బీఆర్‌ఓలో 567 ఉద్యోగాలు
న్యూదిల్లీలోని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్‌ఓ) నుంచి నియామక ప్రకటన వెలువడింది. వెహికల్ మెకానిక్, ఆపరేటర్ కమ్యూనికేషన్, ఎంఎస్‌డబ్ల్యూ మేసన్ మొదలైన 567 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్ (ట్రేడ్ టెస్ట్) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ప్రకటించిన ఖాళీల్లో రేడియో మెకానిక్-2, ఆపరేటర్ కమ్యూనికేషన్-154, డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్‌పోర్ట్ (ఓజీ)-9, వెహికల్ మెకానిక్-236, ఎంఎస్‌డబ్ల్యూ డ్రిల్లర్-11, ఎంఎస్‌డబ్ల్యూ మేసన్-149, ఎంఎస్‌డబ్ల్యూ పెయింటర్-5, ఎంఎస్‌డబ్ల్యూ మెస్ వెయిటర్-1 పోస్టులున్నాయి. మొత్తం 567 పోస్టుల్లో అన్‌రిజర్వుడ్‌కు 244, ఎస్సీకి 92, ఎస్సీకి 30, ఓబీసీకి 148, ఈడబ్ల్యూఎస్‌కు 53 కేటాయించారు.
పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్, ఐటీఐ పాసవ్వాలి. డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
వయసు: రేడియో మెకానిక్, ఆపరేటర్ (కమ్యూనికేషన్), డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్‌పోర్ట్ (ఆర్డినరీ గ్రేడ్), వెహికల్ మెకానిక్ పోస్టులకు అభ్యర్థుల వయసు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. మల్టీస్కిల్డ్ వర్కర్ డ్రిల్లర్, మల్టీస్కిల్డ్ వర్కర్ మేసన్, మల్టీస్కిల్డ్ వర్కర్ పెయింటర్, మల్టీస్కిల్డ్ వర్కర్ మెస్ వెయిటర్ ఈ పోస్టులకు అభ్యర్థుల వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. గరిష్ఠ వయసులో ఎస్సీ/ ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, ఎక్స్-సర్వీస్‌మెన్‌లకు 3 ఏళ్లు, పీడబ్ల్యూడీలకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది.
రాత పరీక్షలో...
* రేడియో మెకానిక్ అభ్యర్థులకు ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్, వైర్‌లెస్ ఎక్విప్‌మెంట్స్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, 10 లైన్స్ స్విచ్ బోర్డ్ ఆపరేషన్, ఛార్జింగ్, బ్యాటరీస్ ఆపరేషన్, రేడియో మెకానిజం ప్రిన్సిపల్స్, మోర్స్ కోడ్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్ అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.
* ఆపరేటర్ కమ్యూనికేషన్ పోస్టుకు టెలి కమ్యూనికేషన్ ఎక్విప్‌మెంట్ ఇన్‌స్పెక్షన్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్, టెలి కమ్యూనికేషన్ ఎక్విప్‌మెంట్స్, టెలి కమ్యూనికేషన్ ఎక్విప్‌మెంట్స్ ఇన్‌స్టలేషన్, క్యారియర్, వైర్‌లెస్ అండ్ లైన్ థియరీ, కండెన్సర్స్ అండ్ వాల్వ్ థియరీ, వైర్‌లెస్ వేవ్స్ ప్రాపగేషన్, ట్రాన్స్‌మిటర్ అండ్ రిసీవర్, పవర్ సప్లయ్ సిస్టమ్, ఎక్స్చేంజ్ స్విచ్ బోర్డ్స్, రికార్డ్స్ మెయింటెనెన్స్, ఇంగ్లిష్ (పదోతరగతి స్థాయి), జనరల్ నాలెడ్జ్ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
* డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్‌పోర్ట్ (ఆర్డినరీ గ్రేడ్) పోస్టుకు హెవీ/ లైట్ వెహికల్ మెయింటెనెన్స్, ఆయిల్స్/లూబ్రికెంట్స్ యూజ్, టైర్ రొటేషన్, రోడ్‌సైన్స్, ట్రాఫిక్ రూల్స్, టూల్స్ యూజ్, జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి.
* వెహికల్ మెకానిక్ పోస్టుకు పెట్రోల్/ డీజిల్ ఇంజిన్స్ ఆపరేషన్స్, ఫాల్ట్స్ చెకింగ్, ఇంజిన్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్, ఫ్యూయల్ సిస్టమ్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్, బ్రేక్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ క్లచ్ సిస్టమ్, చేసిస్ మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
* మల్టీస్కిల్డ్ వర్కర్ డ్రిల్లర్ పోస్టుకు రాక్ డ్రిల్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, హైడ్రాలిక్ జాక్ ఎక్విప్‌మెంట్స్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, డ్రిల్ బిట్స్ నాలెడ్జ్, ఎక్విప్‌మెంట్స్ పీరియాడిక్ చెకింగ్, ఆయిల్స్/ లూబ్రికెంట్స్, సేఫ్టీప్రికాషన్స్, జనరల్‌నాలెడ్జ్ ప్రశ్నలు ఇస్తారు.
* మల్టీస్కిల్డ్ వర్కర్ మేసన్ పోస్టుకు కాంక్రీట్, కాంక్రీట్ మిక్సింగ్, బ్రిక్/స్టోన్ మేసన్రీ వర్క్స్, ఫ్లోర్స్ రకాలు, పాయింటింగ్, సిమెంట్ మోర్టర్, దాని ఉపయోగాలు, ప్లాస్టరింగ్, స్టాగింగ్ అండ్ షట్టరింగ్, జీకే ప్రశ్నలుంటాయి.
* మల్టీస్కిల్డ్ వర్కర్ పెయింటర్ పోస్టుకు స్టెన్సిల్స్ కటింగ్, ఇంగ్లిష్ అండ్ హిందీ ఆల్ఫబెట్స్ లెటర్ రైటింగ్ అండ్ న్యూమరికల్స్ ఆఫ్ స్పెసిఫిక్ సైజ్, డ్రాయింగ్స్ మేకింగ్, పెయింటింగ్ అండ్ ఉడ్ పాలిషింగ్/వేనిషింగ్, డిఫరెంట్ టైప్స్ పెయింట్స్ నాలెడ్జ్, ప్రిపరేషన్ అండ్ స్టోరేజ్ ఆఫ్ పెయింట్స్ అండ్ వానిషెస్, జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు అడుగుతారు.
* మల్టీస్కిల్డ్ వర్కర్ మెస్ వెయిటర్ పోస్టుకు రూమ్ మెయింటెనెన్స్, ఫుడ్ సర్వీస్, బేవరేజ్ సర్వీస్, జనరల్ నాలెడ్జ్ సంబంధిత ప్రశ్నలు ఇస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.50. ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా ‘కమాండెంట్, బీఆర్‌ఓ స్కూల్ అండ్ సెంటర్, డిఘి క్యాంప్, పుణె’ చిరునామాకు పంపాలి. దరఖాస్తును ఉద్యోగ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 45 రోజుల్లో రిజిస్టర్ పోస్టులో ఎక్నాలెడ్జ్‌మెంట్‌తో పంపాలి.
పరీక్ష కేంద్రం: ఫిజికల్ ఎఫిషియన్సీ, ప్రాక్టికల్ (ట్రేడ్, రిటెన్) టెస్టులను పుణెలోని బీఆర్‌వో స్కూల్ అండ్ సెంటర్‌లోనే నిర్వహిస్తారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అభ్యర్థుల నివాస ప్రాంతానికి దగ్గరలోని కేంద్రాల్లో పరీక్షను జరుపుతారు.
* ఒక్కొక్కరూ ఎన్ని పోస్టులకైనా దరఖాస్తు చేయొచ్చు. అయితే ప్రతి పోస్టుకూ వేర్వేరుగా దరఖాస్తు నింపి, ఫీజు చెల్లించాలి.
* అన్‌రిజర్వుడ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థుల కనీసార్హత మార్కులు 50 శాతం. ఎస్సీ/ఎస్టీ కేటగిరీకి చెంది అభ్యర్థులు 40 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది.
* ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను ప్రాక్టికల్ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. రాత, ట్రేడ్ పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా తుది జాబితా రూపొందిస్తారు.
వెబ్‌సైట్: www.bro.gov.in
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Supreme Court: లోక్‌సభ సభ్యత్వ అనర్హత.. ఫైజల్ అహ్మద్ పిటిషన్‌పై విచారణ నేడు
-
Crime News
Cyber Crime : ఇంట్లో కూర్చోబెట్టే కాజేత
-
World News
Saudi Arabia: సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది హజ్ యాత్రికుల మృతి
-
Politics News
Vangalapudi Anitha: 40 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు: అనిత
-
Politics News
Raghurama: నాడు తెదేపాలో లక్ష్మీపార్వతిలాగా నేడు వైకాపాలో సజ్జల వ్యవహరిస్తున్నారు
-
World News
వయసు 14.. బూట్ల సైజు 23!.. అసాధారణ రీతిలో పెరుగుతున్న పాదాలు