నోటిఫికేషన్స్‌

పీజీ బయోటెక్నాలజీ విభాగాల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ - బయోటెక్నాలజీ (జీఏటీ-బీ), జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ల కోసం నిర్వహించే బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (బీఈటీ)- 2023 ప్రకటన వెలువడింది.

Updated : 13 Mar 2023 06:01 IST

ప్రవేశాలు

జీఏటీ-బీ, బీఈటీ- 2023

పీజీ బయోటెక్నాలజీ విభాగాల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ - బయోటెక్నాలజీ (జీఏటీ-బీ), జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ల కోసం నిర్వహించే బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (బీఈటీ)- 2023 ప్రకటన వెలువడింది.

కోర్సులు: ఎంఎస్సీ (బయోటెక్నాలజీ, అగ్రి బయోటెక్నాలజీ, సంబంధిత విభాగాలు), ఎంటెక్‌ (బయోటెక్నాలజీ, సంబంధిత విభాగాలు), ఎంవీఎస్సీ (యానిమల్‌ బయోటెక్నాలజీ).
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఎస్సీ/ ఎంబీబీఎస్‌/ బీడీఎస్‌/ బీవీఎస్సీ/ బీఎఫ్‌ఎస్సీ/ బీఏఎంఎస్‌/ బీహెచ్‌ఎంఎస్‌/ బీపీటీ/ బీటెక్‌.
బీఈటీ కోర్సులు: ఈ పరీక్షలో ప్రతిభ ఆధారంగా పీహెచ్‌డీ ప్రోగ్రాంలో ప్రవేశాలు పొందవచ్చు.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌/ ఎంబీబీఎస్‌/ ఎంటెక్‌/ ఎంఎస్సీ/ ఎంవీఎస్సీ/ ఎంఫార్మసీ/ ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ.
వయసు: జనరల్‌ అభ్యర్థులకు 28 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 33 ఏళ్లు.. దివ్యాంగులు, మహిళలు 31 ఏళ్లు మించకూడదు.
ఆన్‌లైన్‌ దరఖాస్తు, రుసుము చెల్లింపు గడువు: 31-03-2023.
పరీక్ష తేదీ: 23-04-2023.

వెబ్‌సైట్‌: https://dbt.nta.ac.in/


ఏపీ ఈఏపీసెట్‌-2023

ఏపీ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2023 (ఏపీ ఈఏపీసెట్‌) నోటిఫికేషన్‌ విడుదలయింది. 

అర్హత: కనీసం 45% మార్కుల(రిజర్వ్‌డ్‌ అభ్యర్థులకు 40%)తో ఇంటర్‌ (ఎంపీసీ/ బైపీసీ) లేదా ఇంటర్‌ ఒకేషనల్‌ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్‌ చివరి సంవత్సరం అభ్యర్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా డిప్లొమా (ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: ఇంజినీరింగ్‌, ఫార్మసీ అభ్యర్థులు 31.12.2023 నాటికి 16 ఏళ్లు నిండి ఉండాలి. ఫార్మ్‌-డి కోర్సుకు 31.12.2023 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి.
దరఖాస్తుల సమర్పణ: ఏప్రిల్‌ 15 వరకు  
ప్రవేశ పరీక్షలు: మే 15-18 తేదీల్లో ఇంజినీరింగ్‌; మే 22-23 తేదీల్లో అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ

వెబ్‌సైట్‌: https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_HomePage.aspx


ఎన్‌పీటీఐ, ఫరీదాబాద్‌లో ఎంబీఏ

హరియాణా రాష్ట్రం ఫరీదాబాద్‌లోని నేషనల్‌ పవర్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌పీటీఐ) ఎంబీఏ ప్రోగ్రాంలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

స్పెషలైజేషన్‌: పవర్‌ మేనేజ్‌మెంట్‌, సస్ట్టైనబిలిటీ, డేటా సైన్స్‌ అండ్‌ డేటా ఎనలిటిక్స్‌, సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ క్లౌడ్‌.
మొత్తం సీట్లు: 120.
అర్హత: బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ (ఇంజినీరింగ్‌). వ్యాలిడ్‌ క్యాట్‌/ మ్యాట్‌/ గ్జాట్‌/ సీమ్యాట్‌ స్కోరు.
రిజిస్ట్రేషన్‌ ఫీజు: రూ.500.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 07-04-2023.
గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్‌ 24, 25.

వెబ్‌సైట్‌: https://npti.gov.in/mba-power-mgmt-admisison-2023-2025


స్పా విజయవాడలో పీజీ ప్రోగ్రాం

విజయవాడలోని స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ 2023-24 విద్యా సంవత్సరానికి పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రాంలో ఆర్కిటెక్చర్‌ అండ్‌ ప్లానింగ్‌ స్పెషలైజేషన్లలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

ఆర్కిటెక్చర్‌ విభాగాలు:

1. మాస్టర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ (సస్ట్టైనబుల్‌ ఆర్కిటెక్చర్‌)
2. మాస్టర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ (ల్యాండ్‌స్కేప్‌ ఆర్కిటెక్చర్‌)
3. మాస్టర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ (ఆర్కిటెక్చరల్‌ కన్జర్వేషన్‌)
4. మాస్టర్‌ ఆఫ్‌ బిల్డింగ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌
5. మాస్టర్‌ ఆఫ్‌ అర్బన్‌ డిజైన్‌

ప్లానింగ్‌ విభాగం:

1. మాస్టర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ (ఎన్విరాన్‌మెంటల్‌ ప్లానింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌)
2. మాస్టర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ (అర్బన్‌ అండ్‌ రీజినల్‌ ప్లానింగ్‌)
3. మాస్టర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ (ట్రాన్స్‌పోర్ట్‌ ప్లానింగ్‌)
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, బీఆర్క్‌.
ప్రవేశం: ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ, స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌, పోర్ట్‌ఫోలియో అసెస్‌మెంట్‌ ఆధారంగా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘ది రిజిస్ట్రార్‌, స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ అర్కిటెక్చర్‌, ఐటీఐ రోడ్డు, విజయవాడ’ చిరునామాకు పంపాలి.
దరఖాస్తు హార్డ్‌ కాపీ స్వీకరణకు చివరి తేదీ: 10-04-2023.
ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ తేదీలు: 27, 28-04-2023.
ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 08-05-2023.

వెబ్‌సైట్‌: https://www.spav.ac.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని