సీడాట్‌లో ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు

భారత టెలికాం టెక్నాలజీ సెంటర్‌కు చెందిన సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ టెలిమాటిక్స్‌ (సీడాట్‌).. టెలికాం టెక్నాలజీ పరిశోధన, అభివృద్ధికి కృషిచేస్తోంది.

Updated : 10 Apr 2023 04:17 IST

భారత టెలికాం టెక్నాలజీ సెంటర్‌కు చెందిన సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ టెలిమాటిక్స్‌ (సీడాట్‌).. టెలికాం టెక్నాలజీ పరిశోధన, అభివృద్ధికి కృషిచేస్తోంది. దీంట్లో భాగంగా న్యూదిల్లీ, బెంగళూరులోని కేంద్రాల్లో 156 ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ ఖాళీల భర్తీకి ప్రకటన జారీచేసింది.  

నియామకాలు ఏడాది కాలానికి మాత్రమే పరిమితం. అయితే అభ్యర్థి పనితీరును బట్టి మరో సంవత్సరంపాటు పొడిగించే అవకాశం ఉంటుంది. అభ్యర్థులు పదో తరగతి, ఇంటర్మీడియట్‌, గ్రాడ్యుయేషన్‌లో 65 శాతం/ అంతకుమించి మార్కులు సాధించాలి. డిగ్రీ పాసైన తర్వాతా, గడువుతేదీ నాటికి సాధించిన అనుభవాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. బీఈ, బీటెక్‌, బీడిజైన్‌తో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు దరఖాస్తు గడువు తేదీ నాటికి 30 ఏళ్లు మించకూడదు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌/ పీడబ్ల్యూడీ/ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది. విద్యార్హతలు, అనుభవానికి సంబంధించిన సర్టిఫికెట్లను తప్పని సరిగా అప్‌లోడ్‌ చేయాలి.  

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 29.11.2023

వెబ్‌సైట్‌: https://www.cdot.in/ 


ఎంపిక ఎలా?

ప్రాజెక్టు అవసరాలకు అనుగుణంగా ఖాళీలను ఎప్పటికప్పుడు సీడాట్‌ పోర్టల్‌ ద్వారా తెలియజేస్తారు. ఖాళీల సంఖ్య కంటే ఎక్కువగా దరఖాస్తులు వస్తే స్క్రీనింగ్‌ నిర్వహిస్తారు. విద్యార్హతలు, వయసు, సంపాదించిన మార్కులు, సాధించిన అనుభవం... వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపికచేస్తారు.  

* సెలక్షన్‌ కమిటీ విధానాలకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులు ఎక్కువగా వచ్చినట్లయితే.. నిర్ణీత కాలానికి కొందరిని వెయిటింగ్‌ లిస్ట్‌లో కూడా ఉంచుతారు.

* ఖాళీల కంటే దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఎక్కువగా ఉన్నప్పుడు షార్ట్‌లిస్ట్‌ తయారుచేసి.. కొందరిని మాత్రమే ఇంటర్వ్యూకు పిలుస్తారు.  

* కన్సాలిడేటెడ్‌ రెమ్యూనరేషన్‌ కింద అన్నీ కలిపి నెలకు రూ.లక్ష వేతనం చెల్లిస్తారు. ఇతర ప్రోత్సాహకాలు ఏమీ ఉండవు. పీఎఫ్‌ సదుపాయం ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని