ప్రభుత్వ ఉద్యోగాలు

దిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Published : 25 Jan 2023 00:20 IST

నిట్‌ దిల్లీలో ఫ్యాకల్టీ పోస్టులు

దిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

1. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(గ్రేడ్‌-2): 08 పోస్టులు

2. ప్రొఫెసర్‌: 04 పోస్టులు

విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌/ సివిల్‌ ఇంజినీరింగ్‌.

అర్హత: సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ ఉత్తీర్ణత.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 11-02-2023.

వెబ్‌సైట్‌: https://nitdelhi.ac.in/


బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో 225 స్పెషలిస్ట్‌ ఆఫీసర్లు

దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ ఖాళీల భర్తీకి బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌ 2, 3: 225 పోస్టులు

విభాగాలు: ఎకనామిస్ట్‌- 02, సెక్యూరిటీ ఆఫీసర్‌- 03, సివిల్‌ ఇంజినీర్‌- 10, లా ఆఫీసర్‌- 03, ఏపీఐ మేనేజ్‌మెంట్‌ అడ్మినిస్ట్రేటర్‌- 04, డిజిటల్‌ బ్యాంకింగ్‌, సీనియర్‌ మేనేజర్‌- 50, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌- 02, ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌- 15, రాజభాష ఆఫీసర్‌- 10, హెచ్‌ఆర్‌/ పర్సనల్‌ ఆఫీసర్‌- 05, డేటా ఎనలిటిక్స్‌- 03, ఏపీఐ మేనేజ్‌మెంట్‌ అడ్మినిస్ట్రేటర్‌- 11, డిజిటల్‌ బ్యాంకింగ్‌, మేనేజర్‌- 05, ఐటీ సెక్యూరిటీ ఆఫీసర్‌- 10, మొబైల్‌ యాప్‌ డెవలపర్‌- 10, డాట్‌ నెట్‌ డెవలపర్‌- 10, జావా డెవలపర్‌- 10, క్వాలిటీ అస్యూరెన్స్‌ ఇంజినీర్‌- 05, డేటా బేస్‌ అడ్మినిస్ట్రేటర్‌- 05, యూనిక్స్‌/ లైనెక్స్‌ అడ్మినిస్ట్రేటర్‌- 20, నెట్‌వర్క్‌ అండ్‌ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్‌- 06, విండోస్‌ అడ్మినిస్ట్రేటర్‌- 04, వీఎంవేర్‌/ వర్చువలైజేషన్‌ అడ్మినిస్ట్రేటర్‌- 01, మెయిల్‌ అడ్మినిస్ట్రేటర్‌- 02, ప్రొడక్షన్‌ సపోర్ట్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఫర్‌ ఈఎఫ్‌టీ స్విచ్‌- 04, ప్రొడక్షన్‌ సపోర్ట్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఫర్‌ యూపీఐ స్విచ్‌ - 08, విండోస్‌ డెస్క్‌టాప్‌ అడ్మినిస్ట్రేటర్‌- 02, సీనియర్‌ మేనేజర్‌- 04

అర్హత: సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం.

వయోపరిమితి: పోస్టును అనుసరించి కనిష్ఠంగా 25, గరిష్ఠంగా 35/38 సంవత్సరాలు మించకూడదు.

వేతనశ్రేణి: స్కేల్‌ 3 పోస్టులకు రూ. 63840 - రూ.78230. స్కేల్‌ 2 పోస్టులకు రూ.48170 - రూ.69810.

ఎంపిక: ఆన్‌లైన్‌ పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూలతో

దరఖాస్తు రుసుము: రూ.1180 (ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.118).

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 06-02-2023

వెబ్‌సైట్‌: https://bankofmaharashtra.in/


ఇండియన్‌ నేవీలో 70 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్లు

ఇండియన్‌ నేవీ.. స్పెషల్‌ నేవల్‌ ఓరియంటేషన్‌ కోర్సు..  ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అవివాహిత స్త్రీ, పురుషుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

ఇండియన్‌ నేవీ ఎస్‌ఎస్‌సీ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచి)-జూన్‌ 2023

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో 10, 12వ తరగతి ఉత్తీర్ణత. 10, 12వ తరగతిలో ఇంగ్లిష్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించాలి. బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ సాఫ్ట్‌వేర్‌ సిస్టమ్స్‌/ సైబర్‌ సెక్యూరిటీ/ సిస్టమ్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ నెట్‌వర్కింగ్‌/ కంప్యూటర్‌ సిస్టమ్స్‌ అండ్‌ నెట్‌వర్కింగ్‌/ డేటా ఎనలిటిక్స్‌/ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌)/ బీసీఏ/ బీఎస్సీ (కంప్యూటర్‌ సైన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ)/ ఎంసీఏ ఉత్తీర్ణత.

ఎంపిక: అకడమిక్‌ మెరిట్‌ ద్వారా షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలతో తీసుకుంటారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: 05.02.2023.

వెబ్‌సైట్‌: https://www.joinindiannavy.gov.in/


వ్యాప్‌కోస్‌-గురుగావ్‌లో 161 వివిధ ఖాళీలు

వ్యాప్‌కోస్‌ లిమిటెడ్‌, గురుగావ్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 161

విభాగాలు: టీమ్‌ లీడర్‌/ ఎక్స్‌పర్ట్‌: 2, క్వాంటిటీ సర్వేయర్‌: 2, స్ట్రక్చరల్‌ ఇంజినీర్‌: 4, ఎలక్ట్రికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌: 2, హైడ్రాలిక్‌ ఎక్స్‌పర్ట్‌: 2, రెసిడెంట్‌ ఇంజినీర్‌, సీనియర్‌ నీటి సరఫరా ఇంజినీర్‌: 7, సీనియర్‌ కన్‌స్ట్రక్షన్‌ ఇంజినీర్‌ -ఖిఖి: 10, మెటీరియల్‌ ఇంజినీర్‌: 7, నీటి సరఫరా, CADD ఇంజినీర్‌: 15, క్వాంటిటీ సర్వేయర్‌-ఖిఖి: 15, కన్‌స్ట్రక్షన్‌ ఇంజినీర్‌: 30, సర్వే ఇంజినీర్‌: 15,  ఎలక్ట్రికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌--ఖిఖి: 15, సైట్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌): 18, సైట్‌ ఇంజినీర్‌ (సివిల్‌): 2, అకౌంట్స్‌ అసిస్టెంట్‌: 5, ఆఫీస్‌ అసిస్టెంట్‌: 5, డేటా ఎంట్రీ ఆపరేటర్‌: 5

అర్హత: పోస్టును అనుసరించి గ్రాడ్యుయేషన్‌/ ఇంజినీరింగ్‌ డిగ్రీ/ డిప్లొమా/ పీజీ డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: 35 ఏళ్లు ఉండాలి.

వేతనశ్రేణి: రూ.18000-రూ.65000.

ఎంపిక: స్కిల్‌ టెస్ట్‌/ ఇంటర్వ్యూతో

దరఖాస్తు: ఈమెయిల్‌ hrwapcosbbsr@gmail.com కు ఫిబ్రవరి 2లోగా దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌సైట్‌: http://www.wapcos.gov.in/careers.aspx


వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ

ఎయిమ్స్‌ బీబీనగర్‌లో సీనియర్‌ రెసిడెంట్లు  

సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి ఎయిమ్స్‌, బీబీనగర్‌ దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు 13

విభాగాలు: జనరల్‌ మెడిసిన్‌, పల్మనరీ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, రేడియాలజీ, పీడియాట్రిక్స్‌, డెర్మటాలజీ, ఓబీజీవై, ఆప్తాల్మాలజీ.

అర్హత: పీజీ మెడికల్‌ డిగ్రీ, ఎండీ, ఎంఎస్‌, డీఎం, ఎంసీహెచ్‌, డీఎన్‌బీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 45 ఏళ్లకు మించకూడదు.

వేతనశ్రేణి: రూ.67,700.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 05-02-2023.

ఇంటర్వ్యూ తేదీలు: 08, 09-01-2023.

వేదిక: డీన్‌ ఆఫీస్‌ (అకడమిక్స్‌), ఎయిమ్స్‌ బీబీనగర్‌.

వెబ్‌సైట్‌: https://aiimsbibinagar.edu.in/seniorresident.html


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని