Published : 01 Feb 2023 00:46 IST

నోటిఫికేషన్స్‌

ఉద్యోగాలు

హెచ్‌ఎంటీ-హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

హైదరాబాద్‌లోని హెచ్‌ఎంటీ లిమిటెడ్‌ 9 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: ప్రాజెక్ట్‌ డిప్యూటీ ఇంజినీర్‌, ప్రాజెక్ట్‌ ఆఫీసర్లు.
విభాగాలు: మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, హెచ్‌ఆర్‌, ఫైనాన్స్‌, లీగల్‌.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌/ ఎల్‌ఎల్‌బీ/ సీఏ/ సీఎంఏ/ ఐసీడబ్ల్యూఏ/ ఎంబీఏ/ ఎంహెచ్‌ఆర్‌ఎం/ పీజీడీఎం.
పని అనుభవం: కనీసం 2 ఏళ్లు. వయసు: 32 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.750.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో పంపాలి.
చిరునామా: GENERAL MANAGERsHz HMT Machine Tools Limited, HMT Township PO, Narsapur Road, Hyderabadn500 054, Telangana.
దరఖాస్తు చివరి తేది: 25.02.2023

వెబ్‌సైట్‌: http://www.hmtmachinetools.com/careers.htm


ఐసీఎంఆర్‌-ముంబయిలో..

ముంబయిలోని ఐసీఎంఆర్‌ ఆధ్వర్యంలో ఉన్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఇన్‌ రిప్రొడక్టివ్‌ అండ్‌ చైల్డ్‌ హెల్త్‌ (ఎన్‌ఐఆర్‌ఆర్‌సీహెచ్‌) 14 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: రిసెర్చ్‌ అసోసియేట్‌, జూనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌, మెడికల్‌ సోషల్‌ వర్కర్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి గ్రాడ్యుయేషన్‌/ ఎంబీబీఎస్‌/ పీహెచ్‌డీ/ఎండీ
వయసు: 30-35 ఏళ్లు.
స్టైపెండ్‌: నెలకు రూ.31000-రూ.60000.
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 06.02.2023

వెబ్‌సైట్‌: https://www.nirrh.res.in/opportunities/


సెంట్రల్‌ యూనివర్సిటీ-ఒడిశాలో..

ఒడిశాలోని సెంట్రల్‌ యూనివర్సిటీ 14 ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: ఇంగ్లిష్‌, ఒడియా, సోషియాలజీ, మ్యాథమెటిక్స్‌, స్టాటిస్టిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, హిందీ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ/ పీజీ డిగ్రీ/ పీహెచ్‌డీ.
పని అనుభవం: కనీసం 10 ఏళ్లు.
ఎంపిక విధానం: స్క్రీనింగ్‌, షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 23.02.2023.

వెబ్‌సైట్‌: https://cuo.ac.in/Notification_Recruitment.asp


ప్రవేశాలు

గిరిజన సంక్షేమ గురుకుల ప్రవేశ పరీక్ష

‘తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2023’ నోటిఫికేషన్‌ విడుదలయింది. ఎంపికైన విద్యార్థులకు ప్రతిభా కళాశాలల్లో ఇంటర్‌ ఉచిత విద్య, వసతితో పాటు ఐఐటీ, నీట్‌ తదితర పోటీ పరీక్షల శిక్షణ ఇస్తారు.

గ్రూపులు: ఎంపీసీ (575 సీట్లు), బైపీసీ (565 సీట్లు).
బోధనా మాధ్యమం: ఇంగ్లిష్‌.
రిజర్వేషన్‌: అన్ని సీట్లు ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు కేటాయించారు.
అర్హత: మార్చి-2023లో పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే పదో తరగతి ఉత్తీర్ణత సాధించాలి. విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2,00,000 (పట్టణ ప్రాంతం); రూ.1,50,000 (గ్రామీణ ప్రాంతం) మించకూడదు. ఇంగ్లిష్‌/ తెలుగు మాధ్యమం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సీటు కేటాయింపు స్క్రీనింగ్‌ టెస్ట్‌ మెరిట్‌, దరఖాస్తులో ఇచ్చిన ప్రాధాన్యం ఆధారంగా.
రిజిస్ట్రేషన్‌ ఫీజు: రూ.100.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 17-02-2023.
స్క్రీనింగ్‌ పరీక్ష తేదీ: 12-03-2023.

వెబ్‌సైట్‌: www.tgtwgurukulam.telangana.gov.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని