంటిస్‌షిప్‌

హెచ్‌పీసీఎల్‌, విశాఖ రిఫైనరీలో..

విశాఖపట్నంలోని హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌, విశాఖ రిఫైనరీ 100 ఇంజినీరింగ్‌ విభాగాల్లో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ట్రైనీ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, పెట్రోకెమికల్‌ ఇంజినీరింగ్‌, సేఫ్టీ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, ఆయిల్‌ టెక్నాలజీ, ఫుడ్‌ టెక్నాలజీ అండ్‌ పెట్రోలియం ఇంజినీరింగ్‌.

అర్హత: 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌.

వయసు: 07-01-2023 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

నెలవారీ స్టైపెండ్‌: రూ.25,000.

ఎంపిక: ఇంజినీరింగ్‌ మార్కులు, ఇంటర్వ్యూ స్కోరు ఆధారంగా.

ఎన్‌ఏటీఎస్‌ పోర్టల్‌లో ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 14-01-2023.

వెబ్‌సైట్‌: http://portal.mhrdnats.gov.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని