నోటిషికేషన్స్‌

హైదరాబాద్‌ బాలానగర్‌లోని హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) అప్రెంటిస్‌ శిక్షణకు దరఖాస్తులు కోరుతోంది. 

Updated : 15 May 2023 05:56 IST

అప్రెంటిస్‌షిప్‌

గ్రాడ్యుయేట్‌, డిప్లొమా అప్రెంటిస్‌లు

హైదరాబాద్‌ బాలానగర్‌లోని హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) అప్రెంటిస్‌ శిక్షణకు దరఖాస్తులు కోరుతోంది. 

* ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 74  
* టెక్నీషియన్‌ (డిప్లొమా) అప్రెంటిస్‌: 52  
* జనరల్‌ స్ట్రీమ్‌ గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 24  

మొత్తం ఖాళీలు: 150.
ట్రేడ్‌/ విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌, కమర్షియల్‌ అండ్‌ కంప్యూటర్‌ ప్రాక్టీస్‌, ఫార్మసీ, ఎంఎల్‌టీ, బీకాం, బీఎస్సీ.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా/ డిగ్రీ.
ఎంపిక: డిప్లొమా/ డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా. ఇంటర్వ్యూ, రాత పరీక్ష, దరఖాస్తు ఫీజు లేదు.
వాక్‌ ఇన్‌ తేదీలు: మే 23, 24, 25

178 ట్రేడ్‌ అప్రెంటిస్‌ ఖాళీలు

(హెచ్‌ఏఎల్‌) అప్రెంటిస్‌ శిక్షణలో భాగంగా 178 ఐటీఐ ట్రేడ్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

ట్రేడ్‌: ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌, ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌, మెషినిస్ట్‌, టర్నర్‌, వెల్డర్‌, రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఏసీ, సీవోపీఏ, ప్లంబర్‌, పెయింటర్‌, డీజిల్‌ మెకానిక్‌, మోటార్‌ వెహికల్‌ మెకానిక్‌, డ్రాఫ్ట్స్‌మ్యాన్‌- సివిల్‌, డ్రాఫ్ట్స్‌మ్యాన్‌- మెకానికల్‌.
అర్హత: సంబంధిత ట్రేడులో ఐటీఐ.
వాక్‌ ఇన్‌ తేదీలు: మే 17, 18, 19
వేదిక: ఆడిటోరియం, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ట్రైనింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, హెచ్‌ఏఎల్‌ ఏవియానిక్స్‌ డివిజన్‌, బాలానగర్‌, హైదరాబాద్‌.

వెబ్‌సైట్‌: https://hal-india.co.in/Careers/M__206


బెంగళూరులో గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌లు...

బెంగళూరులోని హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) అప్రెంటిస్‌ శిక్షణలో భాగంగా గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

విభాగాలు: ఏరోనాటికల్‌/ ఏరోస్పేస్‌, మెకానికల్‌/ ఇండస్ట్రియల్‌/ ప్రొడక్షన్‌ / మెకట్రానిక్స్‌, మెటలర్జీ అండ్‌ మెటీరియల్‌ సైన్స్‌, ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌/ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ/ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌/ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ/ ఎలక్టాన్రిక్స్‌ అండ్‌ టెలి -కమ్యూనికేషన్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో కనీసం 60% మార్కులతో బీఈ, బీటెక్‌.
ఎంపిక: బీఈ, బీటెక్‌ సెమిస్టర్‌ మార్కుల ఆధారంగా.
దరఖాస్తు: గూగుల్‌ ఫాం ద్వారా.
దరఖాస్తుకు చివరి తేదీ: 17.05.2023.

వెబ్‌సైట్‌: https://hal-india.co.in/Careers/M__206


సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో.. 

బిలాస్‌పూర్‌లోని సౌత్‌ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే (ఎస్‌ఈసీఆర్‌) ఆధ్వర్యం లోని పర్సనల్‌ డిపార్ట్‌మెంట్‌, డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ కార్యాలయం 548 ట్రేడ్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: ఫిట్టర్‌, పెయింటర్‌, ప్లంబర్‌, మెకానిక్‌, ఎలక్ట్రీషియన్‌, డ్రాఫ్ట్స్‌మ్యాన్‌, టర్నర్‌, వైర్‌మ్యాన్‌, గ్యాస్‌కట్టర్‌, ఫొటోగ్రాఫర్‌ తదితరాలు.
అర్హత: టెన్త్‌తో పాటు సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి 10+2/ ఐటీఐ.
వయసు: 15-24 ఏళ్లు ఉండాలి.
అప్రెంటిస్‌షిప్‌ కాలవ్యవధి: ఏడాది.
ఎంపిక: అకడమిక్‌ మార్కుల ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 03.06.2023.

వెబ్‌సైట్‌: https://secr.indianrailways.gov.in/


అణుశక్తి కార్పొరేషన్‌లో..

తమిళనాడు రాష్ట్రం కల్పక్కంలోని న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌పీసీఐఎల్‌), అటామిక్‌ పవర్‌ స్టేషన్‌ 96 ట్రేడ్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ట్రేడులు: కార్పెంటర్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రాం అసిస్టెంట్‌, డ్రాఫ్ట్స్‌మ్యాన్‌ (సివిల్‌), డ్రాఫ్ట్స్‌మ్యాన్‌ (మెకానికల్‌), ఎలక్ట్రీషియన్‌, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌, ఫిట్టర్‌, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌, ల్యాబొరేటరీ అసిస్టెంట్‌ - కెమికల్‌ ప్లాంట్‌, మెషినిస్ట్‌, మేసన్‌ (బిల్డింగ్‌ కన్‌స్ట్రక్టర్‌), ప్లంబర్‌, టర్నర్‌, వెల్డర్‌.
అర్హత: 8వ తరగతి, పన్నెండో తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ.
వయసు: 24 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక: అకడమిక్‌ మెరిట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా.
శిక్షణ కాలం: ఒక సంవత్సరం.
స్ట్టైపెండ్‌: నెలకు రూ.7,700-రూ.8,855.
దరఖాస్తు: ‘మేనేజర్‌ (హెచ్‌ఆర్‌ఎం), హెచ్‌ఆర్‌ఎం విభాగం, ఎన్‌పీసీఐఎల్‌, మద్రాస్‌, అటామిక్‌ పవర్‌ స్టేషన్‌, కల్పక్కం, చెంగల్పట్టు జిల్లా, తమిళనాడు’ చిరునామాకు మే 25లోపు చేరేలా పంపాలి.

వెబ్‌సైట్‌: https://www.npcil.nic.in/index.aspx


ఉద్యోగాలు

అసిస్టెంట్‌ ఇంజినీర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌లు

కోల్‌కతాలోని దామోదర్‌ వ్యాలీ కార్పొరేషన్‌ పశ్చిమ్‌ బెంగాల్‌/ ఝార్ఖండ్‌ రాష్ట్రాల్లోని వివిధ డీవీసీ ప్లాంట్లు/ స్టేషన్లలో 52 ప్రొఫెషనల్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

* అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఐటీ): 25
* అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (కమ్యూ నికేషన్స్‌): 05
* అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (హెచ్‌ఆర్‌): 15
* అసిస్టెంట్‌ మేనేజర్‌ (సీఎస్‌ఆర్‌): 04
* అసిస్టెంట్‌ మేనేజర్‌ (పీఆర్‌): 03  

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమాతో పాటు పని అనుభవం..వయసు: 45 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 21-05-2023.

40 జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులు

దామోదర్‌ వ్యాలీ కార్పొరేషన్‌ ఒప్పంద ప్రాతిపదికన 40 జూనియర్‌ ఇంజినీర్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

విభాగాలు: మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, సీ అండ్‌ ఐ, సివిల్‌, కమ్యూనికేషన్‌.
అర్హత: కనీసం 65 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిప్లొమా (ఇంజినీరింగ్‌/ టెక్నాలజీ).
వయసు: 28 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక: జనరల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, టెక్నికల్‌ నాలెడ్జ్‌ టెస్ట్‌, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.300 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు).
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 26-05-2023.

వెబ్‌సైట్‌: https://www.dvc.gov.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని