నోటిఫికేషన్స్
ఉద్యోగాలు
ఎన్‌టీపీసీలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
న్యూదిల్లీలోని ప్రభుత్వరంగ సంస్థ- ఎన్‌టీపీసీ లిమిటెడ్ 300 అసిస్టెంట్ మేనేజర్ (ఆపరేషన్/ మెయింటెనెన్స్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఇంజినీరింగ్ విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్.
అర్హత: 60% మార్కులతో బీఈ, బీటెక్‌తో పాటు ఏడేళ్ల పని అనుభవం ఉండాలి. వయసు: 35 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక: పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు రుసుము: రూ.300 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు మినహాయింపు ఉంటుంది). ఆన్‌లైన్ దరఖాస్తుకు
చివరి తేదీ: 02-06-2023. వెబ్‌సైట్:https://carees.ntpc.co.in/recruitment/index.php.
అగ్రికల్చరల్ రిసెర్చ్ సర్వీస్ పరీక్ష
భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో న్యూదిల్లీలో ఉన్న అగ్రికల్చరల్ సైంటిస్ట్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ 2023 సంవత్సరానికి గాను అగ్రికల్చరల్ రిసెర్చ్ సర్వీస్ ద్వారా 260 అగ్రికల్చర్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: ప్లాంట్ పాథాలజీ, సీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, యానిమల్ బయోటెక్నాలజీ, జెెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, ఎకనామిక్ బోటనీ, అగ్రికల్చరల్ మైక్రోబయాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ, ఫ్రూట్ సైన్స్, వెటర్నరీ పబ్లిక్ హెల్త్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫిష్ ప్రాసెసింగ్, అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ. వయసు: 21-35 ఏళ్లు ఉండాలి. ఎంపిక: రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.800.
దరఖాస్తుల ప్రారంభం: 05.07.2023 నుంచి.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 26.07.2023.
ఏఆర్‌ఎస్ పరీక్ష తేదీ: అక్టోబర్/ నవంబర్ 2023.
వెబ్‌సైట్: https://www.asrb.org.in/.
ప్రవేశాలు
శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞానపీఠాల్లో..
తిరుమల తిరుపతి దేవస్థానాలు నిర్వహించే శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞానపీఠాల్లో 2023-24 విద్యాసంవత్సరానికి ప్రవేశ ప్రకటన వెలువడింది. వైదిక సంప్రదాయం ప్రకారం ఉపనయనం పూర్తయిన బాలురు జూన్ 15లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
శ్రీ వేంకటేశ్వర వేదవిజ్ఞాన పీఠాలున్న ప్రదేశాలు: ధర్మగిరి(తిరుమల), కీసరగుట్ట, విజయనగరం, ఐ.భీమవరం, నల్గొండ, కోటప్పకొండ.
కోర్సులు...
రుగ్వేదం, శుక్లయజుర్వేదం, కృష్ణయజుర్వేదం, సామవేదం, దివ్య ప్రబంధం, వైఖానసాగమం, పాంచరాత్ర ఆగమం, చాత్తాద శ్రీవైష్ణవ ఆగమం, శైవాగమం, తంత్రసార ఆగమం, రుగ్వేద స్మార్తం, శుక్లయజుర్వేద స్మార్తం, కృష్ణయజర్వేద స్మార్తం, వైఖానస స్మార్తం తదితరాలు.
అర్హత: కోర్సును అనుసరించి ఐదు, ఏడో తరగతి చదివి ఉండాలి. దరఖాస్తు: తితిదే వెబ్‌సైట్‌లో సూచించిన దరఖాస్తు నమూనాను పూర్తిచేసి, ధ్రువపత్రాలను సంబంధిత వేద విజ్ఞానపీఠం చిరునామాకు పంపాలి. దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 15.
వెబ్‌సైట్: https://www.tirumala.org/.
బిట్ మెస్రాలో బీబీఏ, బీసీఏ
రాంచీలోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెస్రా బీబీఏ, బీసీఏలలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
క్యాంపస్‌లు: దేవ్‌ఘర్, జైపుర్, లాల్‌పూర్, నోయిడా, పట్నా.
వ్యవధి: ఫుల్ టైం నాలుగేళ్లు (8 సెమిస్టర్లు)
సీట్లు: బీబీఏ- 230, బీసీఏ- 230.
అర్హత: బీబీఏకు కనీసం 50% మార్కులతో (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45%) పన్నెండో తరగతి/ తత్సమాన అర్హత పరీక్ష (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45%). బీసీఏకు కనీసం 50% మార్కులతో (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45%) పన్నెండో తరగతి/ తత్సమాన అర్హత పరీక్ష (మ్యాథ్స్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ ప్రాక్టీస్/ ఇన్ఫర్మేషన్ టెక్ ప్రోగ్రాం/ బయాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక: అభ్యర్థులు 12వ తరగతి/ ఇంటర్మీడియట్/ తత్సమాన అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.1,500 (జనరల్/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు); రూ.1,000(ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు).
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 18-06-2023.
ఫలితాల ప్రకటన: 23-06-2023.
బీ ఫార్మసీ ప్రోగ్రామ్
రాంచీలోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెస్రా క్యాంపస్‌లో బీఫార్మసీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వ్యవధి: ఫుల్ టైం నాలుగేళ్లు (8 సెమిస్టర్లు)
అర్హత: కనీసం 50% మార్కులతో (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45%) పన్నెండో తరగతి/ తత్సమాన అర్హత పరీక్ష(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్/ బయాలజీ)తో పాటు జేఈఈ(మెయిన్) 2023 లేదా నీట్-యూజీ 2023 ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక: అకడమిక్ మెరిట్, జేఈఈ (మెయిన్) 2023/ నీట్-యూజీ 2023 స్కోరు ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.1,500 (జనరల్/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు); రూ.1,000(ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు).
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15-06-2023.
వెబ్‌సైట్: https://www.bitmesra.ac.in/.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap Govt-GPS: మరోసారి జీపీఎస్ బిల్లులో మార్పులు చేసిన ఏపీ ప్రభుత్వం
-
KTR: అమృతకాల సమావేశాల్లో తెలంగాణపై మోదీ విషం చిమ్మారు: మంత్రి కేటీఆర్
-
Canada Army: ‘అది రాజకీయ సమస్య.. సైనిక సంబంధాలపై ప్రభావం చూపదు!’
-
TS High Court: టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దుపై విచారణ వాయిదా
-
Jewellery Shop: నగల దుకాణంలో భారీ చోరీ.. రూ. 25 కోట్ల విలువైన ఆభరణాలు దోచుకెళ్లిన దొంగలు
-
Cricket News: బీసీసీఐ ఏజీఎంలో కీలక నిర్ణయాలు.. భారత్ ఇంకా మెరుగవ్వాలి.. మెగా టోర్నీకి కేన్ సిద్ధం!