నోటిఫికేషన్స్
ఘజియాబాద్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) 38 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఉద్యోగాలు
బెల్-ఘజియాబాద్‌లో ఇంజినీర్ ఖాళీలు
ఘజియాబాద్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) 38 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
1. ట్రెయినీ ఇంజినీర్ (12 పోస్టులు): బీఈ/ బీటెక్/ ఇంజినీరింగ్ డిగ్రీ (కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్), ఏడాది పని అనుభవం ఉండాలి.
వయసు: 28 ఏళ్లు మించకూడదు. దరఖాస్తు ఫీజు: రూ.177.
2. ప్రాజెక్ట్ ఇంజినీర్ (26 పోస్టులు): బీఈ/ బీటెక్/ ఇంజినీరింగ్ డిగ్రీ (కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్), 2 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 32 ఏళ్లు మించకూడదు. దరఖాస్తు ఫీజు: రూ.472.
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 23.03.2023.
వెబ్‌సైట్: https://bel-india.in/
ఆర్‌ఈసీ లిమిటెడ్‌లో..
భారత ప్రభుత్వరంగ సంస్థ మహారత్న విభాగంలోని ఆర్‌ఈసీ లిమిటెడ్ 125 వివిధ రకాల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: జనరల్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, ఆఫీసర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, చీఫ్ మేనేజర్ తదితరాలు.
విభాగాలు: అడ్మిన్, సీసీ, లా, సెక్రటేరియల్, రాజ్‌భాష, సీఎస్, ఐటీ, హెచ్‌ఆర్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ/ గ్రాడ్యుయేషన్/ బీటెక్/ బీఈ/ డిప్లొమా/ సీఏ/ సీఎంఏ/ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ/ ఎంసీఏ/ ఎంటెక్/ ఎంఈ/ ఎంబీఏ/ పీజీ. పని అనుభవం: కనీసం 3-21 ఏళ్ల పని అనుభవం ఉండాలి. వయసు: 33-55 ఏళ్లు ఉండాలి.(ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయసులో సడలింపు)
ఎంపిక: రాతపరీక్ష/ ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.1000.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15.04.2023.
వెబ్‌సైట్: https://recindia.nic.in/careers
ఐఐఎంలో నాన్ టీచింగ్ కొలువులు
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) రాయ్‌పూర్ ఒప్పంద ప్రాతిపదికన 31 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
* హెడ్, క్యాంపస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్: 01
* సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: 01
* అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: 11
* కార్పొరేట్ రిలేషన్స్ ఆఫీసర్: 01
* సీనియర్ ఇంజినీర్ (సివిల్): 01
* సీనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 01
* అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: 04
* అసిస్టెంట్ సిస్టమ్స్ మేనేజర్: 01
* పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్: 01
* జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: 09
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం.
ఎంపిక: రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.500 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు).
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 05-04-2023.
వెబ్‌సైట్: https://iimraipur.ac.in/
ఐసీఎస్‌ఐలో 40 సీఆర్‌సీ ఎగ్జిక్యూటివ్‌లు
న్యూదిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్‌ఐ).. 40 సీఆర్‌సీ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: మెంబర్ ఆఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా. సంబంధిత రంగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం.
వయసు: 01.03.2023 నాటికి 31 సంవత్సరాలు మించకూడదు.
పని ప్రదేశం: సెంట్రల్ రిజిస్ట్రేషన్ సెంటర్, మనేసర్, హరియాణా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 28.03.2023.
వెబ్‌సైట్: http://www.icsi.in/recruitmentcrc/
ప్రవేశాలు
ఏపీ పీజీఈసెట్-2023
ఏపీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2023 నోటిఫికేషన్ విడుదలయింది. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థులకు వివిధ పీజీ కోర్సుల్లో మొదటి ఏడాది ప్రవేశాలు కల్పిస్తారు.
అందిస్తున్న పీజీ కోర్సులు: ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మ్ డీ.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్/ బీఫార్మసీ ఉత్తీర్ణత. చివరి ఏడాది పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.
* గేట్/ జీప్యాట్ అర్హత సాధించిన అభ్యర్థులకు విడిగా నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
ఎంపిక: ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులు రూ.1200, బీసీ అభ్యర్థులు రూ.900, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.700 చెల్లించాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.03.2023 నుంచి.
దరఖాస్తులకు చివరి తేది: 30.04.2023.
రూ.5000 ఆలస్య రుసుంతో చివరి తేది: 14.05.2023.
ఏపీపీజీఈసెట్ తేదీ: 28.05.2023 నుంచి 30.05.2023.
వెబ్‌సైట్: https://cets.apsche.ap.gov.in/
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Flight Passengers: బ్యాగేజ్‌తో పాటు ప్రయాణికుల శరీర బరువూ కొలవనున్న ఎయిర్‌లైన్స్ సంస్థ!
-
India News
Mahindra - Dhoni: ధోనీ రాజకీయాల గురించి ఆలోచించాలి.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
-
Sports News
MS Dhoni : మైదానాల్లో ధోనీ మోత మోగింది.. ఆ శబ్దం విమానం కంటే ఎక్కువేనట..
-
Crime News
ప్రియుడితో భార్య పరారీ.. స్టేషన్‌కు భర్త బాంబు బెదిరింపు ఫోన్‌కాల్!
-
Movies News
Ahimsa: ఈ సినిమాలోనూ హీరో, హీరోయిన్ను కొట్టారా? విలేకరి ప్రశ్నకు తేజ స్ట్రాంగ్ రిప్లై!
-
General News
Cyber Crimes: ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడుతున్నారా? ఈ ‘5s’ ఫార్ములా మీ కోసమే!