Updated : 24 Jan 2023 06:38 IST

నోటిఫికేషన్స్‌

ప్రభుత్వ ఉద్యోగాలు
ఎస్‌బీఐలో స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టులు

ముంబయిలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కార్పొరేట్‌ సెంటర్‌.. కాంట్రాక్ట్‌/ రెగ్యులర్‌ ప్రాతిపదికన 10 స్పెషలిస్ట్‌ క్యాడర్‌ ఆఫీసర్‌ ఖాళీల భర్తీకి  దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: ఎంబీఏ (మార్కెటింగ్‌), పీజీడీఎంతో పాటు పని అనుభవం.
ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటరాక్షన్‌, నెగోషియేన్‌ ఆధారంగా.
పని ప్రదేశం: ముంబయి/ నవీ ముంబయి.
దరఖాస్తు ఫీజు: జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.750; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు మినహాయింపు.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: 09.02.2023.
వెబ్‌సైట్‌: https://sbi.co.in/web/careers


ఆర్మీలో ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ

ఇండియన్‌ ఆర్మీ..షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్లుగా చేరేందుకు ఎన్‌సీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.  అవివాహిత పురుషులు, మహిళలు వీటికి అర్హులు.

1) ఎన్‌సీసీ మెన్‌: 50 (జనరల్‌ కేటగిరీ-45, యుద్ధ ప్రమాదాల్లో గాయపడ్డ ఆర్మీ సిబ్బందికి-05)
2) ఎన్‌సీసీ విమెన్‌: 05 (జనరల్‌ కేటగిరీ-04, యుద్ధ ప్రమాదాల్లో గాయపడ్డ ఆర్మీ సిబ్బందికి-01)

అర్హత: కనీసం 50% మార్కులతో ఏదైనా డిగ్రీ. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనితో పాటు ఎన్‌సీసీ ‘సీ’ సర్టిఫికెట్‌ ఉండాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి.

* యుద్ధప్రమాదాల్లో గాయపడ్డ ఆర్మీ సిబ్బందికి కనీసం 50% మార్కులతో డిగ్రీ. వీరికి ఎన్‌సీసీ సీ సర్టిఫికెట్‌ అవసరం లేదు.
వయసు:  01.07.2023 నాటికి 19-25 ఏళ్ల మధ్య ఉండాలి.
స్ట్టైపెండ్‌: నెలకు రూ.56100.
ఎంపిక: విద్యార్హతలు, ఇతర వివరాల ఆధారంగా అభ్యర్థులను మొదట షార్ట్‌లిస్టింగ్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన వారికి ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎంపికైనవారికి చివరగా మెడికల్‌ టెస్ట్‌ ఉంటుంది.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: 15.02.2023.
వెబ్‌సైట్‌: https://www.joinindianarmy.nic.in/Authentication.aspx


ఎన్‌ఐఆర్‌డీపీ-హైదరాబాద్‌లో..

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌కు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ పంచాయతీరాజ్‌ (ఎన్‌ఐఆర్‌డీపీ) 17 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: సీనియర్‌ కన్సల్టెంట్‌, కన్సల్టెంట్‌, ప్రాజెక్ట్‌ ట్రెయినింగ్‌ మేనేజర్‌, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి బ్యాచిలర్స్‌ డిగ్రీ/ డిప్లొమా/మాస్టర్స్‌  డిగ్రీ.
వయసు: 40-62 ఏళ్లు ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.300.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 30.01.2023
వెబ్‌సైట్‌: http://nirdpr.org.in/


135 మైనింగ్‌ సర్దార్‌, సర్వేయర్‌ పోస్టులు

నాగ్‌పుర్‌లోని వెస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌.. మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రల్లోని డబ్ల్యూసీఎల్‌కు చెందిన భూగర్భ, ఓపెన్‌కాస్ట్‌ గనుల్లో 135 మైనింగ్‌ సర్దార్‌, సర్వేయర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

1. మైనింగ్‌ సర్దార్‌ (టెక్నికల్‌ అండ్‌ సూపర్‌వైజరీ గ్రేడ్‌-సి): 107
2. సర్వేయర్‌- మైనింగ్‌(టెక్నికల్‌ అండ్‌ సూపర్‌వైజరీ గ్రేడ్‌-బి): 28

అర్హత: సంబంధిత విభాగంలో మెట్రిక్యులేషన్‌, డిప్లొమా.
వయసు: (19-01-2023 నాటికి): 18 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు రుసుము: రూ.1180 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు).
ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 10-02-2023.
వెబ్‌సైట్‌: http://www.westerncoal.in/index1.php


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు