ప్రభుత్వ ఉద్యోగాలు

ఝార్ఖండ్‌ రాష్ట్రం రాంచీలోని సెంట్రల్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌.. ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ అభ్యర్థులకు స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహిస్తోంది.

Updated : 04 Apr 2023 05:02 IST

మైనింగ్‌ సర్దార్‌, ఎలక్ట్రీషియన్‌ పోస్టులు

ఝార్ఖండ్‌ రాష్ట్రం రాంచీలోని సెంట్రల్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌.. ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ అభ్యర్థులకు స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహిస్తోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 330.

మైనింగ్‌ సర్దార్‌: 77  

ఎలక్ట్రీషియన్‌ (నాన్‌ ఎగ్జిక్యూటివ్‌) టెక్నీషియన్‌: 126  

డిప్యూటీ సర్వేయర్‌: 20  

అసిస్టెంట్‌ ఫోర్‌మాన్‌ టీ అండ్‌ ఎస్‌ (ఎలక్ట్రికల్‌): 107  

అర్హత: పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా.

వయసు: 19-04-2023 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 19-04-2023.

అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌: 30-04-2023 నుంచి 04-05-2023 వరకు.

రాత పరీక్ష: 05-05-2023.

ఫలితాల ప్రకటన: 29-05-2023.

వెబ్‌సైట్‌: www.centralcoalfields.in/ind/ index_h.php


డేటా ఎంట్రీ ఆపరేటర్‌, రేడియోగ్రాఫర్‌లు

న్యూదిల్లీలోని బ్రాడ్‌కాస్ట్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (బేసిల్‌).. న్యూదిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) కార్యాలయాల్లో ఒప్పంద ప్రాతిపదికన 155 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

డేటా ఎంట్రీ ఆపరేటర్‌: 50  

పేషెంట్‌ కేర్‌ మేనేజర్‌: 10

పేషెంట్‌ కేర్‌ కోఆర్డినేటర్‌: 25  

రేడియోగ్రాఫర్‌: 50  

మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజిస్ట్‌: 20  

అర్హత: 12వ తరగతి, సంబంధిత విభాగంలో బీఎస్సీ, డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం.  

ఎంపిక: స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ/ ఇంటరాక్షన్‌ ఆధారంగా.

దరఖాస్తుకు చివరి తేదీ: 12.04.2023.

వెబ్‌సైట్‌: https://www.becil.com/


సీడ్యాక్‌, నోయిడాలో ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌లు

యూపీ రాష్ట్రం నోయిడాలోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీడ్యాక్‌).. కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన 140  పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ప్రాజెక్ట్‌ మేనేజర్‌: 10  

సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌: 30

ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌: 100  

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంసీఏతో పాటు పని అనుభవం.

పని ప్రదేశం: నోయిడా.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 12-04-2023.

వెబ్‌సైట్‌: https://careers.cdac.in/ 


ఇస్రో-హైదరాబాద్‌లో...

హైదరాబాద్‌లోని బాలానగర్‌కు చెందిన ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) ఆధ్వర్యంలోని నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ 34 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: జేఆర్‌ఎఫ్‌, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, ప్రాజెక్ట్‌సైంటిస్ట్‌ తదితరాలు.

విభాగాలు: జాతీయ హైడ్రాలజీ ప్రాజెక్ట్‌, భారతదేశ పర్యావరణ వ్యవస్థలు, బయోమాస్‌ పునరుద్ధరణ, ట్రేస్‌ గ్యాస్‌, బయోమాస్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీటెక్‌/ బీఈ/ బీఎస్సీ/ ఎంటెక్‌/ ఎంఈ/ ఎంఎస్సీ.

వయసు: 28-35 ఏళ్లు ఉండాలి.

ఎంపిక: స్క్రీనింగ్‌, షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 07.04.2023.

వెబ్‌సైట్‌: www.nrsc.gov.in/Career_Apply


వాక్‌ఇన్‌

ఈసీఐఎల్‌-హైదరాబాద్‌లో 29 కొలువులు

హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌) 29 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

టెక్నికల్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులు.

విభాగాలు: ఈసీఈ/ ఈటీసీ/ ఎలక్ట్రానిక్స్‌/ సీఎస్‌ఈ/ ఐటీ తదితరాలు.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ ఎంపీసీ/ డిప్లొమా.

అనుభవం: కనీసం ఏడాది పని అనుభవం ఉండాలి.

1. టెక్నికల్‌ ఆఫీసర్‌: నెలకు రూ.25000 చెల్లిస్తారు.

2. అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌: నెలకు రూ.24500 చెల్లిస్తారు.

ఎంపిక: ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా.

ఇంటర్వ్యూ వేదిక: CLDC, Nalanda Complex, Electronics Corporation of India Limited, TIFR Road, ECIL Post, Hyderabad  500062.

ఇంటర్వ్యూ తేదీ: 06, 07.04.2023.

ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9- మధ్యాహ్నం 12 వరకు.

వెబ్‌సైట్‌: https://www.ecil.co.in/jobs.html 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని