నోటిఫికేషన్స్
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్‌వో), న్యూదిల్లీ ప్రాంతీయ కార్యాలయాల్లో సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్(ఎస్‌ఎస్‌ఏ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ప్రభుత్వ ఉద్యోగాలు
ఈపీఎఫ్‌వోలో 2674 సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్లు
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్‌వో), న్యూదిల్లీ ప్రాంతీయ కార్యాలయాల్లో సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్(ఎస్‌ఎస్‌ఏ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు: ఎస్‌ఎస్‌ఏ- గ్రూప్ సి
మొత్తం ఖాళీలు: 2674 (ఏపీలో 39, తెలంగాణలో 116)
అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిమిషానికి 35 ఇంగ్లిష్ లేదా 30 హిందీ పదాలు కంప్యూటర్‌పై టైప్ చేయాలి.
వయసు: ఏప్రిల్ 26, 2023 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు.
వేతన శ్రేణి: రూ.29,200 - రూ.92,300.
ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్‌లతో.
దరఖాస్తు రుసుము: రూ.700(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళలు ఫీజు చెల్లించవసరం లేదు)
ఆన్‌లైన్ దరఖాస్తుకు గడువు: 26-04-2023
వెబ్‌సైట్: https://www.epfindia.gov.in
ఈపీఎఫ్‌వోలో 185 స్టెనోగ్రాఫర్లు
పోస్టు: స్టెనోగ్రాఫర్ (గ్రూప్ సి)
అర్హత: పన్నెండో తరగతి ఉత్తీర్ణతతో పాటు స్టెనోగ్రఫీ నైపుణ్యం ఉండాలి.
వయసు: ఏప్రిల్ 26, 2023 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతన శ్రేణి: రూ.25,500 - రూ.81,100.
ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్‌లతో
దరఖాస్తు రుసుము: రూ.700(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళలకు మినహాయింపు)
ఆన్‌లైన్ దరఖాస్తుకు గడువు: 26-04-2023
వెబ్‌సైట్: https://www.epfindia.gov.in
ప్రవేశాలు
సైనిక పాఠశాలలో...
తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్), హైదరాబాద్... 2023-24 విద్యా సంవత్సరానికి వరంగల్ జిల్లా అశోక్‌నగర్‌లో బాలుర సైనిక స్కూల్‌లో ఆరో తరగతి (సీబీఎస్‌ఈ), ఇంటర్మీడియట్(ఎంపీసీ- సీబీఎస్‌ఈ)లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన విద్యార్థులకు ఉచిత వసతి, భోజనంతో పాటు దుస్తులు, పుస్తకాలు తదితరాలు అందిస్తారు.
అర్హతలు: ఆరో తరగతికి 2022-23 విద్యా సంవత్సరంలో గుర్తింపు పొందిన పాఠశాల నుంచి ఐదో తరగతి పరీక్షకు హాజరైన/ ఉత్తీర్ణులైన బాలురు అర్హులు. ఇంటర్‌కు 2022-23 విద్యా సంవత్సరంలో గుర్తింపు పొందిన పాఠశాల నుంచి పదో తరగతి పరీక్షకు హాజరైన/ ఉత్తీర్ణులైన బాలురు అర్హులు. విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2,00,000 (పట్టణ ప్రాంతం), రూ.1,50,000 (గ్రామీణ ప్రాంతం) మించకూడదు.
సీట్లు: ఆరో తరగతి- 80, ఇంటర్- 80.
వయసు: ఇంటర్‌కు 01-04-2006 నుంచి 31-06-2008 మధ్య జన్మించినవారు అర్హులు. ఆరో తరగతికి 01-04-2011 నుంచి 31-03-2013 మధ్య జన్మించినవారు అర్హులు.
ఎంపిక: రాత, శారీరక సామర్థ్య, వైద్య పరీక్షలతో.
పరీక్ష ఇలా: ఆరోతరగతి రాత పరీక్షలో..
ఐదో తరగతి సిలబస్ నుంచి మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు 100 ఉంటాయి. తెలుగు(20 మార్కులు), ఇంగ్లిష్(30 మార్కులు), మ్యాథ్స్(30 మార్కులు), సైన్స్(10 మార్కులు), సోషల్ స్టడీస్(10 మార్కులు) సబ్జెక్టుల్లో ప్రశ్నలు అడుగుతారు. ఇంటర్ రాత పరీక్షలో 8-10వ తరగతి స్థాయిలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు 100 ఉంటాయి. ఇంగ్లిష్(20 మార్కులు), మ్యాథ్స్(40 మార్కులు), ఫిజిక్స్(20 మార్కులు), కెమిస్ట్రీ(15 మార్కులు), బయాలజీ(5 మార్కులు) సబ్జెక్టుల్లో ప్రశ్నలు అడుగుతారు.
రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.200.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 08.04.2023.
ప్రవేశ పరీక్ష తేదీ: 30.04.2023.
వెబ్‌సైట్: ww.tgtwgurukulam. telangana.gov.in
అప్రెంటిస్
బీఎస్‌ఎన్‌ఎల్, హరియాణ సర్కిల్
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్), హరియాణ సర్కిల్ అప్రెంటిస్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్: 40 ఖాళీలు
అర్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ (టెక్నికల్/ నాన్ టెక్నికల్) లేదా డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 25 ఏళ్లకు మించరాదు.
స్టైపెండ్: గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.9000, డిప్లొమా వారికి రూ.8000.
ఎంపిక: డిగ్రీ/ డిప్లొమాలో సాధించిన మార్కులతో
అప్రెంటిస్‌షిప్ వ్యవధి: ఏడాది
దరఖాస్తు రుసుము: లేదు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15.04.2023.
డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీ: 26.04.2023.
ఎంపిక జాబితా ప్రకటన: మే 2023 మొదటి వారం.
వెబ్‌సైట్: https://www.bsnl.co.in
బీఎస్‌ఎన్‌ఎల్ ఉత్తరాఖండ్‌లో..
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్), దేహ్రాదూన్ ఉత్తరాఖండ్ టెలికాం సర్కిల్ అప్రెంటిస్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్: 21 ఖాళీలు
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా/డిగ్రీ(ఇంజినీరింగ్/ టెక్నాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి.
విభాగాలు: టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, రేడియో, కంప్యూటర్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.
వయసు: 25 ఏళ్లకు మించరాదు.
స్టైపెండ్: గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.9000, డిప్లొమా వారికి రూ.8000.
ఎంపిక: డిగ్రీ/ డిప్లొమాలో సాధించిన మార్కులతో.
దరఖాస్తు రుసుము: లేదు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10-04-2023.
వెబ్‌సైట్: https://www.bsnl.co.in
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
ఆస్ట్రేలియా వికెట్ పడింది.. లబుషేన్ నిద్ర లేచాడు
-
Movies News
ఇలియానా వెబ్‌సిరీస్ అప్పుడే!
-
Sports News
WTC Final: గిల్ అంటే కుర్రాడు.. నీకేమైంది పుజారా..?: రవిశాస్త్రి ఆగ్రహం
-
Movies News
Social Look: మృణాల్ ఠాకూర్ ‘బ్లాక్ అండ్ బోల్డ్’.. అయిషా శర్మ ఆటో జర్నీ!
-
Sports News
WTC Final: కెన్నింగ్టన్ ఓవల్‌లో మూడో హాఫ్ సెంచరీ.. డాన్ బ్రాడ్‌మన్ సరసన శార్దూల్
-
Movies News
RRR: ఎన్టీఆర్-రామ్‌చరణ్‌లతో నటించే అవకాశం వస్తే అది అదృష్టమే: హాలీవుడ్ స్టార్ హీరో