నోటిఫికేషన్స్‌

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సెంట్రల్‌ పల్ప్‌ అండ్‌ పేపర్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీపీపీఆర్‌ఐ) 34 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 07 Mar 2023 03:59 IST

ఉద్యోగాలు

సీపీపీఆర్‌ఐ-యూపీలో..

త్తర్‌ప్రదేశ్‌లోని సెంట్రల్‌ పల్ప్‌ అండ్‌ పేపర్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీపీపీఆర్‌ఐ) 34 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: కన్సల్టెంట్‌, ప్రాజెక్ట్‌ అసోసియేట్లు, ప్రాజెక్ట్‌ స్టాఫ్‌, నాన్‌ సైంటిఫిక్‌ స్టాఫ్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి బీఎస్సీ/ గ్రాడ్యుయేషన్‌/ ఎంఎస్సీ/ ఎంటెక్‌/ పీజీ డిగ్రీ/ ఎంబీఏ/ పీహెచ్‌డీ.
వయసు: 35-50 ఏళ్లు.
ఎంపిక: స్క్రీనింగ్‌, టెస్ట్‌/ ఇంటర్వ్యూ/ రాతపరీక్ష ఆధారంగా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో పంపాలి.
చిరునామా: డైరెక్టర్‌, సీపీపీఆర్‌ఐ, హిమ్మత్‌నగర్‌, పేపర్‌మిల్‌ రోడ్‌, సహరన్‌పూర్‌-247001 యూపీ.
దరఖాస్తుకు చివరి తేదీ: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌లో ఉద్యోగ ప్రకటన వెలువడిన 21 రోజుల్లోపు.
వెబ్‌సైట్‌: https://www.cppri.res.in/careers


యూసీఐఎల్‌-ఝార్ఖండ్‌లో..

ఝార్ఖండ్‌లోని యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (యూసీఐఎల్‌) 17 ఫోర్‌మెన్‌ (మైనింగ్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: డీజీఎంఎస్‌ ద్వారా పొందిన ఫోర్‌మెన్‌ సర్టిఫికెట్‌/ సెకండ్‌ క్లాస్‌/ ఫస్ట్‌క్లాస్‌ మేనేజర్‌ సర్టిఫికెట్‌.
అనుభవం: కనీసం ఏడాది పని అనుభవం ఉండాలి.
వయసు: 50 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో పంపాలి.
చిరునామా: Gen.Manager sInst./Pers.&I~./CPz Uranium Corporation of India Limited, sA Government of India Enterprisez P.O. Jaduguda Mines, Distt.n Singhbhum East, JHARKHANDn832102.
దరఖాస్తుకు చివరి తేదీ: 10.04.2023.
వెబ్‌సైట్‌: http://www.ucil.gov.in/job.html


అంబేడ్కర్‌ యూనివర్సిటీలో టీచింగ్‌ పోస్టులు

డాక్టర్‌ బి. ఆర్‌. అంబేడ్కర్‌ యూనివర్సిటీ దిల్లీ.. కింది విభాగాల్లో రెగ్యులర్‌ ప్రాతిపదికన 20 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

* ప్రొఫెసర్‌: 7  * అసోసియేట్‌ ప్రొఫెసర్‌: 8  * అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌: 5  
విభాగాలు: అర్బన్‌ స్టడీస్‌, గ్లోబల్‌ స్టడీస్‌, హిస్టరీ, ఇంగ్లిష్‌, సోషియాలజీ, ఎకనామిక్స్‌, సైకాలజీ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీతో పాటు నెట్‌/ స్లెట్‌/ సెట్‌.
ఎంపిక: ప్రెజెంటేషన్‌, సెమినార్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 22.03.2023.
హార్డ్‌ కాపీ సమర్పణకు చివరి తేదీ: 29.03.2023.
వెబ్‌సైట్‌: https://aud.ac.in/


ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో..

గోల్కొండలోని ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ (ఏపీఎస్‌) 12 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: అడ్మిన్‌ సూపర్‌వైజర్‌, ఎల్‌డీసీ, కంప్యూటర్‌ ల్యాబ్‌ అసిస్టెంట్‌, సైన్స్‌ ల్యాబ్‌ అసిస్టెంట్‌, డ్రైవర్‌, గార్డెనర్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్‌/ 10+2/ గ్రాడ్యుయేషన్‌.
దరఖాస్తు ఫీజు: రూ.100.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో పంపాలి.
చిరునామా: ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌, గోల్కొండ, ఇబ్రహీంబాగ్‌ పోస్ట్‌ ఆఫీస్‌, సన్‌ సిటీ దగ్గర, హైదరాబాద్‌-500031.
దరఖాస్తుకు చివరి తేదీ: 20.03.2023.
వెబ్‌సైట్‌: https://www.apsgolconda.edu.in/index.html


ప్రవేశాలు

నిమ్‌సెట్‌-2023

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఎంసీఏ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నిమ్‌సెట్‌)-2023 ప్రకటన వెలువడింది. ఈ ఏడాది నిమ్‌సెట్‌ను నిట్‌, జంషెడ్‌పూర్‌ నిర్వహిస్తోంది.

తొమ్మిది నిట్‌ల్లో ప్రవేశం: నిమ్‌సెట్‌తో 9 నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌)ల్లో ప్రవేశం లభిస్తుంది. వీటిలో వరంగల్‌ ఒకటి. నిట్‌ల్లో ఎంసీఏ కోర్సు వ్యవధి మూడేళ్లు. అయితే నిట్‌, వరంగల్‌ రెండేళ్లు కోర్సు అనంతరం వైదొలిగే అవకాశాన్నీ కల్పిస్తోంది. రెండేళ్ల చదువు విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి పోస్టు గ్రాడ్యుయేట్‌ అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా ఇన్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ డిగ్రీని ప్రదానం చేస్తుంది.

సీట్ల వివరాలు: అగర్తలా- 30, అలహాబాద్‌ - 116, భోపాల్‌ - 115, జంషెడ్‌పూర్‌ - 115, కురుక్షేత్ర - 96 (వీటిలో 32 సెల్ఫ్‌ ఫైనాన్స్‌), రాయ్‌పూర్‌ - 110, సూరత్కల్‌ - 58, తిరుచురాపల్లి - 115, వరంగల్‌ - 58.

మొత్తం సీట్ల సంఖ్య: 813.

అర్హత: మ్యాథ్స్‌ లేదా స్టాటిస్టిక్స్‌ ఒక సబ్జెక్టుగా బీఎస్సీ, బీసీఏ, బీఐటీ, బీ వొక్‌(కంప్యూటర్‌ సైన్స్‌/ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌)ల్లో ఏదైనా కోర్సు చదివుండాలి లేదా ఏ బ్రాంచీలోనైనా బీటెక్‌/ బీఈ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏ కోర్సు చదివినప్పటికీ కనీసం 60 శాతం మార్కులు (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 55 శాతం) తప్పనిసరి. చివరి సంవత్సరం కోర్సుల్లో ఉన్నవారూ అర్హులే.

సీట్ల కేటాయింపు: మెరిట్‌, రిజర్వేషన్ల ప్రాతిపదికన ఉమ్మడి కౌన్సెలింగ్‌ ద్వారా సీట్లను కేటాయిస్తారు.

తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, వరంగల్‌.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.1250. మిగిలిన అందరికీ రూ.2500
ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ: ఏప్రిల్‌ 10 వరకు.
పరీక్ష తేదీ: జూన్‌ 11.
ఫలితాల ప్రకటన: జూన్‌ 16.
వెబ్‌సైట్‌: http://www.nimcet.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని