నోటిఫికేషన్స్‌

ప్రభుత్వ ఉద్యోగాలు

Published : 18 May 2023 00:48 IST

ప్రభుత్వ ఉద్యోగాలు
ఎన్‌డీఏ అండ్‌ నేవల్‌ అకాడమీ ఎగ్జ్జామ్‌

మొత్తం 395 ఖాళీలకు నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ అండ్‌ నేవల్‌ అకాడమీ (ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ) నోటిఫికేషన్‌ వెలువడింది. దీని ద్వారా త్రివిధ దళాల విభాగాల్లో 02-06-2024 నుంచి ప్రారంభమయ్యే 152వ కోర్సులో, 114వ ఇండియన్‌ నేవల్‌ అకాడమీ (ఐఎన్‌ఏసీ) కోర్సులో ప్రవేశాలు పొందవచ్చు.
అర్హత: ఆర్మీ వింగ్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ఏదైనా గ్రూపులో ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలి. ఎయిర్‌ ఫోర్స్‌, నేవీ పోస్టులకు 10+2 క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌ (ఇండియన్‌ నేవల్‌ అకాడమీ) ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి.
వయసు: అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు 02-01-2005 - 01-01-2008 మధ్య జన్మించాలి.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటెలిజెన్స్‌- పర్సనాలిటీ టెస్ట్‌, ఎస్‌ఎస్‌బీ టెస్ట్‌/ ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్టు తదితరాల ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.100 (ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది).
ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: 06-06-2023 వరకు.
ఆన్‌లైన్‌ రాత పరీక్ష: 03-09-2023.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, హైదరాబాద్‌, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌.
వెబ్‌ సైట్‌:https://upsconline.nic.in/


కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 349 ఖాళీలతో కంబైన్డ్‌  డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీడీఎస్‌ఈ) ప్రకటన వెలువరించింది. డిగ్రీ పూర్తిచేసుకున్న అవివాహిత పురుషులు, మహిళలు జూన్‌ 6లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్హత: మిలిటరీ అకాడెమీ, ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడెమీ పోస్టులకు ఏదైనా డిగ్రీ సరిపోతుంది. నేవల్‌ అకాడెమీ ఉద్యోగాలకు ఇంజినీరింగ్‌ వారు అర్హులు. ఎయిర్‌ఫోర్స్‌ పోస్టులకు డిగ్రీతోపాటు ఇంటర్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ చదివుండాలి. ఓటీఏ ఎస్‌ఎస్‌సీ నాన్‌ టెక్నికల్‌ పోస్టులకు మాత్రమే మహిళలు అర్హులు. చివరి సంవత్సరం పరీక్షలు రాసి, ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: ఇండియన్‌ మిలటరీ అకాడెమీ, నేవల్‌ అకాడెమీలకు జులై 2, 2000 - జులై 1, 2005 మధ్య జన్మించినవారు అర్హులు. ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీ పోస్టులకు జులై 2, 2000 - జులై 1, 2004 మధ్య జన్మించినవారు అర్హులు. ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీ పోస్టులకు జులై 2, 1999 - జులై 1, 2005 మధ్య జన్మించాలి.
ఎంపిక: మొదటి దశలో రాతపరీక్ష, ఇంటెలిజెన్స్‌ అండ్‌ పర్సనాలిటీ టెస్ట్‌, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల అధారంగా.
దరఖాస్తు ఫీజు: మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు లేదు. మిగిలినవారు రూ.200 చెల్లించాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు:  06-06-2023 వరకు.
పరీక్ష తేదీ: 03-09-2023.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, వరంగల్‌, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం.
వెబ్‌సైట్‌: https://upsc.gov.in/


ప్రవేశాలు
అలీ యావర్‌ జంగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో..

ముంబయిలోని అలీ యావర్‌ జంగ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌ డిజేబిలిటీస్‌ (దివ్యాంగజన్‌) ముంబయిలో పాటు ఇతర ఏవైజేఎన్‌ఐఎస్‌హెచ్‌డీడీ క్యాంపస్‌లలో కింది డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, డిప్లొమా ప్రోగ్రాముల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
క్యాంపస్‌లు: ముంబయి, కోల్‌కతా, సికింద్రాబాద్‌, జన్లా, భోపాల్‌.
1. ఎంఎస్సీ (అడియాలజీ): రెండేళ్లు
2. ఎంఎస్సీ (స్పీచ్‌ లాంగ్వేజ్‌ పాథాలజీ): రెండేళ్లు
3. డిగ్రీ (అడియాలజీ అండ్‌ స్పీచ్‌ లాంగ్వేజ్‌ పాథాలజీ): నాలుగేళ్లు
4. డిప్లొమా (హియరింగ్‌, లాంగ్వేజ్‌ అండ్‌ స్పీచ్‌): ఏడాది
5. ఎంఈడీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ (హియరింగ్‌ ఇంపైర్‌మెంట్‌): రెండేళ్లు
6. బీఈడీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ (హియరింగ్‌ ఇంపైర్‌మెంట్‌): రెండేళ్లు
7. డీఎడ్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ (హియరింగ్‌ ఇంపైర్‌మెంట్‌): రెండేళ్లు
8. డిప్లొమా ఇన్‌ ఇండియన్‌ సైన్‌ లాంగ్వేజ్‌ ఇంటర్‌ప్రెటర్‌ కోర్సు: రెండేళ్లు
9. పీజీ డిప్లొమా ఇన్‌ ఆడిటరీ వెర్బల్‌ థెరపీ: ఏడాది
10. పీజీ డిప్లొమా ఇన్‌ రిహాబిలిటేషన్‌ సైకాలజీ: ఏడాది
11. డిప్లొమా ఇన్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ (ఆటిజం స్పెక్ట్రమ్‌ డిజార్డర్స్‌): రెండేళ్లు
12. డిప్లొమా ఇన్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ (ఇంటలెక్చువల్‌ డిజేబిలిటీ): రెండేళ్లు
అర్హత: కోర్సును అనుసరించి 10+2, డిగ్రీ, బీఈడీ.
ఎంపిక: ప్రవేశ పరీక్ష ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 30-06-2023.
ప్రవేశపరీక్ష నిర్వహణ: 08-07-2023, 15-07-2023, 30-07-2023.
వెబ్‌సైట్‌: https://www.ayjnihh.nic.in/


సీఎఫ్‌టీఆర్‌ఐ, మైసూరులో ఎంఎస్సీ  

మైసూరులోని సీఎస్‌ఐఆర్‌- సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నలాజికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎఫ్‌టీఆర్‌ఐ) ఎంఎస్సీ (ఫుడ్‌ టెక్నాలజీ)లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం సీట్లు: 34
అర్హత: కనీసం 55% మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ (సైన్స్‌/ అగ్రికల్చర్‌/ ఇంజినీరింగ్‌/ టెక్నాలజీ).
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగు లకు రూ.1000; ఇతరులకు రూ.2000.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 22-06-2023.
అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌ ప్రారంభం: 12-07-2023.
ప్రవేశ పరీక్ష తేదీ: 23-07-2023.
వెబ్‌సైట్‌: https://www.cftri.res.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు