నోటిఫికేషన్స్‌

సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌) దేశవ్యాప్తంగా 9212 కానిస్టేబుల్‌ (టెక్నికల్‌, ట్రేడ్స్‌మ్యాన్‌) నియామకాలు చేపడుతోంది.

Updated : 20 Mar 2023 03:53 IST

ఉద్యోగాలు

9212 కానిస్టేబుల్‌ పోస్టులు

సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌) దేశవ్యాప్తంగా 9212 కానిస్టేబుల్‌ (టెక్నికల్‌, ట్రేడ్స్‌మ్యాన్‌) నియామకాలు చేపడుతోంది. పురుషులకు 9105; మహిళలకు 107.

పురుషుల పోస్టులు: డ్రైవర్‌, మోటార్‌ మెకానిక్‌ వెహికల్‌, కోబ్లర్‌, కార్పెంటర్‌, టైలర్‌, బ్రాస్‌ బ్యాండ్‌, పైప్‌ బ్యాండ్‌, బగ్లర్‌, గార్డెనర్‌, పెయింటర్‌, కుక్‌, వాటర్‌ క్యారియర్‌, వాషర్‌మన్‌, బార్బర్‌, సఫాయి కర్మచారి.

మహిళా పోస్టులు: బగ్లర్‌, కుక్‌, వాటర్‌ క్యారియర్‌, వాషర్‌ ఉమన్‌, హెయిర్‌ డ్రస్సెర్‌, సఫాయి కర్మచారి, బ్రాస్‌ బ్యాండ్‌.

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ, హెవీ ట్రాన్స్‌పోర్ట్‌ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌. దీంతోపాటు పురుషులు 170 సెం.మీ., మహిళలు 157 సెం.మీ. ఎత్తు ఉండాలి.
వయసు: 01.08.2023 నాటికి 18-23 సంవత్సరాల మధ్య ఉండాలి. డ్రైవర్‌ పోస్టులకు 21-27 ఏళ్ల మధ్య. ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, స్కిల్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా.
పరీక్ష ఫీజు: రూ.100 (ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు మినహాయింపు).
ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 27-03-2023.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 25-04-2023.
కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష: జులై 1 నుంచి 13 వరకు.
వెబ్‌సైట్‌: https://crpf.gov.in/


ప్రవేశాలు

టీఎస్‌ పీఈసెట్‌-2023

వ్యాయామ విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్‌ పీఈసెట్‌)- 2023 నోటిఫికేషన్‌ విడుదలయింది.ఈ పరీక్ష ద్వారా రెండేళ్ల వ్యవధిగల బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

విద్యార్హత: బీపీఈడీకు బ్యాచిలర్స్‌ డిగ్రీతో పాటు 01-07-2023 నాటికి 19 ఏళ్లు నిండి ఉండాలి. డీపీఈడీ కోర్సుకు ఇంటర్‌తో పాటు 01-07-2023 నాటికి 16 ఏళ్లు నిండి ఉండాలి.
క్రీడల పోటీలు: ఇందులో రెండు భాగాలు ఉంటాయి. మొదటి భాగంలో ఫిజికల్‌ ఎఫీషియన్సీ టెస్ట్‌, రెండో విభాగంలో స్కిల్‌ టెస్ట్‌ ఉంటాయి.
పరీక్ష ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.900; ఎస్సీ/ ఎస్టీలకు రూ.500.
* దరఖాస్తుల స్వీకరణ: మే 6 వరకు:
* పరీక్షలో భాగంగా అభ్యర్థులకు క్రీడల పోటీలు: జూన్‌ 1 నుంచి 10 వరకు
* జూన్‌ మూడో వారం: ఫలితాల వెల్లడి
వెబ్‌సైట్‌: https://pecet.tsche.ac.in/


నేషనల్‌ షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో పీజీ డిప్లొమా  

కాన్పూర్‌లోని నేషనల్‌ షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌ 2023-24 అకడమిక్‌ సెషన్‌కు పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

1. పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సు ఆఫ్‌ అసోసియేట్‌షిప్‌ (షుగర్‌ టెక్నాలజీ- రెండున్నరేళ్లు): 66 సీట్లు
2. పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సు ఆఫ్‌ అసోసియేట్‌షిప్‌ (షుగర్‌ టెక్నాలజీ- ఏడాదిన్నర): 40 సీట్లు
3. పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సు (ఇండస్ట్రియల్‌ ఫెర్మెంటేషన్‌ అండ్‌ ఆల్కహాల్‌ టెక్నాలజీ): 50 సీట్లు
4. పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సు (షుగర్‌ కేన్‌ ప్రొడక్టివిటీ అండ్‌ మెచ్యూరిటీ మేనేజ్‌మెంట్‌): 20 సీట్లు
5. పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సు (ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ ప్రాసెస్‌ కంట్రోల్‌): 17 సీట్లు
6. పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సు (క్వాలిటీ కంట్రోల్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌): 22 సీట్లు
7. షుగర్‌ ఇంజినీరింగ్‌ సర్టిఫికెట్‌ కోర్సు: 17 సీట్లు
8. షుగర్‌ బాయిలింగ్‌ సర్టిఫికెట్‌ కోర్సు: 63 సీట్లు
9. క్వాలిటీ కంట్రోల్‌లో సర్టిఫికెట్‌ కోర్సు: 30 సీట్లు

అర్హత: కోర్సును అనుసరించి మెట్రిక్యులేషన్‌, పన్నెండో తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్స్‌ డిగ్రీ.
ఎంపిక: ప్రవేశ పరీక్ష ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.1500 (ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.1000).
ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 10-04-2023.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 26-05-2023.
ప్రవేశ పరీక్ష తేదీ: 25-06-2023.
వెబ్‌సైట్‌: http://nsi.gov.in/online-application.html


ఏపీ ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌

ఆంధ్రప్రదేశ్‌ ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2023 (ఏపీ ఐసెట్‌) నోటిఫికేషన్‌ విడుదలయింది.

కోర్సులు: మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంబీఏ)/ మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ (ఎంసీఏ)

అర్హత: ఎంబీఏ కోర్సుకు బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ, బీఈ, బీటెక్‌, బీఫార్మసీ; ఎంసీఏ కోర్సుకు బీసీఏ, డిగ్రీ (కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌), బీఎస్సీ, బీకాం, బీఏ(ఇంటర్‌/ డిగ్రీ స్థాయిలో గణితం చదివి ఉండాలి).  

వయసు: 19 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయసు నిబంధన లేదు.
దరఖాస్తు రుసుము: రూ.650 (బీసీలకు రూ.600; ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.550).
ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు: ఏప్రిల్‌ 19.
పరీక్షలు: మే 24, 25 తేదీల్లో.
వెబ్‌సైట్‌: https://cets.apsche.ap.gov.in/APSCHEHome.aspx


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని