నోటిఫికేషన్స్

ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీ ఈసెట్‌)-2023 నోటిఫికేషన్‌ విడుదలయింది.

Published : 09 Mar 2023 00:55 IST

ప్రవేశాలు

ఏపీ ఈసెట్‌-2023

ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీ ఈసెట్‌)-2023 నోటిఫికేషన్‌ విడుదలయింది. దీని ద్వారా బీఈ/ బీటెక్‌/ బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ విధానంలో రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు.  అర్హత: పాలిటెక్నిక్‌ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథమెటిక్స్‌).
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 10-03-2023.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 10-04-2023.
పరీక్ష తేదీ: 05-05-2023.
వెబ్‌సైట్‌:https://cets.apsche.ap.gov.in/ecet/


బీసీ గురుకులాల్లో అయిదో తరగతి ప్రవేశాలు

విజయవాడలోని మహాత్మా జ్యోతిబా ఫులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహించే 103 బీసీ బాలబాలికల పాఠశాలల్లో 2023-24 విద్యాసంవత్సరానికిగాను అయిదో తరగతి (ఇంగ్లిషు మీడియం, స్టేట్‌ సిలబస్‌) ప్రవేశాలకు ప్రవేశ ప్రకటన వెలువడింది. అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.
మహాత్మా జ్యోతిబా ఫులే ఏపీ బీసీడబ్ల్యూ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2023
విద్యార్హత: విద్యార్ధులు సంబంధిత జిల్లాల్లోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో నాలుగో తరగతి 2022-23 విద్యా సంవత్సరంలో చదివి ఉండాలి. జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి సంబంధిత జిల్లాలోని పాఠశాలల్లో చదువుతూ ఉండాలి.
వయసు: ఓసీ, బీసీ, ఈబీసీ విద్యార్థులు 9 నుంచి 11 ఏళ్ల మధ్య; ఎస్సీ/ ఎస్టీ విద్యార్థులు 9 నుంచి 13 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆదాయ పరిమితి: విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షకు మించకూడదు.
ప్రవేశ పరీక్ష: ప్రవేశ పరీక్ష ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఓఎంఆర్‌ షీట్‌ విధానంలో 50 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం తెలుగు/ ఆంగ్ల మాధ్యమాల్లో ఉంటుంది.  
పరీక్షా కేంద్రం: విద్యార్థుల సంబంధిత జిల్లాలో పరీక్ష నిర్వహిస్తారు.
సీటు కేటాయింపు: ప్రవేశ పరీక్షలో చూపిన ప్రతిభ, రిజర్వేషన్‌, ప్రత్యేక కేటగిరీ (అనాథ/ మత్స్యకార) ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.100.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 04-04-2023.
ప్రవేశ పరీక్ష తేదీ: 16-04-2023.
వెబ్‌సైట్‌:https://mjpapbcwreis.apcfss.in/


ఐసర్‌ తిరుపతిలో పీహెచ్‌డీ ప్రోగ్రాం

తిరుపతిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఐసర్‌) పీహెచ్‌డీలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, మ్యాథమెటిక్స్‌, ఎర్త్‌ అండ్‌  క్లైమేట్‌ సైన్సెస్‌. అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీతో పాటు వ్యాలిడ్‌ జేబీఈఈబీఐఎల్‌ఎస్‌ 2022, జేఆర్‌ఎఫ్‌, నెట్‌, గేట్‌,
జెస్ట్‌ స్కోరు.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్‌ 3, 2023.
ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థుల వివరాల వెల్లడి: ఏప్రిల్‌ 20-25, 2023.
ఇంటర్వ్యూ తేదీలు: మే 25-30, 2023.
ఇంటర్వ్యూ ఫలితాల ప్రకటన: జూన్‌ 10-15, 2023.
పీహెచ్‌డీలో చేరే తేదీ: ఆగస్టు 1, 2023.
వెబ్‌సైట్‌: http://www.iisertirupati.ac.in/admissions/phd/


అప్రెంటిస్‌షిప్‌

ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్‌లో ఐటీఐ అప్రెంటిస్‌ ఖాళీలు

అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రం రోయింగ్‌లోని ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్‌ 2023-24 సెషన్‌కు దిబాంగ్‌ మల్టీపర్పస్‌ ప్రాజెక్ట్‌లో ఏడాది అప్రెంటిస్‌ శిక్షణలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
అప్రెంటిస్‌ ఖాళీలు: 11
ట్రేడులు: ఎలక్ట్రీషియన్‌, మెకానిక్‌, ఫిట్టర్‌, సర్వేయర్‌, ప్లంబర్‌, వెల్డర్‌, సీవోపీఏ. అర్హత: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ.
వయసు: 01.04.2023 నాటికి 18- 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
స్టైపెండ్‌: నెలకు రూ.7,700.
ఎంపిక: విద్యార్హతలు, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా.
ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 20.03.2023.
వెబ్‌సైట్‌: http://www.nhpcindia.com/


ఉద్యోగాలు
ఐసీఎస్‌ఐఎల్‌-న్యూదిల్లీలో 583 పోస్టులు

న్యూదిల్లీలోని ఇంటెలిజెంట్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌ ఇండియా లిమిటెడ్‌ (ఐసీఎస్‌ఐఎల్‌) 583 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* మీటర్‌ రీడర్స్‌: 486* ఫీల్డ్‌ సూపర్‌వైజర్లు: 97
అర్హత: 1. మీటర్‌ రీడర్స్‌: 12వ తరగతి ఉత్తీర్ణత.
వయసు: 18-30 ఏళ్లు ఉండాలి. నెలకు రూ.20357 చెల్లిస్తారు.
2. ఫీల్డ్‌ సూపర్‌వైజర్లు: గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.
వయసు: 21-35 ఏళ్లు ఉండాలి. నెలకు రూ.22146 చెల్లిస్తారు.
ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.1000.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 10.03.2023.
వెబ్‌సైట్‌: https://icsil.in/requirementncareers


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు