నోటిఫికేషన్స్‌

సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సిపెట్‌) 2023 విద్యా సంవత్సరానికి గాను డిప్లొమా, పోస్ట్‌ డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

Published : 27 Feb 2023 00:11 IST

ప్రవేశాలు

సిపెట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌-2023

సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సిపెట్‌) 2023 విద్యా సంవత్సరానికి గాను డిప్లొమా, పోస్ట్‌ డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

1. డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ అండ్‌ మౌల్డ్‌ టెక్నాలజీ (డీపీఎంటీ): 10వ తరగతి ఉత్తీర్ణత. కోర్సు వ్యవధి: 3 ఏళ్లు.
2. డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ టెక్నాలజీ (డీపీటీ): 10వ తరగతి ఉత్తీర్ణత. కోర్సు వ్యవధి: 3 ఏళ్లు.
3. పోస్ట్‌ డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ మౌల్డ్‌ డిజైన్‌ విత్‌ కాడ్‌/ కామ్‌: డిప్లొమా ఉత్తీర్ణత. కోర్సు వ్యవధి: 1.5 ఏళ్లు.
4. పీజీ డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ టెస్టింగ్‌: సైన్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. కోర్సు వ్యవధి: 2 ఏళ్లు.
ఎంపిక: కంప్యూటర్‌ పరీక్షలో మెరిట్‌ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫీజు: రూ.500.
దరఖాస్తుకు చివరి తేదీ: 28.05.2023.
సిపెట్‌ పరీక్ష తేదీ: 11.06.2023.

వెబ్‌సైట్‌: https://www.cipet.gov.in/


ప్రభుత్వ ఉద్యోగాలు

371 ఎయిర్‌క్రాఫ్ట్‌ టెక్నీషియన్‌ పోస్టులు

ముంబయిలోని ఏఐ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌.. ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ప్రాతిపదికన ఎయిర్‌క్రాఫ్ట్‌ టెక్నీషియన్స్‌, టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం ఖాళీల సంఖ్య: 371.
* ఎయిర్‌క్రాఫ్ట్‌ టెక్నీషియన్‌(ఎ అండ్‌ సి): 199
* ఎయిర్‌క్రాఫ్ట్‌ టెక్నీషియన్‌(ఏవియానిక్స్‌): 97  
* స్కిల్డ్‌ టెక్నీషియన్‌(ఫిట్టర్‌ అండ్‌ షీట్‌ మెటల్‌): 31  
* స్కిల్డ్‌ టెక్నీషియన్‌ (పెయింటర్‌): 12  
* స్కిల్డ్‌ టెక్నీషియన్‌ (టైలర్‌): 14  
* స్కిల్డ్‌ టెక్నీషియన్‌ (వెల్డర్‌): 01  
* స్కిల్డ్‌ టెక్నీషియన్‌ (డ్రాఫ్ట్స్‌మ్యాన్‌- మెకానికల్‌): 01
* స్కిల్డ్‌ టెక్నీషియన్‌ (ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రానిక్స్‌): 10  
* స్కిల్డ్‌ టెక్నీషియన్‌ (కార్పెంటర్‌): 02  
* ఎంఆర్‌ఏసీ (మెకానికల్‌ రిఫ్రిజిరేషన్‌ ఎయిర్‌ కండిషన్‌): 02
* ఎంఎంఓవీ(మెకానికల్‌ మోటార్‌ వెహికల్‌): 02  
అర్హత: పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ డిప్లొమాతో పాటు పని అనుభవం.
వయసు: 01.03.2023 నాటికి జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 35 ఏళ్లు, ఓబీసీలు 38 సంవత్సరాలు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు 40 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు రుసుము: రూ.1000 (ఎస్సీ/ ఎస్టీ/ ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు రూ.500).
ఎంపిక: స్కిల్‌ టెస్ట్‌, ట్రేడ్‌ టెస్ట్‌, టెక్నికల్‌ అసెస్‌మెంట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 20-03-2023.

వెబ్‌సైట్‌: https://www.aiesl.in/Careers.aspx


పుణె కంటోన్మెంట్‌ బోర్డులో ..

మహారాష్ట్ర పుణెలోని పుణె కంటోన్మెంట్‌ బోర్డు.. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 168 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పోస్టులు: కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌, వర్క్‌షాప్‌ సూపరింటెండెంట్‌, ఫైర్‌ బ్రిగేడ్‌ సూపరింటెండెంట్‌, అసిస్టెంట్‌ మార్కెట్‌ సూపరింటెండెంట్‌, డిస్‌ఇన్‌ఫెక్టర్‌, డ్రస్సర్‌, డ్రైవర్‌, జూనియర్‌ క్లర్క్‌, హెల్త్‌ సూపర్‌వైజర్‌, ల్యాబ్‌ అసిస్టెంట్‌ తదితరాలు.
అర్హత: 7వ తరగతి, 10వ తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎంబీబీఎస్‌.
దరఖాస్తు రుసుము: రూ.600 (ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.400).
దరఖాస్తు: ఆన్‌లైన్‌ దరఖాస్తుకు సంబంధించిన లింక్‌ ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌లో ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి అందుబాటులో ఉంటుంది.

వెబ్‌సైట్‌: https://pune.cantt.gov.in/recruitment/


ఐఐఎం-బోధ్‌గయలో..

బోధ్‌గయాలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం) 45 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: మార్కెటింగ్‌, ఎకనామిక్స్‌, ఆర్గనైజేషనల్‌ బిహేవియర్‌ అండ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సిస్టమ్‌ అండ్‌ ఎనలిటిక్స్‌ హ్యుమానిటీస్‌ అండ్‌  లిబరల్‌ ఆర్ట్స్‌, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంటింగ్‌ తదితరాలు.
1. ప్రొఫెసర్‌: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ/ పీహెచ్‌డీ.
అనుభవం: కనీసం 10 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
2. అసోసియేట్‌ ప్రొఫెసర్‌: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ/ పీహెచ్‌డీ.
అనుభవం: కనీసం 6 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
3. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ/ పీహెచ్‌డీ.
అనుభవం: 1-3 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 21.03.2023.

https://iimbg.ac.in/careers/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని