ఎన్‌డీఏలో 251 కొలువులు
పుణెలోని ఖడక్వస్లకు చెందిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ) 251 గ్రూప్-సి పోస్టులను భర్తీ చేయబోతోంది. రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్/ స్కిల్ టెస్ట్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ప్రకటించిన ఖాళీల్లో లోయర్ డివిజన్ క్లర్క్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఫైర్‌మ్యాన్, పెయింటర్, బ్లాక్‌స్మిత్, కుక్ మొదలైనవి ఉన్నాయి. మొత్తం 251 ఖాళీల్లో జనరల్‌కు 109, ఎస్సీకి 05, ఎస్టీకి 27, ఓబీసీకి 86, ఈడబ్ల్యూఎస్‌కు 24 కేటాయించారు.
ఎల్‌డీసీ, డ్రాఫ్ట్స్‌మెన్, సివిలియన్ మోటార్ డ్రైవర్, పైర్‌మ్యాన్ పోస్టులకు 18-27 ఏళ్లు ఉండాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ - ఆఫీస్ అండ్ ట్రెయినింగ్, పెయింటర్, కంపోజిటర్- కమ్- ప్రింటర్, సినిమా ప్రొజెక్షనిస్ట్-2, కుక్, బ్లాక్‌స్మిత్, టీఏ బేకర్ అండ్ కన్‌ఫెక్షనర్, టీఏ-సైకిల్ రిపేరర్ పోస్టులకు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు సడలింపు ఉంటుంది. పీడబ్ల్యూడీ/ఈఎస్‌ఎం అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా గరిష్ఠ వయసులో మినహాయింపు వర్తిస్తుంది.
ఏ పోస్టులకు ఏ అర్హతలు?
1) లోయర్ డివిజన్ క్లర్క్: 12వ తరగతి పాసవ్వాలి. స్కిల్‌టెస్ట్ టెస్టులో భాగంగా టైపింగ్ వేగాన్ని పరీక్షిస్తారు. నిమిషానికి ఇంగ్లిష్‌లో 35 పదాలు, హిందీలో 30 పదాలు కంప్యూటర్ మీద టైప్ చేయగలగాలి.
2) పెయింటర్: 12వ తరగతి/తత్సమాన పరీక్ష పాసవ్వాలి. రెండేళ్ల పని అనుభవం ఉండాలి. లేదా ఐటీఐ పాసై రెండేళ్ల అనుభవం ఉండాలి.
3) డ్రాఫ్ట్స్‌మెన్: 12వ తరగతి/తత్సమాన పరీక్ష పాసవ్వాలి. డ్రాఫ్ట్స్‌మెన్‌షిప్‌లో డిప్లొమా ఉండాలి. లేదా ఐటీఐ డ్రాఫ్ట్స్‌మెన్ సర్టిఫికెట్, రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
4) సివిలియన్ మోటర్ డ్రైవర్ (ఓజీ): 12వ తరగతి/తత్సమాన పరీక్ష పాసవ్వాలి. హెవీ వెహికల్ డ్రవింగ్ లైసెన్స్, రెండేళ్ల అనుభవం ఉండాలి.
5) కంపోజిటర్-కమ్-ప్రింటర్: 12వ తరగతి/తత్సమాన పరీక్ష పాసై, రెండేళ్ల అనుభవం ఉండాలి.
6) సినిమా ప్రొజెక్షనిస్ట్ జీడీఈ-2: 12వ తరగతి/తత్సమాన పరీక్ష పాసై రెండేళ్ల అనుభవం ఉండాలి.
7) కుక్: 12వ తరగతి పాసై రెండేళ్ల అనుభవం ఉండాలి. లేదా ఐటీఐ కుక్ సర్టిపికెట్‌తో రెండేళ్ల అనుభవం ఉండాలి.
8) బ్లాక్‌స్మిత్: 12వ తరగతి/తత్సమాన పరీక్ష పాసై రెండేళ్ల అనుభవం ఉండాలి.
9) ఫైర్‌మెన్: మెట్రిక్యులేషన్/తత్సమాన పరీక్ష పాసై, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఫస్ట్‌ఎయిడ్, ఫైర్‌ఫైటింగ్ పరికరాల వినియోగం, నిర్వహణపై సర్టిఫికెట్ ఉండాలి. ఫిజికల్ ఫిట్‌నెస్, ఏడాది అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. ఎత్తు 165 సెం.మీ. ఉండాలి. ఎస్టీ అభ్యర్థులకు ఎత్తులో 2.5 సెం.మీ. మినహాయింపు ఇస్తారు. ఛాతీ 81.5 సెం.మీ. ఉండి, గాలి పీల్చినప్పుడు 85 సెం.మీ. వ్యాకోచించాలి. 2.7 మీటర్ల లాంగ్‌జంప్ చేయగలగాలి. 3 మీటర్ల తాడును చేతులు, కాళ్ల సాయంతో ఎక్కగలగాలి.
10) టెక్నికల్ అసిస్టెంట్ - బేకర్ అండ్ కన్‌ఫెక్షనర్: ఐటీఐ బేకర్ అండ్ కన్‌ఫెక్షనర్ సర్టిఫికెట్ ఉండాలి. లేదా మెట్రిక్యులేషన్/ తత్సమాన పరీక్ష పాసవ్వాలి. ఏడాది పని అనుభవం ఉండాలి.
11) టెక్నికల్ అటెండెంట్-సైకిల్ రిపేరర్: సైకిల్ రిపేరింగ్‌లో ఐటీఐ పాస్ సర్టిఫికెట్ ఉండాలి. లేదా మెట్రిక్యులేషన్/తత్సమాన పరీక్ష పాసై ఏడాది అనుభవం ఉండాలి.
12) మల్టీ టాస్కింగ్ స్టాఫ్ - ఆఫీస్ అండ్ ట్రెయినింగ్ (ఎంటీఎస్-ఓఅండ్‌టీ): పదో తరగతి పాసవ్వాలి.
రాత పరీక్ష
* జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్‌కు సంబంధించి నాన్-వెర్బల్ ప్రశ్నలు ఉంటాయి.
* న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లిష్ సంబంధిత ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టుల్లో పది, పన్నెండో తరగతి స్థాయిలోనే ప్రశ్నలు ఉంటాయి. జనరల్ అవేర్‌నెస్ ప్రశ్నలు కూడా ఇదే స్థాయిలో ఉంటాయి.
* ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది. ప్రశ్నలను.. పోస్టులకు అవసరమైన కనీస అర్హతలను ఆధారంగా చేసుకుని ఆబ్జెక్టివ్ విధానంలో రూపొందిస్తారు.
స్కిల్‌టెస్ట్
* అభ్యర్థులు దరఖాస్తు చేసిన పోస్టులకు అనుగుణంగా అవసరమైన స్కిల్/ఫిజికల్/ప్రాక్టికల్ టెస్ట్‌ను నిర్వహిస్తారు. రాత పరీక్షకు మాత్రమే పూర్తి వెయిటేజి ఉంటుంది. స్కిల్‌టెస్ట్‌లో సాధించిన మార్కులను మొత్తం మార్కుల్లో కలపరు.
* సెలక్షన్ టెస్ట్ వివరాలను అభ్యర్థులకు ఈమెయిల్/ ఎస్‌ఎంఎస్ ద్వారా తెలియజేస్తారు. ఆ సమయంలో అప్లికేషన్ ప్రింటవుట్‌తోపాటు ఒరిజినల్ డాక్యుమెంట్లు, ఫొటో ఐడీ కార్డ్‌తో అభ్యర్థులు హాజరుకావాలి.
* ముఖ్యమైన సమాచారాన్ని ఆన్‌లైన్ అప్లికేషన్‌లో పేర్కొన్న ఈమెయిల్/ఎస్‌ఎంఎస్‌ల ద్వారానే తెలియజేస్తారు. తాజా సమాచారం కోసం అభ్యర్థులు తరచూ ఎన్‌డీఏ వెబ్‌సైట్‌ను చూస్తుండాలి.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ఉద్యోగ ప్రకటన వెలువడిన నాటి నుంచి 21 రోజుల్లోపు
దరఖాస్తు చేయాలి.
వెబ్‌సైట్: https://ndacivrect.gov.in
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TSPSC: ఏఈ ప్రశ్నపత్రం ఎంతమందికి విక్రయించారు?.. కొనసాగుతోన్న మూడో రోజు సిట్ విచారణ
-
India News
Tourism: ఈ దేశాల్లో పర్యటన.. భారతీయులకు చాలా సులువు
-
World News
School Shooting: పక్కా ప్రణాళిక రచించి.. మ్యాపుతో వచ్చి..: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం
-
Movies News
Nani: ఆ రాంబాబేనా ఈ ‘ధరణి’?.. ఆసక్తికరం నాని జర్నీ!
-
Crime News
Vizag : ఆత్మహత్య చేసుకుంటామని బంధువులకు సెల్ఫీ వీడియో పంపిన దంపతులు..
-
India News
Rahul Gandhi: ‘చట్టాన్ని గౌరవించడమే.. ’: రాహుల్ ‘అనర్హత’పై అమెరికా స్పందన ఇదే..