నోటిఫికేషన్స్
ఉద్యోగాలు
అసిస్టెంట్ కమాండెంట్
ఇండియన్ కోస్ట్ గార్డు అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు అర్హులైన పురుష, మహిళ అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఖాళీలు: మొత్తం 71. జనరల్ డ్యూటీ (జీడీ): 40, కమర్షియల్ పైలెట్ లైసెన్స్ (ఎస్‌ఎస్‌ఏ): 10, టెక్నికల్ (మెకానికల్): 06, టెక్నికల్ (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్): 14, లా ఎంట్రీ: 01.
అర్హత: విభాగాన్ని అనుసరించి పన్నెండో తరగతి, డిగ్రీ, డిగ్రీ(ఇంజినీరింగ్/ లా), కమర్షియల్ పైలెట్ లైసెన్స్ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి.
వయసు: జీడీ, టెక్నికల్ పోస్టులకు 01.07.1998 నుంచి 30.06.2002 మధ్య; కమర్షియల్ పైలెట్ లైసెన్స్‌కు 01.07.1998 నుంచి 30.06.2004 మధ్య; లా ఎంట్రీకి 01.07.1994 నుంచి 30.06.2002 మధ్య అభ్యర్థులు జన్మించి ఉండాలి.
ఎంపిక: స్టేజ్-1, స్టేజ్-2, స్టేజ్-3, స్టేజ్-4, స్టేజ్-5 పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా
మూలవేతనం: రూ.56,100.
పరీక్ష రుసుము: రూ.250 (ఎస్సీ, ఎస్టీలు చెల్లించనవసరం లేదు).
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 09-02-2023.
వెబ్‌సైట్: https://joinindiancoastguard.cdac.in/
సీఐఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) కానిస్టేబుల్ (డ్రైవర్), కానిస్టేబుల్స్ (డ్రైవర్-కమ్-పంప్-ఆపరేటర్- ఫైర్ సర్వీస్) ఉద్యోగాల భర్తీకి అర్హులైన పురుషుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం ఖాళీలు: 451.
కానిస్టేబుల్(డ్రైవర్): 183 పోస్టులు (యూఆర్-76, ఎస్సీ-27, ఎస్టీ-13, ఓబీసీ-49, ఈడబ్ల్యూఎస్-18)
కానిస్టేబుల్/ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ (ఫైర్ సర్వీస్): 268 పోస్టులు (యూఆర్-111, ఎస్సీ-40, ఎస్టీ-19, ఓబీసీ-72, ఈడబ్ల్యూఎస్-26)
అర్హత: మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన ఉత్తీర్ణత. డ్రైవింగ్ లైసెన్స్ (హెవీ మోటార్ వెహికల్ లేదా ట్రాన్స్‌పోర్ట్ వెహికల్; లైట్ మోటార్ వెహికల్; మోటార్ సైకిల్ విత్ గేర్)తో పాటు మూడేళ్ల డ్రైవింగ్ అనుభవం ఉండాలి.
ఎంపిక: ఫిజికల్ స్టాండర్ట్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్‌లతో.
శారీరక ప్రమాణాలు: ఎత్తు 167 సెం.మీ., ఛాతీ కొలత 80-85 సెం.మీ. ఉండాలి.
వయసు: 21 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
వేతన శ్రేణి: లెవెల్-3 రూ.21,700 - రూ.69,100.
దరఖాస్తు రుసుము: రూ.100 (ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం అభ్యర్థులకు మినహాయింపు)
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22-02-2023.
వెబ్‌సైట్: https://cisfrectt.in/index.php
ఈపీఐఎల్‌లో పోస్టులు
ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ ఇండియా లిమిటెడ్ (ఈపీఐఎల్) పలు విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 30
పోస్టులు: మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మేనేజర్లు.
విభాగాలు: సివిల్ డిజైన్, ఆర్కిటెక్చర్, హెచ్‌ఆర్, ఐటీ, ఫైనాన్స్, మెకానికల్ తదితరాలు.
అసిస్టెంట్ మేనేజర్: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి కనీసం 55 శాతం మార్కులతో బీఈ/ బీటెక్/ ఎంఎంఈఐ ఉత్తీర్ణత. వయసు: 32 ఏళ్లు, రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
మేనేజర్: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి కనీసం 55 శాతం మార్కులతో బీఈ/ బీటెక్/ ఎంఎంఈఐ/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ ఎంబీఏ/ ఎంసీఏ ఉత్తీర్ణత. వయసు: 35 ఏళ్లు, నాలుగేళ్ల పని అనుభవం.
సీనియర్ మేనేజర్: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి కనీసం 55 శాతం మార్కులతో బీఈ/ బీటెక్/ ఎంఎంఈఐ/ బీఆర్క్/ పీజీ డిప్లొమా/ ఎంబీఏ/ ఏసీఎస్ ఉత్తీర్ణత. వయసు: 42 ఏళ్లు 9 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
ఎంపిక: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూలతో
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 13-02-2023
వెబ్‌సైట్: https://epi.gov.in/
ప్రవేశాలు
నిట్ దిల్లీలో పీహెచ్‌డీ ప్రోగ్రాం
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దిల్లీ 2022-2023 స్ప్రింగ్ సెమిస్టర్ పీహెచ్‌డీ ప్రోగ్రాంలో ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
పీహెచ్‌డీ (ఫుల్ టైం/ పార్ట్ టైం/ స్పాన్సర్డ్) ప్రోగ్రాం
విభాగాలు: సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అండ్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, అప్లైడ్ సైన్సెస్.
అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి.
ప్రవేశం: రాత పరీక్షలు, ఇంటర్వ్యూలతో
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31-01-2023.
వెబ్‌సైట్: https://nitdelhi.ac.in/
వాక్ ఇన్
ఎన్‌ఈఎస్‌ఏసీ-మేఘాలయలో ప్రాజెక్ట్ స్టాఫ్
మేఘాలయలోని నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (ఎన్‌ఈఎస్‌ఏసీ) ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు: ప్రాజెక్ట్ అసోసియేట్
మొత్తం ఖాళీలు: 27
అర్హత: బీఈ/ బీటెక్/ ఎమ్మెస్సీ (రిమోట్ సెన్సింగ్/ జియోఇన్ఫర్మేటిక్స్/ స్పేషియల్ ఇన్ఫర్మేషన్ సైన్స్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఉత్తీర్ణత.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
వేతనం: రూ.31000.
ఎంపిక: ఇంటర్వ్యూతో
దరఖాస్తు: సంబంధిత ధ్రువపత్రాలతో అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలి.
ఇంటర్వ్యూ వేదిక: NESAC, Umiam.
ఇంటర్వ్యూ తేది: 06-08.02.2023
వెబ్‌సైట్: https://nesac.gov.in/
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Russia: చిన్నారి ‘చిత్రం’పై రష్యా కన్నెర్ర.. తండ్రిని బంధించి..బాలికను దూరం చేసి!
-
World News
USA: వడదెబ్బతో విద్యార్థి మృతి.. కుటుంబానికి రూ.110 కోట్ల నష్ట పరిహారం
-
Politics News
Rahul Gandhi: ‘గుర్రాల రేసులో గాడిద..!’ కేంద్ర మంత్రి పురీ వ్యంగ్యాస్త్రాలు
-
Sports News
IPL 2023: శ్రేయస్‌కు గాయం... కోల్‌కతా నైట్ రైడర్స్ సారథిగా యువ ఆల్‌రౌండర్
-
India News
Anurag Thakur: రాహుల్ కలలో కూడా సావర్కర్ కాలేరు..: అనురాగ్ ఠాకూర్
-
World News
USA: అగ్రరాజ్యంలో మరోసారి పేలిన తుపాకీ.. ముగ్గురు విద్యార్థులు సహా ఆరుగురు మృతి