Updated : 26 Jan 2023 01:16 IST

ఎల్‌ఐసీలో ఏడీఓ కొలువులు

9394 పోస్టుల భర్తీకి ప్రకటన

జీవిత బీమా అనగానే ఎవరికైనా వెంటనే గుర్తుకొచ్చే పేరు.. ఎల్‌ఐసీనే. బీమా రంగంలో ఎన్నో కొత్త సంస్థలు వచ్చినా.. భారతీయ జీవిత బీమా సంస్థ ప్రత్యేకతే వేరు. ఈ సంస్థ తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న ఎల్‌ఐసీ కార్యాలయాల్లో  9394 అప్రెంటిస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ (ఏడీఓ) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. డిగ్రీ పాసైన అభ్యర్థులు, ముంబయిలోని ఇన్సూరెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఫెలోషిప్‌ ఉన్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ రంగం, ఫైనాన్స్‌ ప్రొడక్ట్స్‌ మార్కెటింగ్‌లో రెండేళ్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం. ఎల్‌ఐసీ ఉద్యోగులూ, ఏజెంట్లూ దరఖాస్తు చేసుకోవచ్చు. మార్కెటింగ్‌లో మెలకువలు, వాక్చాతుర్యం ఉన్న అభ్యర్థులకు మెరుగైన అవకాశాలు ఉంటాయి. పరీక్ష, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభతో నియామకాలు చేపడతారు.

ర్థిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఎల్‌ఐసీ సంస్థ ప్రధాన కార్యాలయం ముంబయిలో ఉంది. 66 ఏళ్లుగా బీమా రంగంలో తన అమూల్యమైన సేవలను అందిస్తూనే ఉంది. సుమారు 1.14 లక్షలమంది ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు. మొత్తం పోస్టుల్లో హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య జోనల్‌ కార్యాలయం పరిధిలో 1408 ఖాళీలున్నాయి.

డివిజన్ల వారీగా ఖాళీలు

కడప-90, హైదరాబాద్‌-91, కరీంనగర్‌-42, మచిలీపట్నం-112, నెల్లూరు-95, రాజమహేంద్రవరం-69, సికింద్రాబాద్‌-94, విశాఖపట్నం-57, వరంగల్‌-62, బెంగళూరు(1)- 115, బెంగళూరు(2)- 117, బెల్గాం-66, ధార్వాడ్‌-72, మైసూర్‌-108, రాయచూర్‌-83, షిమోగా-51, ఉడిపి-84.

విధులు, ప్రయోజనాలు

ఇది మార్కెటింగ్‌ ఉద్యోగం కాబట్టి ఎక్కువగా ప్రయాణాలు చేయాలి. ఎంపికైన అభ్యర్థులు.. జీవిత బీమా ఏజెంట్లను నియమించాలి. ఏజెంట్ల స్థిరమై బృందాన్ని ఏర్పర్చడానికి తగిన వ్యక్తులను అన్వేషించాలి. అలా నియమించిన వ్యక్తులు ఎల్‌ఐసీ బీమా వ్యాపారాన్ని వృద్ధి చేయడానికి.. ఏజెంట్ల బృందానికి అవసరమైన శిక్షణ, సలహాలు, సూచనలు ఇస్తారు. అలాగే పాలసీదార్లకు అమ్మకాల అనంతర సేవలను కూడా తప్పనిసరిగా అందజేయాలి.

అప్రెంటిస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసరుగా ఎంపికైన అభ్యర్థికి అప్రెంటిస్‌ కాలంలో స్టైపెండ్‌గా నెలకు సుమారు రూ.51,500 చెల్లిస్తారు. శిక్షణ కాలం ముగిసిన తర్వాత అమలులో ఉన్న నియమాల ప్రకారం ఇతర ప్రయోజనాలతోపాటు గ్రాట్యుటీ, డిఫైన్డ్‌ కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌, ఇతర సదుపాయాలు ఉంటాయి. ఉద్యోగం పర్మినెంట్‌ అయిన తర్వాత డెవలప్‌మెంట్‌ ఆఫీసరు అనుబంధ ప్రోత్సాహకాలకు కూడా అర్హులవుతారు.

ఎలా సన్నద్ధం కావాలి?

ఎల్‌ఐసీ ఏడీఓ పూర్వ ప్రశ్నపత్రాలను నిశితంగా పరిశీలించాలి. దాంతో ప్రశ్నల స్థాయిని అర్థం చేసుకోగలుగుతారు. దానికి అనుగుణంగా సన్నద్ధం కావాలి.

రీజనింగ్‌ ఎబిలిటీ: ఈ సెక్షన్‌లో ప్రశ్నలు అభ్యర్థుల తార్కిక ఆలోచనా విధానాన్ని పరీక్షించేలా ఉంటాయి. మేథమెటికల్‌ రీజనింగ్‌, లైనియర్‌ అండ్‌ సర్క్యులర్‌ సిటింగ్‌ ఎరేంజ్‌మెంట్స్‌, పజిల్స్‌, ఆల్ఫాబెట్‌ సిరీస్‌, కోడింగ్‌-డికోడింగ్‌, డిస్టెన్స్‌ అండ్‌ డైరెక్షన్‌, బ్లడ్‌ రిలేషన్స్‌, స్టేట్‌మెంట్స్‌ అండ్‌ కన్‌క్లూషన్స్‌, స్టేట్‌మెంట్స్‌ అండ్‌ ఆర్గ్యుమెంట్స్‌, నంబర్‌ సిరీస్‌, క్లాక్స్‌ అండ్‌ క్యాలెండర్స్‌, డేటా ఇంటర్‌ప్రెటేషన్‌, మిర్రర్‌ ఇమేజస్‌, డెసిషన్‌ మేకింగ్‌.. మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.

న్యూమరికల్‌ ఎబిలిటీ: సింప్లిఫికేషన్‌, నంబర్‌ సిరీస్‌, క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్‌, ఏవరేజ్‌, పర్సంటేజ్‌, టైమ్‌ అండ్‌ వర్క్‌, ఏరియా, ప్రాఫిక్‌ అండ్‌ లాస్‌, సింపుల్‌ అండ్‌ కాంపౌండ్‌ ఇంట్రెస్ట్‌, టైమ్‌ అండ్‌ స్పీడ్‌, ఇన్వెస్ట్‌మెంట్‌, హెచ్‌సీఎఫ్‌, ఎల్‌సీఎం, ప్లాబ్లమ్‌ ఆన్‌ ఏజెస్‌, బార్‌ గ్రాఫ్‌, పిక్టోరియల్‌ గ్రాఫ్‌, పైచార్ట్‌.. మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌: ఈ విభాగంలో వర్తమానాంశాలు, జనరల్‌ నాలెడ్జ్‌పై అభ్యర్థులకున్న పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. జాతీయ, అంతర్జాతీయ వర్తమానాంశాలు, బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌, జనరల్‌ సైన్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌, సైన్‌, టెక్నాలజీ, స్పోర్ట్స్‌, కల్చర్‌ అండ్‌ బ్యాంకింగ్‌ సెక్టర్‌, బడ్జెట్‌ అండ్‌ ఫైవ్‌ ఇయర్‌ ప్లాన్స్‌, ప్రిన్సిపల్స్‌ ఆఫ్‌ ఇన్సూరెన్స్‌, కరెంట్‌ ఈవెంట్స్‌ ఫ్రమ్‌ స్పోర్ట్స్‌, అవార్డ్స్‌ అండ్‌ ఆనర్స్‌, సైన్స్‌ ఇన్వెన్షన్స్‌ అండ్‌ డిస్కవరీస్‌, దేశాలు, రాజధానులు, కరెన్సీలు, భారతదేశ చరిత్ర, భారత ఆర్థిక వ్యవస్థ, భారత రాజ్యాంగం, భారతదేశ రాజకీయాల నుంచి ప్రశ్నలుంటాయి.

ఇంగ్లిష్‌: గ్రామర్‌, ఒకాబ్యులరీ, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. సిననిమ్స్‌, యాంçనిమ్స్‌, సెంటెన్స్‌ ఎర్రర్‌ అండ్‌ సెంటెన్స్‌ కరెక్షన్‌, ఫిల్‌ఇన్‌ ద బ్లాంక్స్‌, సెంటెన్స్‌ ఎరేంజ్‌మెంట్‌/వర్డ్‌ ఎరేంజ్‌మెంట్‌, కాంప్రహెన్షన్‌ అండ్‌ క్లోజ్‌ టెస్ట్‌, ఒకాబ్యులరీ క్వశ్చన్స్‌, పేరా కనెక్టర్స్‌, పేరా కంప్లీషన్‌, పేరా రీస్టేట్‌మెట్‌, పేరాగ్రాఫ్‌ ఇన్‌ఫిరెన్స్‌, పేరా ఫిల్లర్స్‌, ఇడియమ్స్‌ అండ్‌ ఫ్రేజెస్‌.. మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

ఇన్సూరెన్స్‌ మార్కెటింగ్‌: ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌, ఇన్సూరెన్స్‌ మార్కెట్‌ అవేర్‌నెస్‌ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రధానంగా.. ఇండియన్‌ ఫైనాన్షియల్‌ మార్కెట్‌, స్టాక్‌ మార్కెట్స్‌ అండ్‌ బాండ్‌ మార్కెట్స్‌, మనీ మార్కెట్స్‌ అండ్‌ దెయిర్‌ రోల్‌ ఇన్‌ ద ఫైనాన్షియల్‌ సిస్టమ్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌, ఇన్సూరెన్స్‌ ఇండస్ట్రీ, రెగ్యులేటరీ ఏజెన్సీస్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌, డెరివేటివ్స్‌ మార్కెట్స్‌ అండ్‌ ప్రైవేట్‌ ఇండస్ట్రీ, రెగ్యులేటరీ ఏజన్సీస్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌ ఇండస్ట్రీ, డెరివేటివ్స్‌ మార్కెట్స్‌ అండ్‌ ప్రైవేట్‌ ఇన్వెస్టింగ్‌, ప్రైమరీ మార్కెట్స్‌ అండ్‌ సెకండరీ మార్కెట్స్‌, ది స్టడీ ఆఫ్‌ ది ఫారిన్‌ ఎక్చేంజ్‌ ఇంటర్‌బ్యాంక్‌ మార్కెట్‌, ఎస్టాబ్లిష్‌మెంట్‌ ఆఫ్‌ ఎఫ్‌ఎస్‌డీసీ, ఫైనాన్షియల్‌ స్టెబిలిటీ అండ్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌, ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ ఆర్గనైజేషన్‌... ప్రశ్నలు ఇస్తారు.
ఇన్సూరెన్స్‌ మార్కెట్‌ అవేర్‌నెస్‌: ఇంట్రడక్షన్‌ అండ్‌ హిస్టరీ ఆఫ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, హిస్టరీ ఆఫ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌, టైప్స్‌ ఆఫ్‌ ఇన్సూరెన్స్‌, ఇండియన్‌ ఇన్సూరెన్స్‌ మార్కెట్‌, ఇన్సూరెన్స్‌ కరెంట్‌ అఫైర్స్‌, ఇన్సూరెన్స్‌ అంబుడ్స్‌మెన్‌, కరెంట్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్స్‌, యూఎల్‌ఐపీ (యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ పబ్లిక్‌), సెక్టార్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీస్‌, గ్లాసరీ ఆఫ్‌ ఇన్సూరెన్స్‌ టర్మ్స్‌, ప్రైవేట్‌ సెక్టార్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీస్‌, ఎంప్లాయ్‌మెంట్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ (ఈఎస్‌ఐఎస్‌), అబ్రివేషన్స్‌ రిటేటెడ్‌ టు ఇన్సూరెన్స్‌ ఇండస్ట్రీ, ఇన్సూరెన్స్‌ అవేర్‌నెస్‌ రిలేటెడ్‌ టాపిక్స్‌, స్కీమ్స్‌ రిలేటెడ్‌ టు ఇన్సూరెన్స్‌ (పీఎంఎఫ్‌బీవై, పీఎంజేజేబీవై, పీఎంఎస్‌బీవై మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.


ఎంపిక ఇలా..

అభ్యర్థులను మూడు కేటగిరీలుగా విభజించి ఏడీఓ పరీక్షను నిర్వహిస్తారు.

1.ఓపెన్‌ కేటగిరీ (అభ్యర్థులు అందరికీ) 2. ఎల్‌ఐసీ ఎంప్లాయీ (ఎల్‌ఐసీలో పనిచేసే ఫుల్‌టైమ్‌, శాలరీ ఉద్యోగులకు) 3. ఎల్‌ఐసీ ఏజెంట్‌ (ఎల్‌ఐసీ ఏజెంట్లుగా పనిచేసేవారికి).
రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్షను ప్రిలిమినరీ, మెయిన్స్‌ అనే రెండు దశల్లో నిర్వహిస్తారు. ప్రిలిమినరీలో సెక్షన్‌-1 రీజనింగ్‌లో 35 ప్రశ్నలకు  35 మార్కులు. సమయం 20 నిమిషాలు. సెక్షన్‌-2 న్యూమరికల్‌ ఎబిలిటీలో 35 ప్రశ్నలకు 35 మార్కులు, సమయం 20 నిమిషాలు. సెక్షన్‌-3లో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 30 ప్రశ్నలకు, 30 మార్కులు, సమయం 20 నిమిషాలు. మొత్తం 100 మార్కులు. సమయం గంట. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌లో సాధించిన మార్కులను ర్యాంకింగ్‌కు పరిగణించరు.
ప్రిలిమినరీ పరీక్షలో చూపిన ప్రతిభ ప్రకారం మెరిట్‌, రిజర్వేషన్లు అనుసరించి విభాగాల వారీ ఖాళీలకు 20 రెట్ల సంఖ్యలో అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు.
మెయిన్‌ పరీక్షలో 3 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్‌-1లో రీజనింగ్‌, న్యూమరికల్‌ ఎబిలిటీకి సంబంధించిన 50 ప్రశ్నలకు, 50 మార్కులు. సెక్షన్‌-2లో జనరల్‌ నాలెడ్జ్‌, కరెంట్‌ అఫైర్స్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ (గ్రామర్‌, ఒకాబ్యులరీ)లో 50 ప్రశ్నలకు, 50 మార్కులు. సెక్షన్‌-3లో ఇన్సూరెన్స్‌, ఫైనాన్షియల్‌ మార్కెటింగ్‌ అవేర్‌నెస్‌ (లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఫైనాన్షియల్‌ సెక్టార్‌)కు సంబంధించిన 60 ప్రశ్నలకు 60 మార్కులు. మొత్తం 160 ప్రశ్నలను 120 నిమిషాల్లో పూర్తిచేయాలి.
మెయిన్స్‌లో ప్రతిభ చూపినవారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. దీనికి 40 మార్కులు. తుది ఎంపికలో ప్రిలిమ్స్‌ మార్కులు పరిగణనలోకి తీసుకోరు. మెయిన్స్‌, ఇంటర్వ్యూ మార్కులతో నియామకాలుంటాయి.


దరఖాస్తు ఎలా?

దరఖాస్తు ఫీజు: రూ.750 ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.100.
అభ్యర్థుల వయసు: 01.01.2023 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నియమ, నిబంధనలకు లోబడి ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ / ఈడబ్ల్యూఎస్‌లకు రిజర్వేషన్లు ఉంటాయి.
దరఖాస్తుకు చివరి తేదీ: 10.02.2023
ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 12-03-2023.
మెయిన్‌ పరీక్ష తేదీ: 08-04-2023.
వెబ్‌సైట్‌: https://licindia.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు