నోటిఫికేషన్స్‌

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళానికి చెందిన పలాసలో ఉన్న కిడ్నీ రిసెర్చ్‌ సెంటర్‌ అండ్‌ డయాలసిస్‌ యూనిట్‌లో తాత్కాలిక ప్రాతిపదికన పని చేయటానికి 60 పోస్టులను భర్తీ చేయనున్నారు.

Updated : 23 Mar 2023 03:46 IST

ఉద్యోగాలు

డయాలసిస్‌ యూనిట్‌లో 60 పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళానికి చెందిన పలాసలో ఉన్న కిడ్నీ రిసెర్చ్‌ సెంటర్‌ అండ్‌ డయాలసిస్‌ యూనిట్‌లో తాత్కాలిక ప్రాతిపదికన పని చేయటానికి 60 పోస్టులను భర్తీ చేయనున్నారు.

1. సెక్యూరిటీ గార్డ్‌/ జనరల్‌ డ్యూటీ అటెండెంట్లు: 10వ తరగతి పాసై ఉండాలి.  
2. సపోర్టింగ్‌ స్టాఫ్‌/ జనరల్‌ డ్యూటీ అటెండెంట్లు: 10వ తరగతి.
3. సోషల్‌ వర్కర్‌: బీఏ/ బీఎస్‌డబ్ల్యూ/ ఎంఏ/ ఎంఎస్‌డబ్ల్యూ.
4. సీఆర్మ్‌ టెక్నీషియన్‌: డీఎంఐటీ కోర్సు ఉత్తీర్ణత.
5. ల్యాబొరేటరీ టెక్నీషియన్‌: టీఎంఎల్‌టీ/ బీఎస్సీ ఎంఎల్‌టీ ఉండాలి.
6. డయాలసిస్‌ టెక్నీషియన్‌: డిప్లొమా.
7. ఓటీ అసిస్టెంట్‌: 7వ తరగతి.
8. రిజిస్ట్రేషన్‌ క్లర్క్‌: గ్రాడ్యుయేషన్‌.
9. జూనియర్‌ అసిస్టెంట్‌: గ్రాడ్యుయేషన్‌.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
చిరునామా: సూపరింటెండెంట్‌, జీజీహెచ్‌, శ్రీకాకుళం.
దరఖాస్తుకు చివరి తేదీ: 31.03.2023.

వెబ్‌సైట్‌: https://srikakulam.ap.gov.in/


వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ

సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ కొలువులు

ఏపీ వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో ఉన్న ఆసుపత్రుల్లో 445 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్స్‌, స్పెషాలిటీ వైద్యుల నియామకాలకు వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూలు జరగనున్నాయి. వివిధ విభాగాల్లో శాశ్వత, ఒప్పంద విధానంలో ఈ నియామకాలు జరగనున్నాయి.

స్పెషాలిటీలు: జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, డెర్మటాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌, గైనకాలజీ, అనస్థీషియా, ఈఎన్‌టీ, పాథాలజీ, పీడియాట్రిక్స్‌, ఆర్థోపెడిక్స్‌, ఆఫ్తాల్మాలజీ, రేడియాలజీ.
అర్హత: సంబంధిత స్పెషాలిటీలో డిప్లొమా/ డీఎన్‌బీ/ పీజీ డిగ్రీ.
వయసు: 42 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక: విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం ఆధారంగా.
వాక్‌-ఇన్‌-రిక్రూట్‌మెంట్‌ తేదీలు: మార్చి 23, 25, 27.
వేదిక: డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ కార్యాలయం, పాత జీజీహెచ్‌ క్యాంపస్‌, హనుమాన్‌ పేట్‌, విజయవాడ.

వెబ్‌సైట్‌: http://hmfw.ap.gov.in/


ఐఆర్‌సీటీసీ, సౌత్‌ సెంట్రల్‌ జోన్‌లో..

ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఆర్‌సీటీసీ), సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన 42 హాస్పిటాలిటీ మానిటర్‌ ఖాళీల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

అర్హత: ఎంబీఏ (టూరిజం అండ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌)తో పాటు సంబంధిత రంగంలో రెండేళ్ల పని అనుభవం.
వయసు: 01.04.2023 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు.
పని ప్రదేశాలు: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌.
ఎంపిక: విద్యార్హతలు, ఇంటర్వ్యూ, మెడికల్‌ ఫిట్‌నెస్‌ ఆధారంగా.
వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ స్థలం/ తేదీలు:
03.04.23/ 04.04.23: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ వద్ద, వీఎస్‌ఎస్‌ నగర్‌, భువనేశ్వర్‌
08.04.23/ 09.04.23: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌, ఎఫ్‌-రో, విద్యా నగర్‌, డీడీ కాలనీ, హైదరాబాద్‌.

వెబ్‌సైట్‌: https://irctc.com/new-openings.html


టూరిజం మానిటర్‌ ఉద్యోగాలు

ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఆర్‌సీటీసీ), సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన 6 టూరిజం మానిటర్‌ పోస్టుల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ (టూరిజం). లేదా పీజీ/ డిప్లొమా (ట్రావెల్‌ అండ్‌ టూరిజం)తో పాటు టూర్‌ ఆపరేషన్‌/ ట్రావెల్‌ ఏజెన్సీ సంస్థల్లో రెండేళ్ల పని అనుభవం.
వయసు: 01.04.2023 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు.
పని ప్రదేశాలు: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌.
ఎంపిక: విద్యార్హతలు, ఇంటర్వ్యూ, మెడికల్‌ ఫిట్‌నెస్‌ ఆధారంగా.
వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ స్థలం/ తేదీలు:
03.04.23/ 04.04.23: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ వద్ద, వీఎస్‌ఎస్‌ నగర్‌, భువనేశ్వర్‌
08.04.23/ 09.04.23: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌, ఎఫ్‌-రో, విద్యా నగర్‌, డీడీ కాలనీ, హైదరాబాద్‌.

వెబ్‌సైట్‌: https://irctc.com/new-openings.html


విజయవాడ కేంద్రీయ విద్యాలయంలో..

విజయవాడలోని కేంద్రీయ విద్యాలయం నం.2 2023-24 విద్యా సంవత్సరానికి కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన పార్ట్‌ టైమ్‌ టీచర్‌/ స్టాఫ్‌ నియామకానికి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

1. టీజీటీ(హిందీ/ ఇంగ్లిష్‌/ సోషల్‌ సైన్స్‌/ మ్యాథ్స్‌/ సంస్కృతం/ సైన్స్‌)
2. పీఆర్‌టీ (ప్రైమరీ టీచర్‌)
3. కంప్యూటర్‌ ఇన్‌స్ట్రక్టర్‌
4. అకడమిక్‌ కౌన్సెలర్‌ 5. స్పెషల్‌ ఎడ్యుకేటర్‌
అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్‌, డిగ్రీ, పీజీ, డిప్లొమా, పీజీ డిప్లొమా, బీఈడీ, డీఈడీ, సీటెట్‌, టెట్‌ ఉండాలి.  
ఎంపిక: స్క్రీనింగ్‌ టెస్ట్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీలు: 24.03.2023, 25.03.2023.
వేదిక: కేంద్రీయ విద్యాలయం, విజయవాడ.

వెబ్‌సైట్‌: https://no2vijayawada.kvs.ac.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని