పర్యాటకంలో సేవలందిస్తారా?
కొవిడ్ తర్వాత కోలుకుని, విస్తరిస్తోన్న రంగాల్లో పర్యాటకం ఒకటి. పర్యాటక సంస్థల నిర్వహణ, అభివృద్ధిలో సమర్థ మేనేజర్ల సేవలే కీలకం. ఈ రంగంలో రాణించాలనుకునేవారికోసం కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్ (ఐఐటీటీఎం)లు నెలకొల్పారు.
కొవిడ్ తర్వాత కోలుకుని, విస్తరిస్తోన్న రంగాల్లో పర్యాటకం ఒకటి. పర్యాటక సంస్థల నిర్వహణ, అభివృద్ధిలో సమర్థ మేనేజర్ల సేవలే కీలకం. ఈ రంగంలో రాణించాలనుకునేవారికోసం కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్ (ఐఐటీటీఎం)లు నెలకొల్పారు. ఈ సంస్థల్లో బీబీఏ, ఎంబీఏ కోర్సులను నెల్లూరుతో సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంగణాల్లో అందిస్తున్నారు. వీటిలో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది!
పర్యాటక రంగంలో సేవల నిమిత్తం సుశిక్షితులైన మానవ వనరులను అందించడానికి మన దేశంలో జాతీయ ప్రాధాన్య సంస్థలుగా నెల్లూరు, గ్వాలియర్, భువనేశ్వర్, నోయిడాల్లో ఐఐటీటీఎంలను ఏర్పాటు చేశారు. వీటిలో బీబీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశం.. పరీక్ష, బృంద చర్చ, మౌఖిక పరీక్షలతో లభిస్తుంది. ఈ కోర్సులను ఇందిరా గాంధీ జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం, అమరాంతక్ పర్యవేక్షణలో బోధిస్తున్నారు. వివిధ వర్గాలకు చెందిన విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు అందుతున్నాయి.
ఇక్కడ కోర్సులు పూర్తిచేసుకున్నవారు ప్రభుత్వ, ప్రైవేటు పర్యాటక సంస్థలు; రిసార్టులు, క్యాటరింగ్ సంస్థలు, విమానయాన సంస్థలు, హోటళ్లు, ఆతిథ్యంతో ముడిపడే ఇతర విభాగాల్లో అవకాశాలు పొందుతున్నారు. ఇక్కడి విద్యార్థులను క్యాంపస్ నియామకాల ద్వారా మేక్ మై ట్రిప్, యాత్రా, ఐఆర్‌సీటీసీ, మారియట్, షెరటాన్, బామర్ లారీ, హాలిడే ఇన్, జెట్ ఎయిర్‌వేస్, హ్యాపీటూర్...తదితర సంస్థలు ఎంపిక చేసుకుంటున్నాయి. ఈ సంస్థల్లో మూడేళ్లకు కలిపి బీబీఏ ఫీజు సుమారు రూ.2.80 లక్షలు. ఎంబీఏ రెండేళ్లకు రూ.3.40 లక్షలు అవుతుంది. ఫీజుల నిమిత్తం బ్యాంకుల ద్వారా రుణసౌకర్యం పొందవచ్చు.
ఎంబీఏ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్
సీట్లు: మొత్తం 750. వీటిలో గ్వాలియర్‌లో 334, భువనేశ్వర్‌లో 112, నోయిడా 189, నెల్లూరు 75, గోవాలో 40 చొప్పున ఉన్నాయి.
అర్హత: ఏదైనా డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీలైతే 45 శాతం సరిపోతుంది. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం డిగ్రీ కోర్సుల్లో ఉన్నవాళ్లూ దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: జులై 1, 2023 నాటికి 27 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్ల మినహాయింపు వర్తిస్తుంది.
ఎంపిక: ప్రవేశ పరీక్ష, బృందచర్చ, మౌఖిక పరీక్షలో చూపిన ప్రతిభతో కోర్సులోకి తీసుకుంటారు. పరీక్షకు 70 శాతం, గ్రూప్ డిస్కషన్‌కు 15, ఇంటర్వ్యూకు 15 శాతం వెయిటేజీ ఉంటుంది. మ్యాట్, క్యాట్, సీమ్యాట్, జాట్, జీమ్యాట్, ఆత్మా వీటిలో ఏదో ఒక పరీక్షలో స్కోరు సాధించినవారికి ప్రవేశ పరీక్ష నుంచి మినహాయింపు లభిస్తుంది. ఇవేవీ లేనివారు ఐఐటీటీఎం నిర్వహించే ప్రవేశ పరీక్షకు హాజరవ్వాలి.
బీబీఏ టూరిజం అండ్ ట్రావెల్
సీట్లు: అన్ని క్యాంపస్‌ల్లోనూ కలిపి మొత్తం 375 ఉన్నాయి. వీటిలో గ్వాలియర్ 112, భువనేశ్వర్ 75, నోయిడా 113, నెల్లూరుకు 75 కేటాయించారు.
అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీలైతే 45 శాతం. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం కోర్సుల్లో ఉన్నవాళ్లూ దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: జులై 1, 2023 నాటికి 22 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్ల మినహాయింపు వర్తిస్తుంది.
ఎంపిక: ప్రవేశ పరీక్ష, బృందచర్చ, మౌఖిక పరీక్షలతో సీట్లు కేటాయిస్తారు. ప్రవేశ పరీక్షకు 70 శాతం, గ్రూప్ డిస్కషన్‌కు 15, ఇంటర్వ్యూకు 15 శాతం వెయిటేజీ ఉంటుంది.
పరీక్ష ఇలా
బీబీఏ, ఎంబీఏ రెండు కోర్సులకూ ప్రవేశ పరీక్ష స్వరూపం ఒకటే. అయితే ప్రశ్నల స్థాయిలో వ్యత్యాసం ఉంటుంది. పరీక్షను వంద మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వంద ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. ఇందులో జనరల్ అవేర్‌నెస్ 50, వెర్బల్ ఎబిలిటీ 25, క్వాంటిటేటివ్ ఎబిలిటీ 25 ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలో వస్తాయి. రుణాత్మక మార్కులు లేవు.
దరఖాస్తులు: మే 31 వరకు స్వీకరిస్తారు.
ఫీజు: ఎస్సీ, ఎస్టీలకు రూ.500. మిగిలిన అందరికీ రూ.1000.
పరీక్ష తేదీ: జూన్ 4, పరీక్ష కేంద్రాలు: నెల్లూరు, భువనేశ్వర్, గ్వాలియర్, నోయిడా.
వెబ్‌సైట్: https://www.iittm.ac.in/index.html
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Revanth Reddy: కష్టపడి పని చేయాలి.. సర్వే ప్రాతిపదికనే టికెట్లు: రేవంత్ రెడ్డి
-
Crime News
Gold seized: నెల్లూరు, హైదరాబాద్‌లో 10.27 కిలోల బంగారం పట్టివేత
-
Politics News
Ajit Pawar: అజిత్ మళ్లీ పక్కకే.. ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సుప్రియా సూలే
-
General News
Hyderabad: గీత కార్మికులకు రూ.12.50లక్షల ఎక్స్‌గ్రేషియా విడుదల: మంత్రి శ్రీనివాస్ గౌడ్
-
General News
Fire Accident: ఖమ్మం పత్తి మార్కెట్లో అగ్నిప్రమాదం
-
Sports News
WTC Final: క్లిష్టసమయంలో కీలక ఇన్నింగ్స్.. రహానె ప్రత్యేకత అదే: సునీల్ గావస్కర్