నోటిఫికేషన్స్‌

న్యూదిల్లీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (ఐఐఎఫ్‌టీ) 2023-24 విద్యా సంవత్సరానికి డిప్లొమా ఇన్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ప్రోగ్రాం (ఆన్‌లైన్‌)లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Published : 10 May 2023 00:04 IST

ప్రవేశాలు

డిప్లొమా ఇన్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌

న్యూదిల్లీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (ఐఐఎఫ్‌టీ) 2023-24 విద్యా సంవత్సరానికి డిప్లొమా ఇన్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ప్రోగ్రాం (ఆన్‌లైన్‌)లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

కాల వ్యవధి: జులై 2023 - మే 2024.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 55% మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 50% మార్కులు).
వయసు: గరిష్ఠ పరిమితి లేదు.
ప్రవేశ ప్రక్రియ: అర్హత, పని అనుభవం తదితరాల ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.2000.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 31-05-2023.
ఫలితాల విడుదల: జూన్‌ 2023 మొదటి వారం.
తరగతుల ప్రారంభం: 08-07-2023.

వెబ్‌సైట్‌: https://www.iift.ac.in/iift/index.php


ఐఐఎఫ్‌టీలో పీహెచ్‌డీ 

న్యూదిల్లీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (ఐఐఎఫ్‌టీ) 2023-24 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ ప్రోగ్రాం (మేనేజ్‌మెంట్‌)లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పీహెచ్‌డీ విభాగాలు: ఫైనాన్స్‌, జనరల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ స్ట్రాటజీ, గ్లోబల్‌ ట్రేడ్‌ ఆపరేషన్స్‌ అండ్‌ లాజిస్టిక్స్‌, ఐటీ ఇన్నోవేషన్‌ అండ్‌ టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌, మార్కెటింగ్‌, ఆపరేషన్స్‌ అండ్‌ సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్‌.
సీట్ల సంఖ్య: దిల్లీ- 22; కోల్‌కతా- 19.
అర్హత: సంబంధిత విభాగంలో కనీసం 55% మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ  
వయసు: గరిష్ఠ పరిమితి లేదు.
ప్రవేశ ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.2,500 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.1,250)
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 31-05-2023.
అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌: 11-06-2023.
ప్రవేశ పరీక్ష (ఆఫ్‌లైన్‌): 18-06-2023.
పరీక్ష ఫలితాల ప్రకటన: జూన్‌ నాలుగో వారం.
ఇంటర్వ్యూ తేదీలు: జులై రెండో వారం.
తుది ఫలితాల ప్రకటన: జులై మూడు లేదా నాలుగో వారం.
ప్రోగ్రాం ప్రారంభం: ఆగస్టు రెండో వారం.

వెబ్‌సైట్‌: https://www.iift.ac.in/iift/index.php


ఆర్‌జీఎన్‌ఏయూలో బీఎంఎస్‌ ప్రోగ్రాం

అమేథీలోని రాజీవ్‌గాంధీ నేషనల్‌ ఏవియేషన్‌ యూనివర్సిటీ 2023 విద్యా సంవత్సరానికి ఏవియేషన్‌ సర్వీసెస్‌ అండ్‌ ఎయిర్‌ కార్గోలో బ్యాచిలర్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ (బీఎంఎస్‌)లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం సీట్ల సంఖ్య: 120.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50% మార్కులతో ఏదైనా స్ట్రీమ్‌తో 10+2. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5% సడలింపు ఉంటుంది.
వయసు: 21 ఏళ్లు మించకూడదు.
సీటు కేటాయింపు: 10+2 మార్కులు, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: జనరల్‌/ ఓబీసీ (బాలురు) అభ్యర్థులకు రూ.1000; బాలికలు/ ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ కేటగిరీలకు రూ.500.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 09-06-2023.

వెబ్‌సైట్‌: https://www.rgnau.ac.in/


ఆర్‌జీఎన్‌ఏయూలో పీజీ డిప్లొమా 

అమేథీలోని రాజీవ్‌గాంధీ నేషనల్‌ ఏవియేషన్‌ యూనివర్సిటీ 2023 విద్యాసంవత్సరానికి పీజీ డిప్లొమా ఇన్‌ ఎయిర్‌పోర్ట్‌ ఆపరేషన్స్‌ ఇన్‌ కొలాబరేషన్‌ ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం సీట్ల సంఖ్య: 120.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50% మార్కులతో ఏదైనా డిగ్రీ. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5% సడలింపు ఉంటుంది.
వయసు: గరిష్ఠ పరిమితి లేదు.
సీటు కేటాయింపు: డిగ్రీ మార్కులు, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: జనరల్‌/ ఓబీసీ (బాలురు) అభ్యర్థులకు రూ.1000; బాలికలు/ ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ కేటగిరీలకు రూ.500.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 30-06-2023.

వెబ్‌సైట్‌: https://www.rgnau.ac.in/


ఐఐఐటీ-భాగల్‌పుర్‌లో ఎంటెక్‌, పీహెచ్‌డీ

భాగల్‌పుర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐఐటీ) 2023-24 విద్యాసంవత్సరానికి ఎంటెక్‌, పీహెచ్‌డీ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, మెకట్రానిక్స్‌ అండ్‌ ఆటోమేషన్‌ ఇంజినీరింగ్‌, బేసిక్‌ సైన్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌ తదితరాలు.
1. ఎంటెక్‌: కనీసం 60 శాతం మార్కులతో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణత. * గేట్‌లో అర్హత సాధించాలి.
2. పీహెచ్‌డీ: కనీసం 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్‌ డిగ్రీ/ మాస్టర్‌ డిగ్రీ ఉత్తీర్ణత.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూలో మెరిట్‌ ద్వారా ఎంపిక ఉంటుంది.
ధరఖాస్తు ఫీజు: 1. ఎంటెక్‌: రూ.500; 2. పీహెచ్‌డీ: రూ.1000.
ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: 05.05.2023 నుంచి 15.06.2023 వరకు.
హాల్‌ టికెట్ల జారీ: 22.06.2023.
ప్రవేశ పరీక్ష తేదీ: 03.06.2023, 04.06.2023
ఫలితాల ప్రకటన: 13.07.2023.
తరగతుల ప్రారంభం: 31.07.2023.

వెబ్‌సైట్‌: https://www.iiitbh.ac.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని