ఉద్యోగాలు

కటక్‌లోని స్వామి వివేకానంద నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిహాబిలిటేషన్‌ ట్రైనింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన 77 టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 22 May 2023 00:42 IST

77 టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు

టక్‌లోని స్వామి వివేకానంద నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిహాబిలిటేషన్‌ ట్రైనింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన 77 టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హతలు: పోస్టును అనుసరించి 10+2, డిప్లొమా, సర్టిఫికెట్‌, డిగ్రీ, పీజీ, డీఈడీ, బీఈడీ, ఎంఈడీ, పీజీ డిప్లొమా, ఎంఫిల్‌, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం.

ఎంపిక: రాత పరీక్ష, విద్యార్హతలు, పని అనుభవం ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 07.06.2023.

వెబ్‌సైట్‌: https://svnirtar.nic.in/


నేవీలో 372 ఛార్జ్‌మ్యాన్‌ పోస్టులు

ఇండియన్‌ నేవల్‌ సివిలియన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ద్వారా 372 ఛార్జ్‌మ్యాన్‌ పోస్టుల భర్తీకి భారత నౌకాదళం ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్యర్థులు హెడ్‌క్వార్టర్స్‌ వెస్టర్న్‌ నేవల్‌ కమాండ్‌ (ముంబయి), హెడ్‌క్వార్టర్స్‌ ఈస్టర్న్‌ నేవల్‌ కమాండ్‌ (విశాఖపట్నం), హెడ్‌క్వార్టర్స్‌ సదరన్‌ నేవల్‌ కమాండ్‌ (కొచ్చి), హెడ్‌క్వార్టర్స్‌ అండమాన్‌ అండ్‌ నికోబార్‌ కమాండ్‌ (పోర్ట్‌ బ్లెయిర్‌) యూనిట్లలో పని చేయాలి.

గ్రూప్‌: ఎలక్ట్రికల్‌, వెపన్‌, ఇంజినీరింగ్‌, కన్‌స్ట్రక్షన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌, ప్రొడక్షన్‌ ప్లానింగ్‌ అండ్‌ కంట్రోల్‌.

ట్రేడ్‌: ఎలక్ట్రికల్‌ ఫిట్టర్‌, ఎలక్ట్రానిక్స్‌ ఫిట్టర్‌, గైరో ఫిట్టర్‌, రేడియో ఫిట్టర్‌, రాడార్‌ ఫిట్టర్‌, సోనార్‌ ఫిట్టర్‌, ఇన్‌స్ట్రుమెంట్‌ ఫిట్టర్‌, కంప్యూటర్‌ ఫిట్టర్‌, వెపన్‌ ఫిట్టర్‌, బాయిలర్‌ మేకర్‌, ఇంజిన్‌ ఫిట్టర్‌, ఫౌండర్‌, జీటీ ఫిట్టర్‌, ఐస్‌ ఫిట్టర్‌, పైప్‌ ఫిట్టర్‌, మెషినిస్ట్‌, మెషినరీ కంట్రోల్‌ ఫిట్టర్‌, రెఫ్రిజిరేషన్‌ అండ్‌ ఏసీ ఫిట్టర్‌, ప్లేటర్‌, వెల్డర్‌, షిప్‌ రైట్‌, లాగర్‌, రిగ్గర్‌, షిప్‌ ఫిట్టర్‌, మిల్‌ రైట్‌, ఐస్‌ ఫిట్టర్‌ క్రేన్‌, పెయింటర్‌, సివిల్‌ వర్క్స్‌, పీపీ అండ్‌ సి.

అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ.

వయసు: 29-05-2023 నాటికి 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు రుసుము: రూ.278. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

ఎంపిక: రాత పరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా. ఏపీ, టీఎస్‌లో పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, హైదరాబాద్‌.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 29-05-2023.

వెబ్‌సైట్‌: https://indiannavy.cbexams.com/


ప్రవేశాలు

జవహర్‌ నవోదయ-11వ తరగతి లేటరల్‌ ఎంట్రీ

వహర్‌ నవోదయ విద్యాలయ (జేఎన్‌వీ)లో 11వ తరగతి (లేటరల్‌ ఎంట్రీ)లో ప్రవేశాలకు సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ దరఖాస్తులు కోరుతోంది.

జవహర్‌ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష-2023 11వ తరగతి లేటరల్‌ ఎంట్రీ.

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత.

వయసు: 01.06.2006 - 31.05.2008 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: పరీక్షలో మెరిట్‌ ఆధారంగా.

పరీక్షలో భాగంగా మెంటల్‌ ఎబిలిటీ, ఇంగ్లిష్‌, సైన్స్‌, సోషల్‌ సైన్సెస్‌, మ్యాథమెటిక్స్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పేపర్‌ ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 31.05.2023.

పరీక్ష తేదీ: 22.07.2023.

వెబ్‌సైట్‌: https://navodaya.gov.in/nvs/en/Home1


సీపీగెట్‌ - 2023

తెలంగాణలోని 8 విశ్వవిద్యాలయాల్లో పీజీ, పీజీ డిప్లొమా, ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే కామన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (సీపీగెట్‌) నోటిఫికేషన్‌ విడుదలైంది.  

అర్హతలు: పీజీ, పీజీడీ కోర్సులకు కనీసం 40% మార్కులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీఎడ్‌; ఐపీజీ కోర్సులకు కనీసం 50% మార్కులతో 10+2/ ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక: ప్రవేశ పరీక్ష, రిజర్వేషన్‌ రూల్‌ ఆధారంగా.

ప్రవేశ పరీక్ష: సంబంధిత సబ్జెక్టులో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ద్వారా.

రిజిస్ట్రేషన్‌ ఫీజు: సింగిల్‌ సబ్జెక్టుకు ఓసీ/ బీసీ అభ్యర్థులకు రూ.800; ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్‌ అభ్యర్థులకు రూ.600. అదనపు సబ్జెక్టుకు అన్ని కేటగిరీలకు రూ.450.

ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు: మే 12-జూన్‌ 11

ఆన్‌లైన్‌ ప్రవేశ పరీక్షలు: జూన్‌ చివరి వారం నుంచి

వెబ్‌సైట్‌: https://cpget.tsche.ac.in/


వాక్‌ ఇన్స్‌

మేనేజర్‌, జూనియర్‌ ఆఫీసర్‌లు

ఐ ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో 480 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ.

వయసు: 55 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు రుసుము: రూ.500; ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులకు ఫీజు  మినహాయింపు ఉంటుంది.

ఇంటర్వ్యూ తేదీలు: 25 నుంచి 30-05-2023 వరకు.

వేదిక: జీఎస్‌డీ కాంప్లెక్స్‌, సీఎస్‌ఎంఐ విమానాశ్రయం, టెర్మినల్‌-2, గేట్‌ నం.5, సహర్‌, అంధేరీ ఈస్ట్‌, ముంబయి.

వెబ్‌సైట్‌: http://www.aiasl.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు