నోటిఫికేషన్స్
ప్రవేశాలు
ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్ష-2023
194 ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతిలో ప్రవేశాలు కల్పించడంతో పాటు ఏడు నుంచి పది తరగతుల్లోని ఖాళీ సీట్ల భర్తీకి నిర్వహించే తెలంగాణ మోడల్ స్కూల్స్ అడ్మిషన్ టెస్ట్-2023 ప్రకటన వెలువడింది.
వయసు: 2023, ఆగస్టు 31 నాటికి ఆరో తరగతికి 10 ఏళ్లు, ఏడో తరగతికి 11, ఎనిమిదో తరగతికి 12, తొమ్మిదో తరగతికి 13, పదో తరగతికి 14 ఏళ్లు నిండి ఉండాలి.
ఎంపిక: ప్రవేశ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా.
పరీక్ష ఫీజు: ఓసీ కేటగిరీ విద్యార్థులు రూ.200; ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ విద్యార్థులు రూ.125 చెల్లించాలి.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 15-02-2023
ప్రవేశ పరీక్ష తేదీ: 16-04-2023.
వెబ్‌సైట్: https://telanganams.cgg.gov.in/TSMSWEB20/#/
అప్రెంటిస్
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్‌లో..
మహారాష్ట్ర రాష్ట్రం పాల్ఘర్ జిల్లాలోని- న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, తారాపూర్ మహారాష్ట్ర సైట్ 295 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
శిక్షణ వ్యవధి: సంవత్సరం.
స్టైపెండ్: నెలకు రూ.7700 - 8855.
వయసు: 25/01/2023 నాటికి 14 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25-01-2023.
వెబ్‌సైట్: https://www.npcil.nic.in/content/289_1_Opportunities.aspx
మర్ముగావ్ పోర్ట్ అథారిటీలో..
గోవాలోని మర్ముగావ్ పోర్ట్ అథారిటీ 51 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
1. గ్రాడ్యుయేట్ అండ్ టెక్నీషియన్ అప్రింటిస్: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్ డిగ్రీ/ ఇంజినీరింగ్ డిప్లొమా.
వయసు: 18-27 ఏళ్లు ఉండాలి.
శిక్షణ వ్యవధి: ఏడాది.
స్టైపెండ్: నెలకు రూ.8000-9000 చెల్లిస్తారు.
2. ట్రేడ్ అండ్ ఒకేషనల్ అప్రెంటిస్: 10వ తరగతి, 10+2, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.
వయసు: 18-27 ఏళ్లు ఉండాలి.
శిక్షణ వ్యవధి: 01 ఏడాది.
స్టైపెండ్: నెలకు రూ.7000 చెల్లిస్తారు.
ఎంపిక: ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, మెడికల్ ఫిట్‌నెస్ ఆధారంగా.
దరఖాస్తు: ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్ ద్వారా.
దరఖాస్తుకు చివరి తేదీ: 20.01.2023
వెబ్‌సైట్: https://mptgoa.gov.in/careers.php
వాక్ ఇన్స్
డీజీఎం, మేనేజర్ ఉద్యోగాలు
న్యూదిల్లీలోని రైల్వే శాఖకు చెందిన ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా వివిధ ప్రాజెక్టుల్లో ఒప్పంద ప్రాతిపదికన డీజీఎం, మేనేజర్..
తదితర 32 పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీతో పాటు పని అనుభవం.
వయసు: 31.12.22 నాటికి జేజీఎం, డీజీఎం, మేనేజర్ పోస్టులకు 50 ఏళ్లు; ఇతర పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు.
పని ప్రదేశం: జమ్ము అండ్ కశ్మీర్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అసోం, రాజస్థాన్, కర్ణాటక, బిహార్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్.
వాక్-ఇన్ ఇంటర్వ్యూ తేదీలు: 30-01-2023, 31-01-2023, 06-02-2023, 07-02-2023, 08-02-2023.
వేదిక: ఆయా రాష్ట్రాల్లోని ఇర్కాన్- ప్రాజెక్ట్/ ఆఫీసుల్లో.
వెబ్‌సైట్: https://www.ircon.org/
ఇర్కాన్‌లో సైట్ మేనేజర్ పోస్టులు
ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన ఇర్కాన్ ముంబయి- అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్యాకేజీ ప్రాజెక్టులో 10 సైట్ మేనేజర్ పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
అర్హత: బీఈ, బీటెక్(సివిల్) లేదా డిప్లొమా (సివిల్ ఇంజనీరింగ్)తో పాటు పని అనుభవం.
వయసు: 31.12.2022 నాటికి 45 సంవత్సరాలు మించకూడదు.
వాక్-ఇన్ ఇంటర్వ్యూ తేదీ: 03-02-2023.
వేదిక: ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, సి-4, డిస్ట్రిక్ట్ సెంటర్, సాకేత్, న్యూదిల్లీ.
వెబ్‌సైట్: https://www.ircon.org/
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Andhra news: నరసరావుపేటలో ప్రధానోపాధ్యాయుడికి దేహశుద్ధి
-
India News
Bribery case: కర్ణాటక భాజపా ఎమ్మెల్యే విరూపాక్షప్ప అరెస్టు
-
India News
Temjen Imna Along: నిద్రపోవట్లే..ఫోన్ చూస్తున్నా: మంత్రి ఛలోక్తి
-
World News
Japan: పితృత్వ సెలవులు ఇస్తామంటే.. భయపడిపోతున్న తండ్రులు
-
Politics News
Gali Janardhan: రాజకీయాల్లో.. ఇక ‘ఫుట్బాల్’ ఆడుకుంటా..!
-
Sports News
Sanjay Manjrekar: ఐపీఎల్ 2023..బౌలింగ్లో ఆర్సీబీ ఉత్తమంగా రాణించగలదు: సంజయ్ మంజ్రేకర్