నోటిఫికేషన్స్‌

చెన్నై ప్రధానకేంద్రంగా ఉన్న ఇండియన్‌ బ్యాంక్‌ 18 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 23 May 2023 05:13 IST

ఉద్యోగాలు

ఇండియన్‌ బ్యాంకులో స్పెషలిస్ట్‌లు

చెన్నై ప్రధానకేంద్రంగా ఉన్న ఇండియన్‌ బ్యాంక్‌ 18 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: ప్రొడక్ట్‌ మేనేజర్‌, టీమ్‌ లీడ్‌, సీఏ.

విభాగాలు: బ్యాంకింగ్‌ లావాదేవీలు-సేల్స్‌, ఇంటర్నెట్‌ చెల్లింపు గేట్‌వే, అగ్రిగేటర్‌, ఏపీఐ బ్యాంకింగ్‌, యూపీఐ, క్యాష్‌ అండ్‌ చెక్‌ చెల్లింపులు, బీ2బీ చెల్లింపులు తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్‌/ సీఏ/ ఎంసీఏ/ ఎంఎస్సీ/ ఎంటెక్‌/ ఎంబీఏ.

వయసు: కనీసం 25-35 ఏళ్లు ఉండాలి.

ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.1000.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

చిరునామా: Chief General Manager (CDO & CLO), Indian Bank Corporate Office, HRM Department, Recruitment Section 254n260, Avvai Shanmugam Salai, Royapettah, Chennai,  Pin - 600 014, Tamil Nadu.

దరఖాస్తుకు చివరి తేదీ: 29.05.2023

వెబ్‌సైట్‌: https://www.indianbank.in/career/#!


కోర్టుల్లో స్టెనోగ్రాఫర్‌లు

రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో పనిచేయటానికి 96 స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-3 పోస్టుల భర్తీకి తెలంగాణ హైకోర్టు దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: గ్రాడ్యుయేషన్‌.

* ఇంగ్లిష్‌ టైప్‌రైటింగ్‌లో అర్హత సాధించాలి.

* ఇంగ్లిష్‌లో నిమిషానికి 45 పదాలు టైప్‌ చేసే సామర్థ్యం ఉండాలి.

వయసు: 18-34 ఏళ్లు ఉండాలి.

ఎంపిక: ఇంగ్లిష్‌ షార్ట్‌హ్యాండ్‌ టెస్ట్‌లో మెరిట్‌ ఆధారంగా.

144 టైపిస్ట్‌ పోస్టులు

రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో పని చేయటానికి 144 టైపిస్ట్‌ పోస్టుల భర్తీకి తెలంగాణ హైకోర్టు దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ.

* ఇంగ్లిష్‌ టైప్‌రైటింగ్‌లో అర్హత సాధించాలి.

* ఇంగ్లిష్‌లో నిమిషానికి 45 పదాలు టైప్‌ చేసే సామర్థ్యం ఉండాలి.

వయసు: 18-34 ఏళ్లు ఉండాలి.

ఎంపిక: ఇంగ్లిష్‌ టైప్‌రైటింగ్‌ టెస్ట్‌(స్కిల్‌ టెస్ట్‌) ఆధారంగా.

84 కాపీయిస్ట్‌ పోస్టులు

రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో పని చేయటానికి 84 కాపీయిస్ట్‌ పోస్టుల భర్తీకి తెలంగాణ హైకోర్టు దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: 12వ తరగతి/ ఇంటర్మీడియట్‌

* ఇంగ్లిష్‌ టైప్‌రైటింగ్‌లో అర్హత సాధించాలి.

* ఇంగ్లిష్‌లో నిమిషానికి 45 పదాలు టైప్‌ చేసే సామర్థ్యం ఉండాలి.

వయసు: 18-34 ఏళ్లు ఉండాలి.

ఎంపిక: ఇంగ్లిష్‌ టైప్‌రైటింగ్‌ టెస్ట్‌(స్కిల్‌ టెస్ట్‌) ఆధారంగా.

ఈ మూడు రకాల పోస్టులకూ...

దరఖాస్తు ఫీజు: రూ.400.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 25.05.2023 నుంచి.

దరఖాస్తుకు చివరి తేదీ: 15.06.2023.

స్కిల్‌ టెస్ట్‌ తేదీ: జులై 2023.

వెబ్‌సైట్‌: https://tshc.gov.in/getRecruitDetails


ప్రవేశాలు

నిఫ్టెమ్‌లో వివిధ ప్రోగ్రాములు

భారత ప్రభుత్వ ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వశాఖకు చెందిన హరియాణా (సోనిపట్‌)లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ టెక్నాలజీ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (నిఫ్టెమ్‌) వివిధ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

1) బీటెక్‌ ప్రోగ్రాం (ఫుడ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌)

కోర్సు వ్యవధి: నాలుగేళ్లు.

అర్హత: ఇంటర్మీడియట్‌ (10+2)తో పాటు జేఈఈ (మెయిన్స్‌)-2023 అర్హత.

ఎంపిక: సీఎస్‌ఏబీ నిర్వహించే సెంట్రల్‌ కౌన్సెలింగ్‌ ద్వారా.

2) ఎంటెక్‌ ప్రోగ్రాం

విభాగాలు: ఫుడ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌, ఫుడ్‌ ప్రాసెస్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌, ఫుడ్‌ సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌, ఫుడ్‌ ప్లాంట్‌ ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌.

కోర్సు వ్యవధి: రెండు సంవత్సరాలు.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో నాలుగేళ్ల బ్యాచిలర్స్‌ డిగ్రీ/ మాస్టర్స్‌ డిగ్రీ.

3) ఎంబీఏ ప్రోగ్రాం

కోర్సు వ్యవధి: రెండేళ్లు.

విభాగాలు: ఫుడ్‌ అండ్‌ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, మార్కెటింగ్‌/ ఫైనాన్స్‌/ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ

4) పీహెచ్‌డీ ప్రోగ్రాం

విభాగాలు: అగ్రికల్చర్‌, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్‌, బేసిక్‌ అండ్‌ అప్లైడ్‌ సైన్సెస్‌, ఫుడ్‌ ఇంజినీరింగ్‌, ఫుడ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌, ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ.

దరఖాస్తు ఫీజు: ఇతరులకు రూ.1000, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.500.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 15.06.2023.

వెబ్‌సైట్‌: http://niftem.ac.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని