Updated : 15 Mar 2023 05:01 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

ఏఏఐ కార్గో లాజిస్టిక్స్‌లో...

న్యూదిల్లీలోని ఏఏఐ కార్గో లాజిస్టిక్స్‌ అండ్‌ అలైడ్‌ సర్వీసెస్‌ కంపెనీ లిమిటెడ్‌.. మూడేళ్ల కాలవ్యవధికి ఫిక్స్‌డ్‌ టర్మ్‌ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన 400 సెక్యూరిటీ స్క్రీనర్‌ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

అర్హత: కనీసం 60% మార్కుల(ఎస్సీ/ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 55%)తో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్‌ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.

వయసు:  19.03.2023 నాటికి 27 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు రుసుము: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు).  

ఎంపిక: రాత పరీక్ష, ఇంటరాక్షన్‌, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 19-03-2023.

వెబ్‌సైట్‌:  https://aaiclas.aero/career


న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌...

డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీకి చెందిన హైదరాబాద్‌లోని న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌.. 124 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

చీఫ్‌ ఫైర్‌ ఆఫీసర్‌/ ఎ: 01  బీ టెక్నికల్‌ ఆఫీసర్‌/ సి (కంప్యూటర్స్‌): 03 బీ డిప్యూటీ చీఫ్‌ ఫైర్‌ ఆఫీసర్‌/ ఎ: 02

స్టేషన్‌ ఆఫీసర్‌/ ఎ: 07 బీ సబ్‌-ఆఫీసర్‌/ బి: 28  

డ్రైవర్‌-కమ్‌-పంప్‌ ఆపరేటర్‌-కమ్‌ ఫైర్‌మ్యాన్‌/ ఎ: 83

అర్హత: పోస్టును అనుసరించి 10+2, సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌.

ఎంపిక: ఖాళీని అనుసరించి ప్రిలిమినరీ టెస్ట్‌, అడ్వాన్స్‌డ్‌ టెస్ట్‌, ఫిజికల్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్‌, కమాండ్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ, డ్రైవింగ్‌ టెస్ట్‌ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 10.04.2023.

వెబ్‌సైట్‌:  https://www.nfc.gov.in/


హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌-వైజాగ్‌లో..

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విశాఖపట్నంలోని హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎస్‌ఎల్‌) 43 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: మేనేజర్‌, డిప్యూటీ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌, మెడికల్‌ ఆఫీసర్‌, సీనియర్‌ అడ్వైజర్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌ తదితరాలు.

విభాగాలు: కాంట్రాక్ట్‌ మేనేజ్‌మెంట్‌, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌, లీగల్‌, టెక్నికల్‌, ఫైనాన్స్‌, డిజైన్‌, సెక్యూరిటీ అండ్‌ ఫైర్‌ సర్వీస్‌..

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌/ ఇంజినీరింగ్‌ డిగ్రీ/ డిప్లొమా/ ఎంబీబీఎస్‌/ ఎల్‌ఎల్‌బీ/ ఐసీఏఐ/ ఐసీడబ్ల్యూఏఐ/ పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా/ ఎంబీఏ/ ఎంసీఏ.

వయసు: 30-62 ఏళ్లు ఉండాలి.

ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.

మెడికల్‌ ఆఫీసర్‌, డిప్యూటీ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌(లీగల్‌) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు మాత్రం 23.03.2023 రోజున ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇతర అభ్యర్థులకు సంస్థ నిబంధనల ప్రకారం ఎంపిక విధానం ఉంటుంది.

ఇంటర్వ్యూ వేదిక: Hindustan Shipyard Limited, Visakhapatnam (ఉదయం 8:30 నుంచి).

దరఖాస్తు ఫీజు: రూ.300.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 06.04.2023.

వెబ్‌సైట్‌: https://www.hslvizag.in/content/200_1_careers.aspx


ఎస్సీ, ఎస్టీ హబ్‌ కార్యాలయాల్లో ఖాళీలు

నేషనల్‌ ఎస్సీ, ఎస్టీ హబ్‌ కార్యాలయాల్లో పని చేయటానికి బ్రాడ్‌కాస్ట్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (బీఈసీఐఎల్‌) 28 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: ఈ-టెండరింగ్‌ ప్రొఫెషనల్‌, ఫైనాన్స్‌ ఫెసిలిటేషన్‌ ప్రొఫెషనల్‌, ఆఫీస్‌ అటెండెంట్‌.

అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి/ బీటెక్‌/ బీఈ/ బీకామ్‌/ ఐసీడబ్ల్యూఏ/ ఎంబీఏ.

ఎంపిక: స్కిల్‌ టెస్ట్‌/ రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.885.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 24.03.2023.

వెబ్‌సైట్‌: https://www.becil.com/vacancies


బీఈసీఐఎల్‌లో 73 వివిధ పోస్టులు

గువాహటిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)లో పని చేయటానికి బ్రాడ్‌కాస్ట్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (బీఈసీఐఎల్‌) 73 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: జూనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌, ల్యాబ్‌ అటెండెంట్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌, మెడికల్‌ సోషల్‌ వర్కర్‌, మెడికల్‌ రికార్డ్‌ టెక్నీషియన్‌, క్లినికల్‌ సైకాలజిస్ట్‌, ఫిజియోథెరపిస్ట్‌, స్పీచ్‌ థెరపిస్ట్‌/ స్పీచ్‌ అండ్‌ లాంగ్వేజ్‌ పాథాలజిస్ట్‌, ఓపీడీ అటెండెంట్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌, అనస్థీషియా టెక్నీషియన్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌, ఆర్థోపెడిక్‌/ ప్లాస్టర్‌ టెక్నీషియన్‌, జూనియర్‌ ఇంజినీర్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి/ 10+2/ ఇంటర్మీడియట్‌/ బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ/ గ్రాడ్యుయేషన్‌/ డిప్లొమా/ డీఎంఎల్‌టీ/ ఎంసీఏ/ ఎంఎస్సీ/ ఎంఏ.

ఎంపిక: స్కిల్‌ టెస్ట్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 21.03.2023.

వెబ్‌సైట్‌: https://www.becil.com/vacancies


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని