ఉద్యోగాలు

ముంబయి ప్రధాన కేంద్రంగా పనిచేస్తోన్న సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హ్యూమన్‌ రిసోర్సెస్‌ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌.. దేశవ్యాప్తంగా బ్యాంకు శాఖల్లో 250 చీఫ్‌ మేనేజర్లు, సీనియర్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి అనుభవజ్ఞులైన నిపుణుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Published : 31 Jan 2023 00:02 IST

సెంట్రల్‌ బ్యాంకులో 250 పోస్టులు

ముంబయి ప్రధాన కేంద్రంగా పనిచేస్తోన్న సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హ్యూమన్‌ రిసోర్సెస్‌ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌.. దేశవ్యాప్తంగా బ్యాంకు శాఖల్లో 250 చీఫ్‌ మేనేజర్లు, సీనియర్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి అనుభవజ్ఞులైన నిపుణుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

1. చీఫ్‌ మేనేజర్‌ స్కేల్‌-4 (మెయిన్‌ స్ట్రీమ్‌): 50  

2. సీనియర్‌ మేనేజర్‌ స్కేల్‌-3 (మెయిన్‌ స్ట్రీమ్‌): 200

అర్హత: ఏదైనా డిగ్రీతో పాటు పని అనుభవం.

వయసు: 31.12.2022 నాటికి చీఫ్‌ మేనేజర్‌ పోస్టులకు 40 ఏళ్లు, సీనియర్‌ మేనేజర్‌ పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: ఆన్‌లైన్‌ రాత పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.850 + జీఎస్టీ(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు).

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 11.02.2023.

ఆన్‌లైన్‌ పరీక్ష: మార్చి 2023  ఇంటర్వ్యూ: మార్చి 2023.

వెబ్‌సైట్‌: https://www.centralbankofindia.co.in/en/recruitments


ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌లో...

హైదరాబాద్‌లోని ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌.. వివిధ రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల్లో అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ ఖాళీల భర్తీకి డిపార్ట్‌మెంటల్‌/ ఎక్స్‌టర్నల్‌ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ (ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌) ట్రైనీ: 11

అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ (మెటీరియల్స్‌ అండ్‌ పర్చేజ్‌) ట్రైనీ: 16

అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ (పర్సనల్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌) ట్రైనీ: 15  

అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ, సీఏ (ఇంటర్‌)/ ఐసీడబ్ల్యూఏ- సీఎంఏ (ఇంటర్‌), బీఈ, బీటెక్‌, పీజీ డిప్లొమా.

వయసు: 32 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 17.02.2023.

వెబ్‌సైట్‌: https://www.nmdc.co.in/careers


ఎన్‌ఐవీఈడీఐ-బెంగళూరులో..

బెంగళూరుకు చెందిన ఐకార్‌ ఆధ్వర్యంలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వెటర్నరీ ఎపిడమాలజీ అండ్‌ డిసీజ్‌ ఇన్ఫర్మేషన్‌ (ఎన్‌ఐవీఈడీఐ) సీనియర్‌ రిసెర్చ్‌ఫెలో, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ తదితర 12 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్‌/ బ్యాచిలర్స్‌ డిగ్రీ/ ఇంజినీరింగ్‌ డిగ్రీ/ పీజీ/ ఎంటెక్‌/ మాస్టర్స్‌/ ఎంబీఏ/ ఎంఎస్సీ/ ఎంఏ.

వయసు: 18-45 ఏళ్లు ఉండాలి.

ఎంపిక: స్క్రీనింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

చిరునామా: ICAR n National Institute of Veterinary Epidemiology and Disease Informatics, Ramagondanahalli, Post Box No: 6450, Yelahanka, Bengaluru n 560064.

దరఖాస్తుకు చివరి తేదీ: 13.02.2023

వెబ్‌సైట్‌: https://nivedi.res.in/employment.php


జీఆర్‌ఎస్‌ఈ-కోల్‌కతాలో...

కోల్‌కతాలోని గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌ లిమిటెడ్‌ (జీఆర్‌ఎస్‌ఈ) 12 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: సూపర్‌వైజర్‌, ఇంజిన్‌ టెక్నీషియన్‌, డిజైన్‌ అసిస్టెంట్లు.

విభాగాలు: అడ్మిన్‌, హెచ్‌ఆర్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఫార్మసీ, ఫైనాన్స్‌, ఐటీ, మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి ఇంజినీరింగ్‌ డిప్లొమా/ ఫార్మసీ డిప్లొమా/ గ్రాడ్యుయేషన్‌/ పీజీ డిప్లొమా.

వయసు: 28 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌, రాతపరీక్ష ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.400

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 06.02.2023

వెబ్‌సైట్‌:https://grse.in/ 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని