నోటిఫికేషన్స్‌

ఉద్యోగాలు

Updated : 28 Mar 2023 05:54 IST

ఉద్యోగాలు
ఏఐసీలో మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలు

గ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఏఐసీ), న్యూదిల్లీ మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* మొత్తం ఖాళీలు: 40
విభాగాలు: రూరల్‌ మేనేజ్‌మెంట్‌, లా.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ (అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌/ అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ అండ్‌ కోఆపరేషన్‌/ అగ్రికల్చర్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌/ రూరల్‌ మేనేజ్‌మెంట్‌/ లా)/ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ / ఎంబీఏ(రూరల్‌ మేనేజ్‌మెంట్‌/ అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌/ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌/ అగ్రి-బిజినెస్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌)/ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా (రూరల్‌ మేనేజ్‌మెంట్‌/అగ్రి-బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌/ అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌) ఉత్తీర్ణత.
వయసు: 21-30 ఏళ్లు ఉండాలి. వేతనం: నెలకు రూ.60000.  ఎంపిక: ఆన్‌లైన్‌ పరీక్ష/ ఇంటర్వ్యూలతో.
పరీక్షలో: రీజనింగ్‌, ఇంగ్లిష్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి 135 నిమిషాలు. మొత్తం 150 మార్కులు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌, ఖమ్మం.
దరఖాస్తు ఫీజు: రూ.1000. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 06.04.2023. ఆన్‌లైన్‌ పరీక్ష తేది: ఏప్రిల్‌/ మే 2023.
వెబ్‌సైట్‌: https://www.aicofindia.com/AICEng/Pages/default.aspx


ఇగ్నోలో 200 పోస్టులు

ఇందిరా గాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (ఇగ్నో), న్యూదిల్లీ జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ టైపిస్ట్‌ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
* జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ టైపిస్ట్‌ (జేఏటీ): 200 పోస్టులు (యూఆర్‌- 83, ఎస్సీ- 29, ఎస్టీ- 12, ఓబీసీ- 55)
అర్హతలు: 10+2తో పాటు ఇంగ్లిష్‌, హిందీ టైపింగ్‌ పరిజ్ఞానం ఉండాలి.
వేతనశ్రేణి: రూ.19900- రూ.63200. వయసు: 18 - 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ), స్కిల్‌ టెస్ట్‌/ టైపింగ్‌ టెస్ట్‌లతో.
దరఖాస్తు రుసుము: యూఆర్‌, ఓబీసీ (ఎన్‌సీఎల్‌), ఈడబ్ల్యూఎస్‌లకు రూ.1000; ఎస్సీ, ఎస్టీ, మహిళలకు రూ.600. దివ్యాంగులకు ఫీజు లేదు.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 20.04.2023.
వెబ్‌సైట్‌: http://www.ignou.ac.in/


ఇస్రో-మహేంద్రగిరిలో 63 ఖాళీలు

మహేంద్రగిరిలోని ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌(ఇస్రో) ఆధ్వర్యంలోని ఇస్రో ప్రొపల్షన్‌ కాంప్లెక్స్‌ పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* మొత్తం ఖాళీలు: 63
పోస్టులు: టెక్నికల్‌ అసిస్టెంట్‌, టెక్నీషియన్‌, డ్రాఫ్ట్స్‌మెన్‌, హెవీ వెహికల్‌ డ్రైవర్‌, లైట్‌ వెహికల్‌ డ్రైవర్‌, ఫైర్‌మ్యాన్‌.
విభాగాలు: మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, సివిల్‌, ఫిట్టర్‌, ప్లంబర్‌, ఎలక్ట్రీషియన్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో పదో తరగతి/ డిప్లొమా/ ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత.
వయసు: 18-35 ఏళ్లు ఉండాలి. వేతన శ్రేణి: రూ.19900-రూ.44900. ఎంపిక: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష/ స్కిల్‌ టెస్ట్‌/ పీఈటీలతో. దరఖాస్తు ఫీజు: రూ.750.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 24.04.2023.
వెబ్‌సైట్‌: https://www.iprc.gov.in/iprc/careers.html


ఏవీఎన్‌ఎల్‌-చెన్నైలో...

ఆర్మోర్డ్‌ వెహికిల్స్‌ నిగమ్‌ లిమిటెడ్‌(ఏవీఎన్‌ఎల్‌), చెన్నై ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* మొత్తం ఖాళీలు: 25
పోస్టులు: హెచ్‌ఆర్‌ కన్సల్టెంట్‌, మేనేజర్‌, డేటాబేస్‌ అడ్మిన్‌, సిస్టమ్‌ అడ్మిన్‌, ఐటీ సపోర్ట్‌ కన్సల్టెంట్‌, వెబ్‌ డెవలపర్‌, యంగ్‌ ప్రొఫెషనల్‌, సీనియర్‌ మేనేజర్‌, కన్సల్టెంట్‌ తదితరాలు.
విభాగాలు: ఆడిట్‌, ఎక్స్‌పోర్ట్‌ అండ్‌ మార్కెటింగ్‌, కాస్ట్‌ అకౌంటింగ్‌, ప్రొడక్షన్‌, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌, పీహెచ్‌పీ, లైనక్స్‌, ప్రొక్యూర్‌మెంట్‌, క్వాలిటీ అస్యూరెన్స్‌, ప్రొడక్షన్‌.. తదితరాలు.
వేతనం: పోస్టును అనుసరించి నెలకు రూ.40,000 - రూ.1.1 లక్షలు చెల్లిస్తారు.
దరఖాస్తుకు చివరి తేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌లో ఉద్యోగ ప్రకటన వెలువడిన 21 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్‌:: https://avnl.co.in/index.php 


విశాఖపట్నం జిల్లాలో 47 అంగన్‌వాడీ ఖాళీలు

విశాఖపట్నం జిల్లా ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో అంగన్‌వాడీ వర్కర్‌, అంగన్‌వాడీ హెల్పర్‌ ఖాళీల భర్తీకి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 47.
1. అంగన్‌వాడీ వర్కర్‌: 05 పోస్టులు
2. అంగన్‌వాడీ హెల్పర్‌: 42 పోస్టులు
ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పేరు: పెందుర్తి, విశాఖపట్నం, భీమునిపట్నం.
వయసు: 01-07-2022 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత.
వేతనం: అంగన్‌వాడీ వర్కర్‌కు రూ.11500, మినీ అంగన్‌వాడీ వర్కర్‌కు రూ.7000, అంగన్‌వాడీ హెల్పర్‌కు రూ.7000.
దరఖాస్తులు: విశాఖపట్నం జిల్లాలోని సీడీపీవో కార్యాలయం చిరునామాకు పంపాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 03.04.2023.
వెబ్‌సైట్‌: https://visakhapatnam.ap.gov.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు